• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

‘సెక్స్ సమయంలో చెప్పకుండా కండోమ్‌ తీసేస్తే రేప్‌ చేసినట్టే’

By BBC News తెలుగు
|
అమ్మాయి

రెండేళ్ల క్రితం గెమ్మా (పేరు మార్చాం) ఒక వ్యక్తితో శృంగారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆమె సమ్మతి లేకుండానే అతను కండోమ్‌ తీసేశారు.

'స్టెల్తింగ్’ లేదా భాగస్వామి సమ్మతి లేకుండా కండోమ్‌ను తీసేయడం బ్రిటన్‌లో చట్టవిరుద్ధం.

“నా విషయంలో జరిగే వరకు స్టెల్తింగ్ అంటే ఏంటో నాకు తెలీనే తెలీదు” అని బీబీసీ న్యూస్‌బీట్‌ కార్యక్రమంలో గెమ్మా చెప్పారు.

"ఏం జరిగిందో అర్థమయ్యాక నాకు చాలా కంగారు పుట్టింది. ఆ మర్నాడే గర్భం రాకుండా ఉండేందుకు పిల్ తీసుకున్నాను.

కానీ తరువాత నెల పీరియడ్స్ రాకపోవడంతో ప్రెగ్నన్సీ టెస్ట్‌కు వెళ్లాను. ఫలితాల్లో పాజిటివ్‌ వచ్చింది. గర్భవతినని తెలిశాక షాకయ్యాను” అని గెమ్మా చెప్పుకొచ్చారు.

శృంగారం, పునరుత్పత్తి

'అబార్షన్‌కు 50 పౌండ్లు అవుతుందంతే’

“నాకు చాలా కోపం వచ్చింది. ఆవేశంతో ఊగిపోయాను. అంతా గందరగోళంగా అనిపించింది.

దాంతో ఆ అబ్బాయికి మెసేజ్‌ చేశాను.

ఇది అసలు పెద్ద విషయమే కాదు అన్నట్టుగా అతను వ్యవహరించాడు. కేవలం 50 పౌండ్లు చెల్లిస్తే అబార్షన్‌ చేయించేసుకోవచ్చు అని సలహా ఇచ్చాడు.

కానీ ఈ పరిస్థితి నా జీవితంలో చాలా మార్పులు తీసుకొచ్చింది.

చివరికి నేను అబార్షన్‌ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాను.

అయితే, ఇది చాలా కష్టమైన నిర్ణయం. నాకు పెద్ద శిక్షలా ఉండేది. ఎందుకంటే బిడ్డ కావాలని ఓవైపు ఉండేది. కానీ, ఇవి సరైన పరిస్థితులు కాదని తెలుసు" అంటూ గెమ్మా వివరించారు.

గెమ్మా తన ఉదంతాన్ని పోలీసులకు చెప్పారు. కానీ కేసు ముందుకు సాగలేదు.

“నాపై జరిగింది అత్యాచారమని, అందువల్లే గర్భవతినయ్యానని తెలుసుకున్న తర్వాతే పోలీసులను సంప్రదించాను.

పోలీసులు ఆ అబ్బాయితో మాట్లాడినప్పుడు తనకేమీ తెలీదని బుకాయించాడు.

తగినన్ని ఆధారాలు లేవని పోలీసులు ఈ కేసును నీరుగార్చారు.

ఎందుకంటే ఇక్కడ నేను చెప్పిన మాటలు, నా భాగస్వామి చెప్పిన మాటలు తప్ప మరో ఆధారం లేదు. ఇద్దరం రెండు వెర్షన్లు చెప్పాం" అని ఆమె వివరించారు.

'మనం మాట్లాడుతున్నది అత్యాచారం గురించి’

స్టెల్తింగ్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్న మాట అని స్వచ్ఛంద సంస్థ 'రేప్ క్రైసిస్’ ప్రతినిధి అన్నారు.

“ఇప్పుడు ఇది ఎక్కువగా జరుగుతోందా లేక ప్రజల్లో దీని పట్ల అవగాహన పెరిగి ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుతున్నారా అనేది స్పష్టంగా తెలియట్లేదు” అని రేప్ క్రైసిస్‌కు చెందిన కేటీ రస్సెల్ అన్నారు. స్టెల్తింగ్ అనే పదం అంత ఉపయోగకరంగా లేదని ఆమె అంటున్నారు.

