వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బద్దలైన డ్యాంలు: 16మంది మృతి(వీడియో)

|
Google Oneindia TeluguNews

మారియానా: ఆగ్నేయ బ్రెజిల్‌లోని సమార్కో అనే ఇనుప ఖనిజం గని పక్కనే ఉన్న రెండు డ్యాంలు బద్దలయ్యాయి. డ్యాంలు తెగిపోవడంతో బురద ప్రవాహం ఓ గ్రామాన్ని ముంచేసింది. ఈ ఘటన బెంటో రోడ్రిగ్యుస్ ప్రాంతంలో చోటుచేసుకున్నది.

దాదాపు వేల మీటర్ల మేర గ్రామం బురదమయమైంది. ఈ ఘటనలో 16 మంది మరణించారని, ఏడుగురు గాయపడ్డారని, మరో 45 మంది గల్లంతయ్యారని స్థానిక మీడియా పేర్కొంది. ఆకస్మాత్తుగా బురద ప్రవాహం ముంచెత్తడంతో 600 ఇళ్లు నేలమట్టమయ్యాయి.

Up to 16 people feared dead after dam burst in Brazil

అనేకమంది నిరాశ్రయులయ్యారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బురద ప్రవాహంలో కార్లు, ఇతర వస్తువులు కొట్టుకుపోయాయి.

కాగా, ఈ విపత్తుపై ఇంకా సమార్కో కంపెనీ ప్రతినిధులు స్పందించలేదు. బ్రెజిల్‌లోని వాలే, ఆస్ట్రేలియాలోని బీహెచ్‌పీ బిల్లిటన్ సంయుక్తంగా ఈ కంపెనీని నిర్వహిస్తున్నారు.

English summary
More than a dozen people might be dead after a dam holding back waste water from an iron ore mine in Brazil's Minas Gerais southeastern state burst, flooding nearby homes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X