• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చైనా వైరస్ వల్లే సర్వనాశనం - డ్రాగన్‌పై చర్యలకు ట్రంప్ డిమాండ్ - ఐరాసలో స్పీచ్ - WHOపైనా ఫైర్

|

గడిచిన తొమ్మిది నెలలుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా మహమ్మారి ఇప్పటికే దాదాపు 10 లక్షల మందిని బలితీసుకుంది. గ్లోబల్ గా ఇన్ఫెక్షన్ల సంఖ్య 3కోట్లు దాటింది. ప్రతినిత్యం లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఒక్క చైనా తప్ప ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోయాయి. జీడీపీలు మైనస్ లోకి వెళ్లిపోయాయి. ఈ విలయానికి కారకురాలు ముమ్మాటికీ చైనానే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి 75వ సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కీలక ప్రసంగం చేసిన ఆయన డ్రాగన్ దేశంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జగన్ మౌనం బద్దలైతే ఊడేదేంటి? - అమిత్ షాతో ఆ విషయమా? స్వరూపానంద మౌనమేల?: ఎంపీ రఘురామ

75 ఏళ్ల తర్వాత మరో యుద్ధం..

75 ఏళ్ల తర్వాత మరో యుద్ధం..

రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత దేశాల మధ్య శాంతి స్థాపన కోసం ఐక్యరాజ్యసమితి ఏర్పాటైందన్న విషయాన్ని గుర్తుచేస్తూ.. మళ్లీ 75 ఏళ్ల తర్వాత ప్రపంచం అతి పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నదని, కనిపించని శత్రువైన ‘చైనా వైరస్'తో యుద్ధం చేస్తున్నదని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. 188 దేశాల్లో అనేక మంది ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారని, ఒక్క అమెరికాలోనే రెండు లక్షల మంది చనిపోయారని, ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య 10లక్షలుగా ఉందని చెప్పారు. ఈ విపత్తుకు కారకురాలు చైనాయే అంటూ కీలక డిమాండ్లను ప్రస్తావించారు ట్రంప్..

జవాబుదారి చైనాయే..

జవాబుదారి చైనాయే..

‘‘ప్రపంచ వ్యాప్తంగా వైరస్ వ్యాపక్తికి కారణమైన చైనాను కచ్చితంగా జవాబుదారీ చేయాలి. చైనా ఎంతో తెలివిగా.. దేశీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించి, అంతర్జాతీయ ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా వైరస్ వ్యాప్తికి కారణమైంది. ఇవాళ కాకుంటే రేపు మనం వైరస్ పై విజయం సాధిస్తాం. అమెరికానే వ్యాక్సిన్ ను ప్రపంచ దేశాలకు అందిస్తుంది. ప్రపంచం ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, చైనా చేసిన భారీ తప్పిదాలకుగానూ దానిపై కఠిన చర్యలు తీసుకోవాలి'' అని ట్రంప్ పేర్కొన్నారు.

తిరుమల: మంత్రి కొడాలి నాని బిగ్ బాంబ్ - మోదీని భార్యతో వెళ్లమనండి - వీర్రాజుకు పదవి తర్వాతే దాడులు

చైనా పాటకు డబ్ల్యూహెచ్ఓ డప్పు..

చైనా పాటకు డబ్ల్యూహెచ్ఓ డప్పు..

కరోనా వైరస్ ప్రపంచాన్ని ముంచెత్తడంలో చైనా పాత్ర ఎంతుందో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కూడా అంతే బాధ్యత వహించాలని ట్రంప్ అన్నారు. చైనా చెప్పినట్టల్లా డబ్ల్యూహెచ్ఓ ఆడుతోందని, పరస్పర విరుద్ధ ప్రకటనలతో ప్రజల్ని ప్రమాదంలోకి పడేసిందని ఆయన ఆరోపించారు. అందుకే చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్థలతో అమెరికా సంబంధాలు తెంచుకోవాలనుకుంటున్నదని,ఏది ఏమైనా వైరస్ కు చరమగీతం పాడే విషయంలో తాము కీలకంగా వ్యవహరిస్తామని ట్రంప్ అన్నారు.

ప్రపంచ శాంతికి అమెరికా కృషి

ప్రపంచ శాంతికి అమెరికా కృషి

కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి 75వ సాధారణ అసెంబ్లీ సమావేశాలు వర్చువల్ విధానంలో సాగుతుండటం తెలిసిందే. అందులో భాగంగా రెండురోజుల కిందట భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఐరాసను సంస్కరించాలని కీలక వ్యాఖ్యలు చేశారు. తర్వాతి రోజు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మాట్లాడుతూ.. తాము ఏ దేశంతోనూ కోల్డ్ వార్ లేదా హాట్ వార్ జరపబోమని, కరోనా కట్టడికి తమ వంతు ప్రయత్నం చేశామని చెప్పుకున్నారు. మంగళవారంనాటి ప్రసంగంలో ట్రంప్.. కరోనాతోపాటు పలు అంశాలను ప్రస్తావించారు. ఇరాన్ ను ఏకాకిని చేయడం, గల్ఫ్ దేశాలతో ఇజ్రాయెల్ మధ్య ఒప్పందాలు కుదర్చడం తదితర ప్రయత్నాలతో ప్రపంచ శాంతికి అమెరికా కృషిచేస్తున్నదని ట్రంప్ తెలిపారు.

English summary
President Donald Trump assailed China as the coronavirus villain Tuesday in a strongly worded United Nations speech, extolling his own actions in the pandemic and demanding that the global organization hold accountable “the nation which unleashed this plague onto the world.” Trump’s speech made via prerecorded video to a General Assembly that was drastically curtailed because of the pandemic was followed by a recorded speech from President Xi Jinping of China, who called the coronavirus a crisis shared by everyone. Offering no hint of contrition, Xi portrayed his nation of 1.4 billion people as having acted responsibly to combat COVID-19, the disease caused by the virus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X