“ఇది సాపేక్షంగా కొత్త పదం. ఈ ఉదంతానికి ఒక పదం ఉండటం కొంతమేర ప్రయోజనకరంగానే ఉంటుంది. ఈ పదం ద్వారా ఇది ఏంటో ప్రజలకు తెలుస్తుంది. కానీ మరోవైపు ఇది కాస్త తప్పుదోవ పట్టించేదిగా కూడా ఉంది. ఇది ఓ రకంగా జరిగిన సంఘటనను తక్కువ చేసి చూపిస్తోంది. మనం మాట్లాడేది రేప్ గురించి. అది పెద్ద విషయం”

శృంగారం మధ్యలో కండోమ్ తీసివేయడం బ్రిటన్‌లో నేరం

“ఏకాభిప్రాయం లేకుండా శృంగార సమయంలో కండోమ్ తీసివేయడం ఏదో కొంటె విషయం కాదని, ఇలా చేయడం బాధిత వ్యక్తి మొత్తం జీవితం, ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాలను కలిగించే తీవ్రమైన అంశం అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి” అని కేటీ రస్సెల్ అన్నారు.

ఇలాంటి సంఘటనలను ఎక్కువగా అత్యాచార కేసుల కింద నమోదు చేయడంతో స్టెల్తింగ్ ఉదంతాలపై పోలీసుల వద్దగానీ, స్వచ్ఛంద సంస్థల వద్దగానీ ఎలాంటి స్పష్టమైన గణాంకాలు అందుబాటులో లేవు.

"ఇలాంటి కేసులను తప్పకుండా రిపోర్ట్ చేయమనే మేము చెబుతున్నాం" అని నేషనల్‌ పోలీస్‌ చీఫ్స్‌ కౌన్సిల్‌ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.

ఈడెం బార్బరా ఎన్‌టమీ కథ

స్టెల్తింగ్‌ని తాను కూడా ఎదుర్కొన్నానని ఈడెం బార్బరా చెప్పారు.

“నేను ఒకరితో శృంగారంలో పాల్గొన్నాను. ఆ సమయంలో నా అనుమతి లేకుండానే తను కండోమ్‌ తీసేశారు. అప్పుడే దీని గురించి నేను తనతో గొడవ పడ్డాను. అలా ఏం చేయలేదని ఆయన బుకాయించారు. కోప్పడ్డారు. అప్పటి నుంచి తనతో మాట్లాడడం మానేశాను” అని ఆమె న్యూస్‌బీట్‌తో చెప్పారు.

“ఈ ఉదంతాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లలేదు. నాకు న్యాయం జరుగుతుందని అనుకోలేదు”

“అత్యాచార కేసుల దర్యాప్తునకు చాలా సమయం పడుతుందని తెలుసు. అంతేకాకుండా మీ వస్తువులు కూడా జప్తు చేస్తారు. అందుకే కేసు నమోదు చేయడానికి ఇష్టపడలేదు” అని ఈడెం బార్బరా అన్నారు.

https://www.youtube.com/watch?v=lrA7JaxSPsw

గత ఐదేళ్లగా అత్యాచార కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కానీ కోర్టు వరకూ వెళ్లే వాటి సంఖ్య తగ్గుతోంది.

“రేప్ కేసుల్లో బాధితులు కోర్టు వరకు వచ్చేలా చేయాలన్నదే మా లక్ష్యం. చాలా తక్కువ మంది బాధితులకు న్యాయం దక్కుతోంది. దీనిపై సమూల మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తున్నాం” అని క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ న్యూస్‌బీట్‌తో చెప్పింది.

ఈడెం ఇప్పుడు మహిళల లైంగిక ఆరోగ్య సమస్యలపై పనిచేస్తున్నారు. స్టెల్తింగ్‌ సంఘటనలను రికార్డ్ చేసే పద్ధతిపై అధ్యయనం చేస్తున్నారు.

