• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉత్తరకొరియా దుస్సాహసం! సిరియాలోని రసాయనిక ఆయుధాల ఫ్యాక్టరీలకు ముడిసరుకుల సరఫరా!?

By Ramesh Babu
|

న్యూయార్క్: ఉత్తరకొరియా ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఆ దేశాన్ని పాలిస్తున్న నియంత కిమ్ జోంగ్ ఉన్ ప్రపంచానికే ప్రమాదకరంగా మారుతున్నాడు. అగ్రరాజ్యం అమెరికాతో 'ఢీ అంటే ఢీ' అంటోన్న సంగతి తెలిసిందే. ఉత్తరకొరియా కట్టడికి ఇటు అమెరికా, అటు ఐక్యరాజ్యసమితి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఉపయోగం లేకుండా పోతోంది.

అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికే ఐక్యరాజ్య సమితిచే ఉత్తరకొరియాపై పలు ఆంక్షలు విధింపజేసింది. ఆ దేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతులను కూడా నిషేధించింది. అయినా సరే అటు రష్యా, ఇటు చైనా సహాయంతో.. ఉత్తరకొరియా రహస్యంగా ఎగుమతులు చేస్తూనే ఉంది.

ఉత్తరకొరియాకు ఊహించని షాకిచ్చిన ట్రంప్.. మళ్లీ భారీగా ఆంక్షలు!

సిరియాలో రసాయనిక ఆయుధాలు...

సిరియాలో రసాయనిక ఆయుధాలు...

అసలే అంతర్యుద్ధంతో సిరియా అట్టుడికిపోతోండగా ఉత్తరకొరియా అగ్నికి ఆజ్యంలా ఆ దేశానికి రహస్యంగా రసాయనిక ఆయుధాల తయారీకి అవసరమైన వస్తువులు సరఫరా చేస్తోంది. వేర్పాటువాద మిలిటెంట్లు, ఉగ్రవాద సంస్థలు, ప్రభుత్వ దళాల మధ్య నిత్యం బాంబు దాడులు, తుపాకుల మోత సిరియా దద్దరిల్లిపోతోంది. వేర్పాటువాదులను ఏరిపారేసేందుకు సిరియా ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో రసాయనిక ఆయుధాల ప్రయోగానికి కూడా అక్కడి ప్రభుత్వం వెనకాడడం లేదు. గతంలో క్లోరిన్ వాయువును ప్రయోగించి మిలిటెంట్లతోపాటు వందలాది మంది పౌరుల ప్రాణాలు తీసిన సిరియన్ ప్రభుత్వం ఇప్పుడు రసాయన ఆయుధాల తయారీకోసం ఫ్యాక్టరీలే స్థాపించినట్లు తెలుస్తోంది.

గుట్టు వీడింది, ఉత్తరకొరియాకు అక్కడ్నించే న్యూక్లియర్ టెక్నాలజీ, కనిపెట్టిన జర్మనీ ఇంటెలిజన్స్!

  సిరియాలో లైంగిక వాంఛ తీరిస్తేనే మహిళలకు అన్నం
  క్లోరిన్ వాయువుతో మారణహోమం...

  క్లోరిన్ వాయువుతో మారణహోమం...

  సిరియాలో ప్రభుత్వ దళాలు మిలిటెంట్లను మట్టుపెట్టేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నాయి. తుపాకులు, బాంబులు, చివరికి రసాయనిక ఆయుధాలు ప్రయోగించడానికి కూడా సిరియన్ ప్రభుత్వం వెనకాడడం లేదు. గతంలో ఒకసారి క్లోరిన్ వాయువును ప్రయోగించగా మిలిటెంట్ల మాట అటుంచి దాని ప్రభావానికి వివిధ ప్రాంతాల్లో వందలాది మంది చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వారంతా నిద్రలోంచే శాశ్వత నిద్రలోకి జారిపోవడంతో ఈ ప్రయోగం వెలుగులోకి వచ్చింది. ఈ చర్యతో సిరియా ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంది. తాము రసాయనిక ఆయుధాలు ప్రయోగించడం లేదంటూ పైకి బొంకినా అది నిజం కాదని ప్రపంచ దేశాలకు తెలుసు.

  చేతులు కలిపిన ఉత్తరకొరియా...

  చేతులు కలిపిన ఉత్తరకొరియా...

  తాజాగా ప్రపంచానికే పెను ప్రమాదంగా పరిణమించిన ఉత్తరకొరియాతో సిరియా ప్రభుత్వం చేతులు కలిపినట్లు తెలుస్తోంది. వరుస క్షిపణి పరీక్షలతో అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచ దేశాలను గడగడలాడించిన ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ సిరియాతో రహస్య సంబంధాలు నెరుపుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. తాజాగా ఐక్య రాజ్య సమితి కూడా ఈ విషయాన్ని ఓ నివేదికలో పేర్కొంది. సిరియాలో రసాయనిక ఆయుధాల ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలకు ఉత్తరకొరియా నుంచి అవసరమైన సామగ్రి అందుతోందనేది తాజా ఆరోపణ. 20012-2017 మధ్య నలభై కంటే ఎక్కువ సార్లు ఉత్తరకొరియా నుంచి సిరియాకు వివిధ సామగ్రి సరఫరా అయినట్లు ఐక్యరాజ్య సమితి ఓ నివేదికలో పేర్కొంది.

  ఎక్విప్‌మెంట్ ఉత్తరకొరియా నుంచే...

  ఎక్విప్‌మెంట్ ఉత్తరకొరియా నుంచే...

  అంతర్యుద్ధంంతో రగులుతున్న సిరియాకు.. ఉత్తరకొరియా రసాయనిక ఆయుధాల తయారీకి అవసరమయ్యే సామగ్రి, ఇతర వస్తువులు సరఫరా చేస్తోందట. ఈ విషయాన్ని అమెరికా మీడియాయే బయటపెట్టింది. మరోవైపు ఐక్యరాజ్య సమితి నిపుణులు ఈ విషయాన్ని వెల్లడించారు. యాసిడ్ రెసిస్టెంట్ టైల్స్, వాల్వ్స్, పైపులు తదితర సామగ్రిని సిరియాకు అమ్ముతోందట. అంతేకాదు, సిరియాలో ఉన్న ఆయుధాల తయారీ ఫ్యాక్టరీలో ఉత్తరకొరియా క్షిపణి స్పెషలిస్టులు కూడా కనిపించినట్లు ఐక్యరాజ్య సమితి తన నివేదికలో పేర్కొంది. ఈ ఫ్యాక్టరీల్లో తయారయ్యే రసాయనిక ఆయుధాలను సిరియా ప్రభుత్వం మిలిటెంట్లు, ఉగ్రవాదుల ఏరివేతకు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.

  English summary
  North Korea has been sending missile specialists to Syria as well as equipment that could be used in the production of chemical weapons, U.S. media report. The February 27 reports said UN experts found more than 40 previously unreported shipments of such supplies to Syria between 2012 and 2017. The materials said to have been illicitly sent to Syria included acid-resistant tiles, corrosion-resistant valves, and thermometers.An unreleased UN report assessing North Korea's compliance with UN resolutions says an unnamed UN member state has spotted Pyongyang's technicians at Syrian chemical-weapons and missile facilities.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X