వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విదేశీ విద్యార్థులపై బాంబు పేల్చిన అమెరికా: స్వదేశానికి తిరుగుముఖం పట్టాల్సిందే: విసాలన్నీ..

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో అగ్రరాజ్యం అమెరికా తలకిందులైంది. అతలాకుతలమౌతోంది. ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోల్చుకుంటే.. కరోనా వైరస్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్నది అమెరికా. లక్షలాది మంది అమెరికన్లు కరోనా వైరస్ కోరల్లో చిక్కుకున్నారు. లక్షా పాతిక వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. విదేశీ విద్యార్థుల విసాలను రద్దు చేశారు.

Recommended Video

United States to Withdraw Student Visas అమెరికాలో విద్యార్థుల విసాల రద్దు ! || Oneindia Telugu

కేసీఆర్ మిస్సింగ్ అంటూ తీన్మార్ సంచలనం: గవర్నర్ తమిళిసై ఎంట్రీ: కాస్సేపట్లో ఉన్నతస్థాయి సమీక్షకేసీఆర్ మిస్సింగ్ అంటూ తీన్మార్ సంచలనం: గవర్నర్ తమిళిసై ఎంట్రీ: కాస్సేపట్లో ఉన్నతస్థాయి సమీక్ష

ఆన్‌లైన్ ద్వారా టీచింగ్..

ఆన్‌లైన్ ద్వారా టీచింగ్..

ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా క్లాసులు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఎక్కడున్నా చదువుకోవచ్చనే ఉద్దేశంతో స్టూడెంట్ విసాలను అమెరికా రద్దు చేసింది. ఆఫ్‌లైన్ విద్యార్థులకు విసాల రద్దును వర్తింపజేయలేదు. వారికి జారీ చేసిన విసాలు యధాతథంగా కొనసాగుతాయి. ఆన్‌లైన్ పద్ధతిన డిజిటల్ తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు మాత్రమే ఈ రద్దు వర్తిస్తుందని అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

 ఎఫ్-1, ఎం-1 విద్యార్థులకు

ఎఫ్-1, ఎం-1 విద్యార్థులకు

అమెరికాలో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థులకు నాన్ ఇమ్మిగ్రెంట్ ఎఫ్-1, ఎం-1 విసాలను జారీ చేస్తుంటుంది అమెరికా ప్రభుత్వం. వివిధ దేశాలకు చెందిన వేలాదిమంది విద్యార్థులు అమెరికాలోని టాప్ యూనివర్శిటీల్లో చదువుకుంటున్నారు. అమెరికాలో చదువుకుంటోన్న విదేశీ విద్యార్థుల సంఖ్యలో భారత్‌ది రెండోస్థానం. ఈ లెక్కన చూస్తే.. అమెరికా ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారతీయ విద్యార్థులే పెద్ద ఎత్తు ప్రభావితమౌతారనడంలో సందేహాలు అక్కర్లేదు.

 తప్పనిసరిగా అమెరికాను వీడాల్సిందే..

తప్పనిసరిగా అమెరికాను వీడాల్సిందే..

ఆన్‌లైన్ ద్వారా తరగతులకు హాజరవుతోన్న విదేశీ విద్యార్థులుందరూ తప్పనిసరిగా తమ దేశాన్ని వీడాల్సిందేనని యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. నాన్ ఇమ్మిగ్రెంట్ కింద జారీ చేసిన ఎఫ్-1, ఎం-1 విసాలను కలిగిన విద్యార్థులు స్వదేశానికి వెళ్లిపోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను జారీ చేసిన తరువాత కూడా ఒకవేళ అమెరికాలోనే ఉండిపోతే.. ఇమ్మిగ్రేషన్ నిబంధనల కింద చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు. ఆయా విద్యాసంస్థల నుంచి వారిని ప్రక్రియను ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

ఫుల్లీ ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యే విద్యార్థులకు

ఫుల్లీ ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యే విద్యార్థులకు

ఆన్‌లైన్ ద్వారా, డిజిటల్ పద్ధతుల్లో క్లాసులకు హాజరయ్యే విద్యార్థులకు కొత్తగా ఎలాంటి విసాలను కూడా జారీ చేయబోమని ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈ ప్రకటనలో తెలిపారు. ఎఫ్-1 రకం విసాలను అకడమిక్ కోర్సుల కోసం, ఎం-1 విసాలను ఒకేషనల్ కోర్సుల కోసం జారీ చేసినట్లు స్పష్టం చేశారు. ఒకేషనల్ విద్యార్థులు తప్పనిసరిగా ప్రాక్టికల్స్‌కు హాజరు కావాల్సి ఉంటుందనే ఉద్దేశంతో.. ఎం-1 విసాలను పొందిన అలాంటి వారికి పరిమితంగా మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు.

English summary
The United States said Monday it would not allow foreign students to remain in the country if all of their classes are moved online in the fall because of the coronavirus crisis. "Nonimmigrant F-1 and M-1 students attending schools operating entirely online may not take a full online course load and remain in the United States," US Immigration and Custom Enforcement said in a statement. "Active students currently in the United States enrolled in such programs must depart the country or take other measures, such as transferring to a school with in-person instruction to remain in lawful status," ICE said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X