వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

H-1B, గ్రీన్‌కార్డ్‌ దారులకు ట్రంప్‌ గుడ్‌ న్యూస్‌- భారీగా వేతనాలు పెంపు-జూలై నుంచి అమలు

|
Google Oneindia TeluguNews

అమెరికాలో మరో వారం రోజుల్లో పదవి నుంచి తప్పుకోబోతున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం అమెరికాలో పనిచేస్తున్న హెచ్‌1బీ వీసాదారులతో పాటు గ్రీన్‌కార్డు హోల్డర్లకూ వేతనాలు పెంచుతూ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆర్ధికంగా ఇబ్బందులు ఎధుర్కొంటున్న ఆర్ధిక వ్యవస్దతో పాటు కాబోయే అధ్యక్షుడు బైడెన్‌కూ ఇబ్బందులు తప్పేలా లేవు.

ట్రంప్‌ స్వీయ క్షమాభిక్ష- ముప్పేట దాడి నుంచి బయటపడే యత్నం- చట్ట సమ్మతమేనా ?ట్రంప్‌ స్వీయ క్షమాభిక్ష- ముప్పేట దాడి నుంచి బయటపడే యత్నం- చట్ట సమ్మతమేనా ?

హెచ్‌1బీ వీసాలు కలిగిన వారు, లేక అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల ధృవీకరణ పథకం (PERM) కింద గ్రీన్‌కార్డులు కలిగిన వారి వేతనాలను పెంచుతూ తాజాగా అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్‌ తుది నిబంధనలు జారీ చేసింది. దీంతో అమెరికాలోని వివిధ టెక్‌ సంస్ధల్లో సేవలందిస్తున్న విదేశీ నిపుణులకు ట్రంప్‌ సర్కారు నిర్ణయం భారీ ప్రయోజనం చేకూర్చబోతోంది. వాస్తవానికి ట్రంప్ సర్కారు గతేడాది అక్టోబర్ 8న జీతాల పెంపుపై మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ సాంకేతిక, విద్యా, లాభాపేక్షలేని సంస్ధలు దాఖలు చేసిన పిటిషన్లు విచారించిన మూడు కోర్టులు ట్రంప్‌ సర్కారు నిర్ణయాన్ని రద్దు చేశాయి.

US agency issues final wage rules for H-1B and green card holders

ట్రంప్‌ సర్కారు ప్రకటించిన తాజా జీతాల విధానం ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి రాబోతోంది. ఇందులో భాగంగా హెచ్‌1బీ వీసా దారులతో పాటు గ్రీన్‌కార్డు కలిగిన ఉద్యోగులకు దశల వారీగా పెంపును అమలు చేస్తారు. అక్టోబర్‌ 8న ట్రంప్‌ సర్కారు జారీ చేసిన మధ్యంతర ఆదేశాల్లో జీతాల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదని, నిబంధనల ప్రకారం లేదని కోర్టులు తేల్చాయి. దీంతో పలు జాగ్రత్తలు తీసుకుని ఈసారి లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ తుది నిబంధనలు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హెచ్‌1బీ వీసాల వార్షిక పరిమితిని 85 వేల నుంచి పెంచేందుకు సిద్ధమని కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ ఇప్పటికే ప్రకటించారు. దీంతో కొత్తగా ఈ వీసాలు పొందే వారికి కూడా జీతాల పెంపు ప్రయోజనం దక్కబోతోంది. మరోవైపు ఇప్పటికే కరోనాతో కుదేలైన అమెరికా అర్ధిక వ్యవస్ధకు ఇది మరో భారంగా పరిణమించవచ్చనే ఆందోళనలు కూడా ఉన్నాయి.

English summary
the US department of labour announced induction of final wages rules, which hiked the prevailing wages for those working in US on H1B visas or holding employment based green cards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X