వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌కు చైనా షాక్: వాణిజ్యయుద్దానికి రెఢీ, అమెరికా వస్తువులపై పన్నులు?

By Narsimha
|
Google Oneindia TeluguNews

బీజింగ్: అమెరికాతో వాణిజ్య యుద్దానికి చైనా సై అంది. చైనాలో అమెరికా వస్తువుల దిగుమతులకు చెక్ పెట్టేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చర్యలు తీసుకొంటున్నారు. ఇప్పటికే చైనా వస్తువులకు అమెరికాలో దిగుమతి చేసుకోవడానికి ట్రంప్ చెక్ పెట్టాడు. దీనికి విరుగుడుగా చైనా కూడ అదే ఫార్మూలాను అనుసరించాలని నిర్ణయం తీసుకొంది.

చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

అమెరికా, చైనా దేశాల మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతోంది. అమెరికాతో వాణిజ్య యుద్దానికి తమకు ఎలాంటి భయాలు లేవని చైనా స్పష్టం చేసింది. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై అమెరికా దిగుమతి సుంకానికి ప్రతిస్పందనగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌ను ఆశ్రయించనుంది.

US-China trade war: Beijing hits back at Trump, plans $3 bn reciprocal tariffs on US imports

అమెరికాపై చట్టపరమైన చర్యల కోసం చైనా ప్రయత్నాలు చేసే అవకాశం కన్పిస్తోంది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు జోక్యం చేసుకోవాలని డబ్ల్యు టిఓ‌ను కోరనున్నట్టు చైనా ప్రకటించింది.

చైనాకు చెందిన ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై దిగుమతి సుంకం విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం గురువారం నాడు నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ట్రంప్ ఈ నిర్ణయంపై సంతకం చేశారు. చైనా వస్తువులపై 60 బిలియన్ డాలర్ల సుంకాలను ప్రతిపాదించాలని అమెరికా నిర్ణయించింది.

30 రోజుల సంప్రదింపుల తర్వాతే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని అమెరికా ప్రకటించింది. దీనికి చైనా కౌంటర్ ఇచ్చింది. అమెరికా నుండి దిగుమతయ్యే డ్రై‌ఫ్రూట్స్, వైన్, స్టీల్ పైపులపై 15 శాతం, పంది మాసం ఉత్పత్తులపై 25 శాతం సుంకం విధించాలని చైనా భావిస్తోంది. రెండు దేశాల మధ్య వాణిజ్య సమస్యలపై ఒప్పందం కుదరని పక్షంలోనే 3 బిలియన్ డాలర్ల మేరకు సుంకం విధించనుంది చైనా.

English summary
China said it doesn’t fear a trade war with the US and announced plans for reciprocal tariffs on $3 billion of imports from the US in the first response to President Donald Trump’s ordering of levies on Chinese metal exports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X