వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూఎస్ క్యాపిటల్ కాంప్లెక్స్ తాత్కాలిక మూసివేత: జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి రెండ్రోజుల ముందు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడి ప్రమాణస్వీకారం నేపథ్యంలో ఆ దేశ రాజధాని ఇప్పుడు పోలీసులు, భద్రతా దళాల మయంగా మారిపోయింది. అంతేగాక, యూఎస్ కాపిటల్ కాంప్లెక్స్‌ను సోమవారం తాత్కాలికంగా మూసివేశారు. ఈ కాంప్లెక్స్ సమీపంలో అగ్ని ప్రమాదం జరగడంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Recommended Video

#TOPNEWS: CBSE Board Exam 2021| Krishna River Board | Joe Biden's Inauguration | Oneindia Telugu

అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయడానికి రెండు రోజుల ముందే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీనిపై యూఎస్ సీక్రెట్ సర్వీస్ విభాగంగా ట్విట్టర్‌లో స్పందించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే క్యాపిటల్ కాంప్లెక్స్ షట్‌డౌన్ చేయాలని నిర్ణయించుకున్నాం. ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని సీక్రెట్ సర్వీస్ విభాగం పేర్కొంది.

 US Capitol Briefly Shut Down Over Fire 2 Days Before Joe Biden Inauguration

యూఎస్ క్యాపిటల్ భవనంపై జనవరి 6న ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడటం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బుధవారం బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్న క్రమంలో భద్రతా ముప్పు దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్కడ ఎటు చూసినా పోలీసులు కనిపిస్తున్నారు.

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనుండగా, ఉపాధ్యక్షురాలిగా భారతీయ మూలాలున్న కమలా హారీస్ ప్రమాణం చేయనున్నారు. భారతీయ మూలాలున్న కమలా హారీస్.. ప్రమాణ స్వీకారం సందర్భంగా చీర కడతారా? అనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. భారతదేశంతో తనకు ఎంతో అనుబంధం ఉందని, తమ పూర్వీకులు అంతా భారతదేశంలోనే ఉన్నారని ఆమె పలుమార్లు వెల్లడింారు. ఈ క్రమంలోనే ఆమె ప్రమాణ స్వీకారం సందర్భంగా చీర కట్టుకుంటారని చర్చ జరుగుతోంది. అయితే, మరో రెండ్రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ రానుంది.

English summary
The US Capitol was shut down temporarily on Monday out of an abundance of caution after a fire broke out near the complex, the Capitol Police said, underscoring security jitters days before President-elect Joe Biden's inauguration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X