దక్షిణ కొరియాలో స్పై కెమెరాల ద్వారా రహస్యంగా చిత్రించినట్లు దాదాపు 30 వేల ఫిర్యాదులు పోలీసులకు అందాయి.

'దాన్ని మర్చిపోవాలని నిర్ణయించుకున్నాను’

“ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. బాధితులు, పోలీసుల జోక్యం లేకుండానే కేసు నమోదు చేసే పద్ధతి ఉండాలి” అని ఆమె సూచించారు.

"ఆ సంఘటనను మర్చిపోవాలని నిర్ణయించుకున్నాను. అది జరిగినప్పుడు, కండోమ్ తీసేయడం వలన ఏవైనా సుఖవ్యాధులు వ్యాపిస్తాయేమోనని ఎక్కువ భయపడ్డాను. నాకు చాలా కోపం వచ్చింది. ఒక అంగీకారంతో శృంగారంతో పాల్గొన్నప్పుడు దాన్ని గౌరవించాలి. ముఖ్యంగా పలువురితో సంబంధాలు ఉన్నప్పుడు సురక్షితమైన పద్ధతులు పాటించాలి" అని ఈడెం బార్బరా అన్నారు.

https://www.youtube.com/watch?v=SyCegrPfjVg

'యువతకు సమ్మతి (కన్సెంట్)పై అవగాహన కల్పించాలి

స్టెల్తింగ్ చట్టవిరుద్ధమని చాలా మందికి తెలీదని యువతకు 'సమ్మతి’పై అవగాహన కల్పించే స్కూల్ కన్సెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కేట్‌ పార్కర్‌ అన్నారు.

“దాని గురించి చెప్తే ఆశ్చర్యపోతారు. కండోమ్‌ ఉపయోగించి శృంగారంలో పాల్గొనాలనే సమ్మతితోనే మీరు ముందుకు సాగుతారు. మీ భాగస్వామి మీ సమ్మతి లేకుండా కండోమ్ తీసేస్తే దాన్ని నేరంగానే పరిగణించాలి”

“ఇది గౌరవానికి సంబంధించిన విషయం. ఎదుటివారి అభిప్రాయాలను, సమ్మతిని గౌరవించాలని తెలియాలి. సమ్మతి గురించి పాఠశాలల్లో బోధించాలి. అది స్కూలు కరికులంలో ఉండాలి”

“ప్రస్తుతానికి అన్ని పాఠశాలల్లో సెక్స్, రిలేషన్షిప్‌ల గురించి బోధిస్తున్నారు. కానీ 'సమ్మతి’ ఆప్షనల్ సబ్జెక్ట్. కచ్చితంగా బోధించాలని లేదు. అంటే కొన్ని పాఠశాలలు వీటిని బోధించకుండా ఉండే అవకాశం కూడా ఉంది.

కానీ సెక్స్ ఎడ్యుకేషన్‌లో అదే ప్రధానాంశం. యువతకు దీని గురించి సరైన అవగాహన లేదు. పాఠశాలల్లో దీని ప్రాముఖ్యతను బోధించట్లేదు” అని కేట్‌ పార్కర్‌ అభిప్రాయపడ్డారు.

ఏడుస్తున్న వధువు

'స్టెల్తింగ్‌ జీవితాలను నాశనం చేస్తుంది’

స్టెల్తింగ్ గెమ్మా జీవితాన్ని అతలాకుతలం చేసింది. దానిపై మరింత అవగాహన పెంపొందించుకోవాలని ఆమె భావిస్తున్నారు.

“నాటి ఘటన అనంతరం ఇల్లు మారాల్సి వచ్చింది. ఎందుకంటే నా ఫ్లాట్‌లో ఉన్నంతసేపు నాకు తగిలిన గాయం గుర్తుకు వచ్చేది. దీని నుంచి బయటపడటానికి నాకు చికిత్స కూడా అవసరం అయింది. స్టెల్తింగ్‌ జీవితాలను నాశనం చేస్తుంది. దీనిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి” అని గెమ్మా అన్నారు.

ఇవి కూడా చదవండి:

https://www.youtube.com/watch?v=CwZ4mr-Vupw

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Unintentional removal of condom during sex is rape
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X