
అమెరికాలో కాల్పుల మోత.. ముగ్గురు మృతి, నలుగురికి గాయాలు
కాల్పుల మోతతో మరోసారి అమెరికా దద్దరిల్లింది. లాస్ ఏంజెల్స్‌లో గల వేర్ హౌస్‌లో ఫైర్ జరిగింది. కాల్పుల్లో ముగ్గురు చనిపోగా.. నలుగురు గాయపడ్డారు. కాల్పులు జరిపిన వ్యక్తికి కూడా తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు. అయితే కాల్పులు ఎందుకు జరిపారనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. కానీ ఆ సమయంలో అక్కడ ఉండి చనిపోయి.. కుటుంబాలకు ముగ్గురు కడుపుకోతను మిగిల్చారు.
కాల్పులు చేసింది వీరేనని.. లేదా అనుమానాస్పద వ్యక్తుల పేర్లను పోలీసులు/ ఏజెన్సీలు వెల్లడించలేదు. కాల్పుల తర్వాత ఆ ప్రాంతంలో రక్తం ప్రవాహించింది. అక్కడున్న వారి నుంచి రక్తం దారగా పారింది. ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఘటనలో గాయపడ్డ ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉంది.. నాలుగో వ్యక్తి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఆగంతకులు వచ్చిన వెంటనే కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. మరో వ్యక్తి గాయాలతో చనిపోయారు. డానియల్ డుంబార్ (27), రాండీ టైసన్ (25) ఇద్దరు చనిపోయారని లాస్ ఏంజెల్స్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ కరోనార్ తెలిపారు. కాల్పులతో మరోసారి కలకలం రేగింది. ఆ సమయంలో తమ బంధువులు/ సోదరులు ఉండటంతో ముగ్గురు చనిపోయారు. దీంతో ఆ మూడు కుటుంబాలు విషాద వదనంలో మునిగాయి.