వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి యూనిసెఫ్‌ రెడీ- డిసెంబర్‌ నాటికి 52 కోట్ల సిరంజ్‌లు సిద్దం..

|
Google Oneindia TeluguNews

కరోనా వ్యాక్సిన్‌ను వచ్చే ఏడాది ఆరంభం కల్లా అందుబాటులోకి తెచ్చేందుకు వివిధ దేశాలు, పరిశోధనా సంస్ధలు ప్రయోగాలు నిర్వహిస్తుండగా.. వీటికి డిమాండ్‌ కూడా అదే స్ధాయిలో ఉంది. భారత్‌లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కరోనా వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు మూడు సంస్ధలు సిద్ధమవుతున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది.

వివిధ దేశాల్లే కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం ఎంత ముఖ్యమో, దాన్ని ప్రజలకు అందించేందుకు ఇతరత్రా సామాగ్రి కూడా అంతే ముఖ్యం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఐక్యరాజ్యసమితికి చెందిన యునిసెఫ్‌ భారీ ఎత్తున వ్యాక్సిన్‌ వేసేందుకు వీలుగా సామాగ్రిని సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా 52 కోట్ల సిరంజ్‌లను తొలి విడుదగా సమకూర్చుకుంటోంది. వీటిని డిసెంబర్‌ నాటికి కొనుగోలు చేయడంతో పాటు పలు దేశాలకు పంపేందుకు ఏర్పాట్లు చే్స్తోంది. టీకాలు అందుబాటులోకి వచ్చే నాటికి ఇవి ఆయా దేశాల వద్ద సిద్ధంగా ఉండాలని యునిసెఫ్‌ భావిస్తోంది.

unicef to stockpile 52 Cr syringes by december to prepare for covid 19 vaccinations

Recommended Video

PM Modi Cautions Nation: No Laxity Till Vaccine Is Developed | Oneindia Telugu

సిరంజ్‌లతో పాటు 50 లక్షల సేఫ్టీ బాక్స్‌లను కూడా పలు దేశాలకు పంపేందుకు యునిసెఫ్‌ కొనుగోలు చేస్తోంది. ఓసారి కరోనా టీకాలు వేసిన తర్వాత వాడిన సిరంజ్‌లను సురక్షితంగా డిస్పోజ్‌ చేసేందుకు ఈ బాక్స్‌లు వాడనుంది. ఈ సిరంజ్‌లు ఎక్కడపడితే అక్కడ పారేయడం ద్వారా మరో విడత కరోనా ప్రబలే ప్రమాదం ఉందని భావిస్తున్న యునిసెఫ్‌ సేఫ్టీ బాక్స్‌లను అందుబాటులోకి తెస్తోంది. వీటిని కూడా విడదల వారీగా పలు దేశాలకు సరఫరా చేయబోతోంది. 2021 నాటికి వంద కోట్ల సిరంజ్‌లను అందుబాటులోకి తీసుకురావాలని యునిసెఫ్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

English summary
UNICEF said it will stockpile 520 million syringes in its warehouses, as part of a larger plan of one billion hypodermic needles by 2021, to guarantee initial supply and help ensure that syringes are available in countries before the COVID-19 vaccines arrive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X