వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా మరో సంచలనం: ఆర్థికంగా దెబ్బతీస్తామని వార్నింగ్ - మలబార్ విన్యాసాలపై డ్రాగన్ బుసబుస

|
Google Oneindia TeluguNews

పసిఫిక్, హిందూ మహా సముద్రాల్లో విచ్చలవిడిగా యుద్ధనౌకల్ని, జలాంతర్గాములను తిప్పుతూ, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అశాంతిని రాజేస్తున్న చైనా మరో సంచలనానికి పాల్పడింది. భారత్ కు సహకరిస్తోన్న దేశాలను ఆర్థికంగా దెబ్బతీస్తామని హెచ్చరించింది. భారత్-అమెరికా-జపాన్-ఆస్ట్రేలియా దేశాలుసంయుక్తంగా నిర్వహిస్తోన్న మలబార్ విన్యాసాల నేపథ్యంలో డ్రాగన్ ఈ మేరకు బుసలు కక్కింది.

Cheating Wife:భార్యకు కడుపు నా వల్ల రాలేదు -సీమంతంలో సీన్ చూపించిన భర్త -వైరల్ వీడియోCheating Wife:భార్యకు కడుపు నా వల్ల రాలేదు -సీమంతంలో సీన్ చూపించిన భర్త -వైరల్ వీడియో

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

ఇండో-పసిఫిక్ ప్రాంతాల్లో చైనాకు చెక్ పెట్టే దిశగా, సముద్ర భద్రతకు సంబంధించి ఇతర దేశాల సహకారాన్ని పెంపొందిచేలా భారత్ కీలకంగా వ్యవహరిస్తున్నది. ఆస్ట్రేలియాతో రక్షణ సహకారం పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది ‘మలబార్ 2020' విన్యాసాల్లో పాల్గొనేలా ఆ దేశాన్ని ఒప్పించింది. 1992లో భారత్-అమెరికా మొదలు పెట్టిన ఈ నౌకాదళ విన్యాసాల కార్యక్రమంలోకి జపాన్ సైతం 2015లో వచ్చిచేరింది. తాజాగా ఆస్ట్రేలియా కూడా జతకావడంతో రీజియన్ లో తన ఉనికిపై చైనాకు గుబులు మొదలైంది. ఇటీవల 2020 మలబార్‌ విన్యాసాలు రెండు దశ ప్రారంభం కావడంతో చైనా ప్రభుత్వం తన అధికారిక పత్రికలో విషపురాతలను కుమ్మరించింది.

పదవితోపాటే మూడో పెళ్లీ పెటాకులు -ట్రంప్‌కు మెలానియా విడాకులు -వైట్‌హౌజ్ సహాయకురాలి క్లెయిమ్పదవితోపాటే మూడో పెళ్లీ పెటాకులు -ట్రంప్‌కు మెలానియా విడాకులు -వైట్‌హౌజ్ సహాయకురాలి క్లెయిమ్

ఆస్ట్రేలియాపై ఆగ్రహం..

ఆస్ట్రేలియాపై ఆగ్రహం..

చైనా తాజా హెచ్చరిక ప్రధానంగా ఆస్ట్రేలియాను ఉద్దేశించి చేసింది. గతంలో ఆసీస్ తో సవ్యంగా సాగిన బంధాలు.. కరోనా మహమ్మారి తర్వాత దెబ్బతిన్నాయి. వైరస్ వ్యాప్తిలో చైనా పాత్రపై విచారణ జరగాలని ఆసీస్ ఆదేశించడం డ్రాగన్ కు కోపం తెప్పించింది. ప్రస్తుతం.. భారత్, అమెరికా నేతృత్వంలో సముద్ర విన్యాసాలు చేస్తున్న 'తలబిరుసు ముఠా'తో కలిస్తే ఆస్ట్రేలియా ‘వాణిజ్యపరమైన ఇబ్బందు'లను ఎదుర్కోవాల్సి ఉంటుదని హెచ్చరించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎంతో దూకుడుగా యుద్ధ నౌకలను చైనా ముంగిట్లోకి పంపిందంటూ తిట్టిపోసింది.

అమెరికాతో లాభం ఉండదు..

అమెరికాతో లాభం ఉండదు..

‘‘అమెరికా, దాని మిత్రదేశాలు నిర్వహిస్తోన్న పథకాల్లో పాలుపంచుకోవడం ద్వారా ఎలాంటి లాభం దక్కబోదన్న విషయాన్ని ఆస్ట్రేలియా అధినాయకత్వం గ్రహించాలి. మలబార్ విన్యాసాలకు బదులుగా అమెరికా నుంచి ఎలాంటి ప్రతిఫలం రాదని ఆసీస్ తెలుసుకోవాలి. మలబార్ విన్యాసాల్లో పాల్గొనాలన్న తప్పుడు నిర్ణయం తీసుకున్నందుకు ఆస్ట్రేలియా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది'' అని చైనా అధికార పత్రిక చైనా డైలీ ఘాటు విషయాలు రాసింది. ఇండో-పసిఫిక్‌ సముద్ర జలాల్లో స్వేచ్ఛ, ఓపెన్‌ నావిగేషన్‌ పరిరక్షించడమే భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్టేలియాల లక్ష్యమని మన రక్షణ శాఖ అధికారులు ఇదివరకే పేర్కొన్నారు.

English summary
Australia’s decision to take part in Malabar Exercise has outraged China, who has warned Canberra of “economic pain” if it continues to be part of US administration “roughneck gang”. In an editorial piece, Communist party mouthpiece China Daily chided the Australian government for ‘aggressively sending warships to China’s doorsteps’ as part of Exercise Malabar, UK Daily Mail reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X