వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనాకు వ్యాక్సిన్ mrna-1273: రక్త నమూనాల సేకరించిన అమెరికా శాస్త్రవేత్తలు, 18 నెలలు...

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ పేరు చెబితే చాలు జనాలు జంకుతున్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఏ వైపు నుంచి వస్తుందోనని భయపడిపోతున్నారు. వైరస్ ఎలా ప్రబలుతుందో స్పష్టత లేకపోవడంతో వ్యాక్సిన్ కనుగొనడం కష్టం.. సమయం ఎక్కువగా తీసుకొనే అవకాశం ఉంది. మ్యాగ్జిమమ్ రెండేళ్లు పడుతోందని శాస్త్రవేత్తలు చెబుతోన్నారు. కరోనా రక్కసి.. అమెరికాలో కూడా ప్రబలడంతో వ్యాక్సిన్‌పై ఆ దేశం ఫోకస్ చేసింది. అమెరికా అధికారులు వ్యాక్సిన్ కనుగొనే ప్రక్రియను సోమవారం సీటెల్‌లో ప్రారంభించారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రారంభించడంతో.. పీడిత దేశ ప్రజలు కాస్త స్వాంతనకు గురవుతున్నారు.

అమెరికా ముందడుగు

అమెరికా ముందడుగు

మసాచుసెట్స్‌లో గల కేంబ్రిడ్జిలో అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, మోడెర్నాకు చెందిన బయోటెక్నాలజీ శాస్త్రవేత్తలు mrna-1273 వ్యాక్సిన్ కనుగొనేందుకు చర్యలు ఉపక్రమించారు. అయితే సోమవారం తొలి దశ పరీక్ష ప్రారంభించిన శాస్త్రవేత్తలు.. పలుమార్లు పరీక్షించాల్సి ఉంది. కనీసం ఏడాదిన్నర తర్వాతే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 18 నుంచి 55 ఏళ్లు ఉన్న 45 మంది ఔత్సాహికుల నుంచి రక్త నమూనాలను సేకరించామని వైద్యులు పేర్కొన్నారు. సోమవారం తొలి నమూనా తీశామని.. ఆరువారాల పాటు పరీక్షించిన తర్వాత వ్యాక్సిన్‌కు సంబంధించి పురోగతి లభించే అవకాశం ఉంది.

నిధుల సమీకరణ..

నిధుల సమీకరణ..

కరోనా వైరస్ వ్యాక్సిన్ కనుగొనేందుకు ‘ఒస్లో' కూడా నిధులు సమకూర్చింది. వాస్తవానికి కరోనా వైరస్‌కు ఇప్పటివరకు ప్రపంచంలో వ్యాక్సిన్ గానీ, మందులు కానీ లేవు. సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గత డిసెంబర్‌లో చైనాలోని వుహాన్‌లో బయటపడిన వైరస్.. దాదాపు 7 వేలకు పైగా మందిని బలితీసుకుంది. లక్ష 75 వేల మంది పాజిటివ్ వైరస్‌తో ఆస్పత్రిలో ఉన్నారు.

Recommended Video

Coronavirus In India : Paracetamol Sufficient For COVID 19, Trolls On KCR And Jagan
వ్యాక్సిన్..

వ్యాక్సిన్..

కరోనా వైరస్ గబ్బిలాల నుంచి సంక్రమించిందని.. వ్యాక్సిన్ కనుగొనేందుకు కృషి చేసేందుకు వివిధ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా అమెరికా తొలి అడుగు వేసింది. సోమవారం ఒకరి నుంచి నమూనాను సేకరించింది. చేతి నుంచి రక్త నమూనాలను సేకరించి... అధ్యయనం చేస్తున్నారని.. రక్తం సేకరించిన తర్వాత వారు అనారోగ్యానికి గురయ్యారా..? గాయపడ్డారా అనే అంశాలపై కూడా పరిశోధనలో తేలుతుందని సైంటిస్టులు పేర్కొంటున్నారు.

English summary
కరోనా వైరస్ పేరు చెబితే చాలు జనాలు జంకుతున్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఏ వైపు నుంచి వస్తుందోనని భయపడిపోతున్నారు. వైరస్ ఎలా ప్రబలుతుందో స్పష్టత లేకపోవడంతో వ్యాక్సిన్ కనుగొనడం కష్టం.. సమయం ఎక్కువగా తీసుకొనే అవకాశం ఉంది. మ్యాగ్జిమమ్ రెండేళ్లు పడుతోందని శాస్త్రవేత్తలు చెబుతోన్నారు. కరోనా రక్కసి.. అమెరికాలో కూడా ప్రబలడంతో వ్యాక్సిన్‌పై ఆ దేశం ఫోకస్ చేసింది. అమెరికా అధికారులు వ్యాక్సిన్ కనుగొనే ప్రక్రియను సోమవారం సీటెల్‌లో ప్రారంభించారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రారంభించడంతో.. పీడిత దేశ ప్రజలు కాస్త స్వాంతనకు గురవుతున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X