వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కువైట్ ఏయిర్ బేస్ లో అమెరికా బలగాలు: సులేమానీని ఖతంతో : ఇరాన్ హెచ్చరిక ..!

|
Google Oneindia TeluguNews

అమెరికా సైనిక బలగాలు కువైట్ ఏయిర్ బేస్ లో మొహరించాయి. ఇరాన్‌ సైన్యానికి చెందిన అగ్రస్థాయి కమాండర్‌, ఆ దేశంలోని రెండో శక్తివంతమైన నేత జనరల్‌ ఖాసిం సులేమానీని అమెరికా హత మార్చిన తరువాత అమెరికా మరింతగా పట్టు బిగించే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా కువైట్ ఏయిర్ బేస్ లో బలగాలను మొహరించింది.

ఇరాక్ లోని అలీ అల్ సలేం ఏయిర్ బేస్ లో అమెరికా బలగాలు దిగుతున్న ఫుటేజ్ ను విడుదల చేసారు. శుక్రవారం ఉదయం ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిపిన డ్రోన్‌ దాడిలో సులేమానీ హతమైనట్టు అమెరికా ప్రకటించింది. తమ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశం మేరకే ఈ దాడి జరిపినట్టు ఆ దేశం అధికారికంగా ప్రకటించింది.

అమెరికా బలగాల మోహరింపుతో

ఇప్పుడు కువైట్ కేంద్రంగా అమెరికా బలగాలు మొహరించటంతో పశ్చిమాసియాలో యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా-ఇరాన్‌ మధ్య ఒక్కసారిగా యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. వేల మంది అమెరికన్లను పొట్టనబెట్టుకున్న సులేమానీని ఎప్పు డో చంపాల్సిందని ట్రంప్‌ పేర్కొనగా.. తీవ్రమైన ప్రతీకారం తప్పదని ఇరాన్‌ హెచ్చరించింది.

మరోవైపు సులేమానీ హత్యతో ఇరాన్ ఉలిక్కి పడింది. విదేశాల్లో నివసిస్తున్న అమెరికన్ల ప్రాణాలను కాపాడేందుకు.. భవిష్యత్తులో ఇరాన్‌ చేయబోయే దాడులను అడ్డుకునేందుకు అధ్యక్షుడి ఆదేశాల మేరకు సైనిక చర్య జరిపామని. ఉగ్రవాద సంస్థ కుడ్స్‌ నాయకుడు సులేమానీని అంతమొం దించామని అమెరికా రక్షణ కార్యాలయం పేర్కొంది.

US army paratroopers arrived at Kuwait air base

అవసరమైన చర్యలు కొనసాగిస్తాం
ఇరాక్‌తోపాటు గల్ఫ్‌ ప్రాంతంలోని అమెరికా దౌత్యవేత్తలు, సైనికులను హత్య చేసేందుకు సొలెమాని పథకం రచిస్తున్నట్టు సమాచారం ఉన్నదని చెప్పింది. అమెరికా, మిత్రదేశాలకు చెందిన వందల మంది సైనికుల మరణాలకు, వేల మంది క్షతగాత్రులు కావడానికి సులేమానీ, ఆయన నేతృత్వంలోని కుడ్స్‌ దళాలే కారణమని ఆరోపించింది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వాళ్లను,..వారి ప్రయోజనాలను కాపాడు కో వడానికి అవసరమైన చర్యలను కొనసాగిస్తామని అమెరికా స్పష్టంచేసింది.

English summary
US army paratroopers from the 82nd Airborne Division arrived in Kuwait.Footage released by the Defense Department showed transport planes touching down at the Ali Al Salem Air Base.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X