వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డాన్ దావూద్ బర్త్ డే: ఐబీ నిఘా (ఫోటోలు)

|
Google Oneindia TeluguNews

కరాచి: పాకిస్థాన్ లో తలదాచుకుని నేర సామ్రాజ్యాన్ని శాసిస్తున్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం శనివారం 60 వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. పాక్ లో పెద్ద ఎత్తున బర్తేడే పార్టీతో పాటు షష్ఠిపూర్తి వేడుకలు నిర్వహించడానికి డీ కంపెనీ బ్యాచ్ భారీగా ఏర్పాట్లు చేసింది.

అయితే భద్రతా కారాణాల వలన డీ కంపెనీ దావూద్ బర్త్ డే వేడుకులు ఎక్కడ జరుగుతాయి అనే విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. ఆహ్వానం ఉన్న వారికి సైతం దావూద్ పుట్టిన రోజు వేడుకలు ఎక్కడ జరుగుతాయి అనే విషయం తెలియదు.

మీరు రండి మేము వచ్చి పికప్ చేసుకుంటాం అంటూ గెస్ట్ లకు చెబుతున్నారు. అయితే భారత్ నిఘా వర్గాలు సేకరించిన వివరాల ప్రకారం డీ కంపెనీ బాధ్యతల నుంచి దావూద్ శనివారం తప్పుకుంటారని సమాచారం.

కొత్త బాస్ ఎవరు అంటూ ఆసక్తి

కొత్త బాస్ ఎవరు అంటూ ఆసక్తి

డీ కంపెనీ కొత్త బాస్ ఎవరు అనే విషయం తెలుసుకోవడానికి పలువురు బిగ్ షాట్ లు, మాఫియా ముఠా నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

భారత్ కు అవసరం

భారత్ కు అవసరం

డీ కంపెనీ కొత్త బాస్ ఎవరు అనే విషయం తెలుసుకునేందుకు భారత్ నిఘా వర్గాలు వేచి ఉన్నాయి.

ఒక్క రోజు ముందు మోడీ పర్యటన

ఒక్క రోజు ముందు మోడీ పర్యటన

దావూద్ బర్త్ డే చేసుకునే ఒక్క రోజు ముందు భారత ప్రధాని నరేంద్ర మోడీ పాక్ లో పర్యటించారు.

దావూద్ ను పట్టుకుంటాం

దావూద్ ను పట్టుకుంటాం

దావూద్ ఇబ్రహీంను పట్టుకుని భారత్ తీసుకువస్తామని కేంద్ర ప్రభుత్వం పదేపదే చెబుతున్నది.

ప్రధాని ఆరా తీశారా ?

ప్రధాని ఆరా తీశారా ?

పాక్ పర్యటన సందర్బంగా భారత్ ప్రధాని నరేంద్ర మోడీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ దగ్గర దావూద్ ప్రస్తావన తీసుకు వచ్చారా అనే విషయం బయటకు రాలేదు.

నిఘా వర్గాలు

నిఘా వర్గాలు

దావూద్ ఇబ్రహీం బర్త్ డే వేడుకలకు ముంబై నుంచి ఎవరెవరు వెళుతున్నారు అని భారత్ నిఘా వర్గాలు వివరాలు సేకరిస్తున్నాయి.

భారత్ టూ దుబాయ్, అక్కడి నుంచి పాక్

భారత్ టూ దుబాయ్, అక్కడి నుంచి పాక్

భారత్ నిఘా వర్గాల ప్రకారం దావూద్ బర్త్ డే వేడుకలకు హాజరవుతున్న వారు మొదట గల్ఫ్ దేశాలు చేరుకుని అక్కడి నుంచి పాక్ వెళుతారని నిఘా వర్గాలు పసిగట్టాయి.

English summary
Dawood has decided that his failing health will not allow him to helm D-company's $10 billion multinational empire of drugs, betting, hawala, and arms smuggling.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X