వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్ష మంది నగ్న చిత్రాలు.. ఆన్‌లైన్‌లో మహిళలపై కొత్త రకం దాడి.. ఆ టూల్‌తో డీప్‌ ఫేక్ న్యూడ్స్

|
Google Oneindia TeluguNews

మహిళలపై ఆన్‌లైన్‌లో మరో కొత్త రకం దాడి మొదలైంది. ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్‌ను ఉపయోగించి మహిళల సాధారణ ఫోటోలను ఒరిజినల్‌లా కనిపించే(డీప్ ఫేక్) నకిలీ నగ్న చిత్రాలుగా మలిచే ఒక టూల్‌ను సైబర్ నేరస్తులు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా ఇప్పటికే లక్ష మంది మహిళలను టార్గెట్ చేశారని... ఓ సైబర్ రీసెర్చ్ ట్రాకింగ్ ఏజెన్సీ నివేదిక వెల్లడించింది. ఈ టూల్ ద్వారా ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్,టెలిగ్రామ్ తదితర ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉండే ఏ మహిళ ఫోటోనైనా నగ్న చిత్రంగా మలచవచ్చు. మొదట్లో సెలబ్రిటీల ఫోటోలను ఉపయోగించి పోర్నోగ్రఫీ కోసం ఇలాంటి డీప్ ఫేక్‌లను సృష్టించేవారు. ఇప్పుడు సాధారణ మహిళలు కూడా దీని బారినపడుతున్నారు.

పబ్లిక్ ప్లాట్‌ఫామ్స్‌లో మహిళల న్యూడ్స్...

పబ్లిక్ ప్లాట్‌ఫామ్స్‌లో మహిళల న్యూడ్స్...

'మా ఇన్వెస్టిగేషన్‌లో దీనికి సంబంధించి పలు కీలక ఆధారాలు సంపాదించాం. ఈ ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్‌ టూల్‌ను సృష్టించిన గుర్తు తెలియని ఆ సంస్థ జులై,2020 నాటికి 1,04,852 మంది మహిళల నగ్న చిత్రాలను క్రియేట్ చేసింది. అంతేకాదు,వాటిని పబ్లిక్ ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేసింది. గడిచిన 3 నెలల్లో ఈ నగ్న చిత్రాల సంఖ్య 198శాతం పెరిగింది. ఇప్పటివరకూ ఉన్న బాధితుల్లో ఎక్కువమంది రష్యాకు చెందిన మహిళలే ఉన్నారు. ఆ డీప్ ఫేక్స్‌ను క్రియేట్ చేసిన యూజర్స్‌లో 1,04,000 మంది రష్యా నుంచే ఉన్నారు.' అని సైబర్ రీసెర్చ్ ట్రాకింగ్ ఏజెన్సీ నివేదిక వెల్లడించింది.

అసలేంటీ ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్..

అసలేంటీ ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్..

ప్రస్తుతం ఈ ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్ టూల్ ఆన్‌లైన్‌లో ఉచితంగానే అందుబాటులో ఉంది. అయితే ఒకసారి యూజర్ ఒక డీప్ ఫేక్‌ను క్రియేట్ చేశాక... దాని తొలగించాలనుకుంటే 1.5డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. యూజర్ ఈ టూల్‌లో ఎవరైనా మహిళ ఫోటోను అప్‌లోడ్ చేయగానే... అది డీప్ ఫేక్‌ను క్రియేట్ చేస్తుంది. అంటే,కేవలం ముఖం మాత్రమే వారిది ఉంచి... మిగతా బాడీ పార్ట్ నగ్నంగా కనిపించేలా ఫేక్ ఇమేజ్‌ను ఆ ముఖానికి తగిలిస్తుంది. నిజానికి ఇలాంటి టూల్స్ ఆన్‌లైన్‌లో చాలా కాలం నుంచే ఉన్నాయి. అయితే మొదట్లో కేవలం సెలబ్రిటీలను మాత్రమే టార్గెట్ చేసి... వారి ఫోటోలతో ఇలాంటి డీప్ ఫేక్స్ క్రియేట్ చేస్తుండేవారు.

ఆ వెర్షన్‌కు దగ్గరి పోలికలు...

ఆ వెర్షన్‌కు దగ్గరి పోలికలు...

సెన్సిటీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం... ఆ టూల్ డీప్‌న్యూడ్స్‌ వెర్షన్‌కి సంబంధించినదిగా కనిపిస్తోంది. ఈ సాఫ్ట్‌వేర్‌ను 2019లో అనామక వ్యక్తులు అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో దాన్ని ఉపసంహరించుకున్నారు. అయితే జులై,2019లోనే డీప్‌న్యూడ్స్ క్రియేటర్స్... ఆ సాఫ్ట్‌వేర్ టూల్‌ను ఆన్‌లైన్‌ మార్కెట్ ప్లేస్‌లో మరో అనామక వ్యక్తికి 30వేల డాలర్లకు విక్రయించారు. ఆ సాఫ్ట్‌వేర్‌కు ఇప్పుడు ఆన్‌లైన్‌లో కనిపిస్తోన్న సాఫ్ట్‌వేర్ టూల్‌కు స్వల్ప వ్యత్యాసం ఉన్నట్లు సెన్సిటీస్ ఇన్వెస్టిగేషన్ ప్రతినిధులు చెప్పారు.

రష్యన్ల పనేనా...?

రష్యన్ల పనేనా...?

ఈ సాఫ్ట్‌వేర్ టూల్‌ సృష్టికర్తలు రష్యన్లే అయి ఉంటారని సెన్సిటీ చీఫ్ సైంటిస్ట్,సీఈవో గియర్గియో పత్రిని తెలిపారు. ఈ టూల్‌ను ఉపయోగిస్తున్న యూజర్లలో ఎక్కువమంది రష్యన్లే ఉండటం... బాధితుల్లోనూ రష్యన్ మహిళలే ఎక్కువగా ఉండటం ఇందుకు బలం చేకూరుస్తోందన్నారు. ఇలాంటి టూల్స్ కారణంగా పబ్లిక్ ప్లాట్‌ఫామ్స్‌లో మహిళలు వ్యక్తిగత ఫోటోలు షేర్ చేయడం రిస్క్‌గా మారుతోందన్నారు. వాళ్లు పోస్ట్ చేసే ఫోటోలతో ఎవరికి ఎలాంటి హానీ లేనప్పటికీ... దురదృష్టవశాత్తు వాటి ద్వారానే వారికి హాని కలుగుతోందన్నారు. భారత్‌లో ఇలాంటి నేరాలు సెక్షన్ 499,సెక్షన్ 354C,సెక్షన్ 66E,సెక్షన్ 67A కిందకు వస్తాయని ఇక్కడి నిపుణులు చెబుతున్నారు.

English summary
Online frauds and abuse have increased since the pandemic and lockdowns began all over the world. In one such case of online menace, an unidentified online service is letting people create fake nude images of women.The service was revealed in a report by an agency tracking deepfakes that uncovered a large network of growing ecosystem that has targeted at least 100,000 women.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X