వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రారంభమైన ఐక్యరాజ్యసమితి భద్రతా కౌన్సిల్ సమావేశం.. కశ్మీర్ అంశంపై చర్చ...

|
Google Oneindia TeluguNews

ఐక్యరాజ్యసమితి సమావేశం కాసేపటిక్రితం ప్రారంభమైంది. అయితే ఈ సమావేశం అమేరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షణ రహస్యంగా కొనసాగుతోంది. భద్రతా మండలిలో సభ్యత్వం ఉన్న దేశాల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ వ్యవహారంపై పాకిస్థాన్ ఐక్యరాజ్య సమితి పిర్యాధు చేయడంతో పాకిస్థాన్‌కు మద్దతు పలుకుతున్న చైనా ఒత్తిడితో ఈ సమావేశం కోనసాగుతోంది. అయితే ఐక్యరాజ్యసమితిలో అటు పాకిస్థాన్ గాని, భారత దేశం గాని లేకపోవడంతో ఎలంటీ పరిణామాలు జరగుతాయో అనే ఉత్కంఠ నెలకొంది.

జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి గల రాష్ట్ర హోదా కట్టబెట్టడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370 రద్దు వ్యవహారంపై మొదటి నుంచీ నిప్పులు చెరుగుతూ వస్తోన్న పొరుగు దేశం పాకిస్తాన్.. ఈ వ్యవహారాన్ని ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసింది. పాకిస్తాన్ చేసిన ఫిర్యాదు మేరకు.. ఆర్టికల 370 రద్దు వ్యవహారంపై చర్చించడానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశం అయింది. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న చైనా తీసుకొచ్చిన ఒత్తిడి మేరకే ఈ సమావేశం ఏర్పాటు కానుంది. పాకిస్తాన్ తో దోస్తీ చేస్తూ.. భారత్ పై కత్తి కట్టిన చైనా ఈ సమావేశంలో కీలక పాత్ర పోషించే అవకాశం లేకపోలేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

UN Security Council begun a closed door meeting

భద్రతా మండలిలో సభ్యత్వం ఉన్న దేశాల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొనబోతున్నారు. కొన్ని అరుదైన సందర్భాల్లోనే భద్రతా మండలి క్లోజ్డ్ డోర్స్ సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఆర్టికల్ 370 రద్దు వ్యవహారంపై పాకిస్తాన్ చేసిన విన్నపం మేరకు భద్రతా మండలి చాలాకాలం తరువాత క్లోజ్డ్ డోర్స్ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుండటం గమనార్హం. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి గల రాష్ట్ర హోదా కట్టబెట్టడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని విభజించి, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పార్లమెంట్ లో తీర్మానాన్ని ప్రవేశ పెట్టి, ఆమోదించిన విషయం తెలిసిందే.

English summary
Pakistan Prime Minister Imran Khan on Friday discussed the Kashmir issue with US President Donald Trump over phone, as the UN Security Council held a closed door meeting to discuss India revoking the special status of Jammu and Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X