• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా కోరల్లో అమెరికా: ఒక్కరోజే 2,228 కరోనా మరణాలు: 26 వేల మందికి పైగా మృతి

|

న్యూయార్క్: కరోనా వైరస్ కోరల్లో పూర్తిగా చిక్కుకుపోయినట్టు కనిపిస్తోంది అగ్రరాజ్యం అమెరికా. అంతులేని కథలా మారింది ఆ దేశ పరిస్థితి. కరోనా వైరస్ విధ్వంసాన్ని ఎలా అడ్డుకోవాలో తెలియని స్థితికి చేరుకున్న అమెరికాలో మంగళవారం 24 గంటల వ్యవధిలో రెండు వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. దీనితో ఇప్పటిదాకా అమెరికాలో మరణించిన వారి సంఖ్య 26,047కు చేరింది. ఆరు లక్షల మందికి పైగా కరోనా వైరస్ బారిన పడ్డారు.

అమెరికా వర్సెస్ డబ్ల్యూహెచ్ఓ: బాంబు పేల్చిన ట్రంప్: తప్పు పట్టిన ఐక్యరాజ్య సమితి

 24 గంటల వ్యవధిలో 2,228 మంది మృతి

24 గంటల వ్యవధిలో 2,228 మంది మృతి

అమెరికా వ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 2,228 మంది కరోనా వైరస్ బారిన పడి మరణించినట్లు జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్శిటీ వెల్లడించింది. ఇందులో అత్యధిక మరణాలు న్యూయార్క్, న్యూజెర్సీల్లో నమోదైనట్లు పేర్కొంది. అమెరికాలో కరోనా వైరస్ విజృంభణ ఆరంభమైన తరువాత దాని దుష్ప్రభావం న్యూయార్క్‌పైనే అధికంగా ఉంటోంది. అదే దుస్థితి కొనసాగుతూ వస్తోందని జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్శిటీ అంచనా వేసింది.

 న్యూయార్క్‌లో రెండు లక్షలు దాటిన పాజిటివ్ కేసులు..

న్యూయార్క్‌లో రెండు లక్షలు దాటిన పాజిటివ్ కేసులు..

అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్‌లో కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 11 వేలకు చేరువగా వెళ్తోంది. మంగళవారం నాటికి 10,834 మంది మరణించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. 2,03,123 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. అమెరికాలో మొత్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్యతో గానీ.. అక్కడ చోటు చేసుకున్న మరణాలతో గానీ పోల్చి చూస్తే.. 30 నుంచి 40 శాతం వరకు వాటా న్యూయార్క్‌దే ఉంటోంది.

న్యూజెర్సీ, మిచిగాన్‌లల్లో

న్యూజెర్సీ, మిచిగాన్‌లల్లో

న్యూయార్క్‌తో పాటు కొత్తగా న్యూజెర్సీ, మిచిగాన్‌లల్లో కరోనా వైరస్ కల్లోలాన్ని సృష్టిస్తోంది. న్యూజెర్సీలో 2,805, మిచిగాన్‌లో 1768 మంది కరోనా వైరస్‌కు బలి అయ్యారు. తాజాగా మస్సాచుసెట్స్‌లో అదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నగరంలో కరోనా మరణాలు నాలుగంకెలకు సమీపించాయి. ఇక్కడ 957 మంది మృతి చెందారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నియంత్రించడానికి ఎలాంటి ముందస్తు ప్రణాళికలు గానీ, ముందు జాగ్రత్త చర్యలను గానీ తీసుకోకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

 రెండు వేల మార్క్‌ను దాటడం రెండోసారి..

రెండు వేల మార్క్‌ను దాటడం రెండోసారి..

అమెరికాలో 24 గంటల వ్యవధిలో రెండు వేలకు పైగా కరోనా వైరస్ మరణాలు నమోదు కావడం ఇది రెండోసారి. ఇదివరకు ఈ నెల 10వ తేదీన 2108 మంది అమెరికన్లు మరణించారు. ఈ రికార్డును అధిగమించాయి ఈ తాజా మరణాలు. వారం రోజుల వ్యవధిలో 10 వేల మందికి పైగా మరణాలు నమోదు కావడం అమెరికాలో నెలకొన్న దుస్థితికి అద్దం పడుతున్నాయి. కరోనా మరణాలకు ఇప్పట్లో బ్రేక్ పడకపోవచ్చని, కనీసం రెండు లక్షల మంది వరకు మరణించే ప్రమాదం ఉన్నట్లు ఇదివరకే అక్కడి ప్రభుత్వం అంచనా వేసింది.

  Covid-19: Corona Virus Total Positive Cases In United States Crosed 5,32,879

  English summary
  The United States recorded 2,228 deaths related to the coronavirus pandemic over the past 24 hours, according to a tally by Johns Hopkins University as of 8:30 pm Tuesday. The number of fatalities was a sharp increase after two days in decline. The outbreak has now claimed the lives of at least 25,757 people in the US, the most of any country.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more