వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐక్యరాజ్యసమితిని తాకిన విశాఖ విషవాయువు..!విషాదం పట్ల స్పందించిన ఐరాస ప్రధాన కార్యదర్శి..!!

|
Google Oneindia TeluguNews

లండన్/హైదరాబాద్ : విశాఖపట్టణంలో చెలరేగిన విషవాయువు సంఘటన, దాని వల్ల కలిగిన ప్రాణనష్టం పట్ల ఐకరాజ్యసమితి దిగ్బ్రంతి వ్యక్తం చేసింది. జరిగిన దుర్ఘటన చాలా విషాదకరమని, మానవ తప్పిదాల వల్ల జరుగుతున్న పొరపాట్ల వల్ల అప్రమత్తండా ఉండాల్సిన పరిస్థితులు తెలెత్తాయనే అభిప్రాయాన్ని ఐక్యరాజ్యసమితి కార్యదర్శి వ్యక్తం చేసారు.

వాయువు ఎప్పుడైనా ఆయువు తీయొచ్చు..!ఇక్కడే ఉండి ఏంచేయాలి..?విశాఖ నుండి భారీ వలసలు​..!!వాయువు ఎప్పుడైనా ఆయువు తీయొచ్చు..!ఇక్కడే ఉండి ఏంచేయాలి..?విశాఖ నుండి భారీ వలసలు​..!!

కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ఈ విషాదఘటన జరగడం అత్యంత విచారకరమని తెలిపారు. విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు మనోధైర్యం కోల్పోకుండా విపత్తులు అధిగమించాలని సూచించింది. క్లిష్ట సమయాన్ని అధిగమించే క్రమంలో ప్రాణహాని జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయాన్ని ఐరాసా వ్యక్తం చేసింది.

UN Secretary General responds to the Vizag tragedy..!

విశాఖ విషవాయువు ఘటన మృతులకు ఐక్యరాజ్యసమితి సంతాపం తెలిపింది. పన్నెండు మంది మృతికి కారణమైన ఈ దుర్ఘ‌ట‌నపై ఐక్యరాజ్యసమితి తీవ్ర‌ విచారం వ్యక్తం చేసింది. భారత అధికారులు ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తారన్న ఆశాభావాన్ని కూడా ఐక్యరాజ్యసమితి వ్యక్తం చేసింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు.

విషవాయువు విడుదల ఘటనలో మృతులకు సంతాపం తెలుపుతున్నామని, ఘటనలో అస్వస్థతకు గురైన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఘటనలపై సమగ్ర దర్యాప్తులు జరగాలి అని స్టెఫానీ డుజారెక్ అభిప్రాయ పడ్డారు. విశాఖపట్టణంలోని ఎల్​జీ పాలిమర్స్​లో గురువారం తెల్ల‌వారుజామున విష‌వాయువు లీకైయిన ఘ‌ట‌న‌లో పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.

English summary
The United Nations mourns the deaths of the Vishaka poisoning incident. The United Nations is deeply saddened by the tragedy that caused the deaths of twelve people. The United Nations also expressed hope that Indian authorities would conduct a comprehensive investigation into the incident. United Nations Secretary-General Antonio Gutierrez issued a statement to this effect.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X