వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగిసిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం... పాకిస్థాన్‌కు బహిరంగ మద్దతు పలికిన చైనా..

|
Google Oneindia TeluguNews

అంతర్జాతీయ సమాజంలో కూడ పాకిస్థాన్‌ ఒంటరి అయింది. కశ్మీర్‌లో జరుగుతున్న పరిణామాలపై పాకిస్థాన్ పిర్యాధు మేరకు అంత్యవసరంగా సమావేశమైన యూఎన్ సెక్యూరిటి కౌన్సిల్ సమావేశంలో పాకిస్థాన్‌కు అనుకూలంగా కేవలం చైనా మాత్రమే మద్దతు పలికింది. కాగా రెండు దేశాలు సమస్యను పరిష్కరించుకోవాలని రష్యా కోరింది. అనధికారిక సమావేశంలో ఎలాంటీ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే సమావేశంలో హిడెన్ ఎజెండా ఏది లేదని, ఇస్లామాబాద్‌తో పాటు ఢిల్లిలు పరస్పరం చర్చించుకోవాలని రష్యా సూచించింది.

ఐక్యరాజ్యసమితి సమావేశం శుక్రవారం సాయంత్రం ప్రారంభమైంది. అయితే ఈ సమావేశానికి అమేరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షణ రహస్యంగా కొనసాగింది. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న అయిదు దేశాల ప్రతినిధులతో పాటు శాశ్వత సభ్యత్వం లేని మరో పది దేశాల సభ్యులు ఇందులో పాల్గోన్నారు. , జమ్మూ కాశ్మీర్ వ్యవహారంపై పాకిస్థాన్ ఐక్యరాజ్య సమితి పిర్యాధు చేయడంతో పాకిస్థాన్‌కు మద్దతు పలుకుతున్న చైనా ఒత్తిడితో ముప్పై నిమిషాలకు పైగా ఈ సమావేశం కోనసాగింది. అయితే ఐక్యరాజ్యసమితిలో అటు పాకిస్థాన్ గాని, భారత దేశం గాని లేకపోవడంతో ఎలాంటీ పరిణామాలు జరగుతాయో అనే ఉత్కంఠ నెలకొంది. కాని ఈ సమావేశంలో పాకిస్థాన్ భావించినట్టు ఎలాంటీ అత్యవసర నిర్ణయాలు తీసుకోలేదు

UNSC informal meet on Kashmir over, China openly favouring Pakistan at the UNSC,

కశ్మీర్ పరిణామాలపై పాకిస్థాన్ అంతర్జాతీయ స్థాయిలో తమతో స్నేహం చేస్తోన్న చైనా దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లింది.దీంతో పాటు అమేరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫోన్‌లో మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దయిన కొద్దిరోజుల్లోనే పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ చైనా వెళ్లారు. ఆ దేశ ప్రభుత్వ నేతలతో సమావేశమయ్యారు. ఆ తరువాతే అంతర్జాతీయ స్థాయిలో పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశం అయ్యే పరిస్థితి తలెత్తింది. పాకిస్తాన్ చేసిన ఫిర్యాదు పత్రాన్ని ఆయన ఆ దేశ ప్రతినిధిగా ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడికి అందజేశారు. ఇదే విషయాన్ని ఐక్యరాజ్య సమితిలోని పోలండ్ రాయబారి జొవాన్నా వ్రొనెక్కా దృష్టికీ తీసుకెళ్లారు. ఆ తరువాతే భద్రతా మండలి సమావేశం కావాలని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంది.

English summary
UNSC does not seem to favour Islamabad as the Council discusses India's revocation of the special status to Jammu and Kashmir except China.China "openly favouring" Pakistan at the UNSC
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X