వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీతాలకు బదులు స్త్రీలపై అత్యాచారాలు: ఐరాస రిపోర్ట్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

జెనీవా: దేశంలో జరిగిన సివిల్ వార్ సమయంలో జీతానికి బదులు మహిళలపై అత్యాచారాలు, ఆస్తుల దోపిడీ, బాలికలను బలవంతంగా ఎత్తుకుపోవడం లాంటి ఘటనలను సూడాన్ సైనిక ప్రభుత్వం ప్రోత్సహించిందట. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది.

ప్రపంచంలోనే ఏ దేశంలో జరగని విధంగా దక్షిణ సూడాన్‌లో అత్యంత దారుణమైన రీతిలో మానవ హక్కుల ఉల్లంఘన, ఆటవిక పాలన జరుగుతుందని ఐరాస నివేదికతో బట్టబయలైంది. గత అక్టోబర్ నుంచి జనవరి వరకు సుమారు ఆరు నెలల పాటు దక్షిణ సూడాన్‌లో జరిగిన ఘటనలపై ఐక్యరాజ్యసమితి బృందం అధ్యయనం చేసింది.

UN report: South Sudan allowed soldiers to rape civilians in civil war

ఐదేళ్లుగా అక్కడ చోటు చేసుకుంటున్న ఇంటర్నేషనల్ కమ్యూనిటీ పట్టించుకోవడం లేదని నివేదిక విడుదల సందర్భంగా యూఎన్ మానవహక్కుల కమిషన్ చీఫ్ జీద్‌రాద్ అల్ హుస్సేనీ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఆ డాక్యమెంట్లకు సంబంధించిన వివరాలను విడుదల చేశారు.

కళ్ల ఎదుటే తమ పిల్లలు లైంగికదాడులకు గురయ్యారని పలువురు తల్లిదండ్రులు భోరున విలపించారని ఆయన పేర్కొన్నారు. ఐదేళ్లుగా అక్కడ చోటుచేసుకొంటున్న అకృత్యాలను ఈ ఘోరాలన్నింటికి ప్రభుత్వాధినేతలే కారణమని ఆయన ఆరోపించారు. గతేడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఒక్క యూనిటీ రాష్ట్రంలోనే 1300 రేప్ కేసులు జరిగాయని అన్నారు.

ఈ సంక్షోభాన్ని నివారించడంలో న్యాయవ్యవస్థ విఫలమైతే.. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నేరుగా జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జీద్ నివేదిక సిఫారసుల అమలుపై ఐక్యరాజ్యసమితి దృష్టి సారించింది. డిసెంబర్ 2013 నుంచి కూడా సూడాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరగడం మొదలైంది.

English summary
The South Sudanese government has conducted a “scorched earth policy” against civilians caught up in the country’s civil war, allowing its soldiers and allied militias to rape women in lieu of wages, torture and murder suspected opponents and deliberately displace as many people as possible, according to a UN report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X