• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇదీ వింతే.. రివార్డు పాయింట్లతో ఆర్జన.. 2.17 కోట్లు.. ఇదీ నిజం..

|

టెక్నాలజీ తెలిసిన వారు.. ఈజీగా మనీ సంపాదిస్తారు. కాస్త తెలివి పెట్టి బతికేస్తారు. అమెరికన్ కాన్ స్టాంటిన్ ఆంకివ్ కూడా ఇలానే చేశాడు. అయితే మనోడికి ఏ పనిపాట లేదు. క్రెడిట్ కార్డు వాడటం.. గిప్ట్ కార్డు తీసుకోవడం, రివార్డ్ పాయింట్లతో క్యాష్ చేసుకున్నాడు. అలా 2.17 కోట్లు సంపాదించడంతో.. వామ్మో ఇలా కూడా చేయొచ్చా అనే సందేహాం కలుగుతుంది. అయితే ఇతనిపై కొందరికీ సందేహం కలిగింది. ఏం చేయకున్నా.. ఎలా ఇళ్లు గడుస్తోంది అనుకున్నాడు. ఆరా తీస్తే విషయం తెలిసింది.

కోటిశ్వరుడు అవడం గ్రేట్..

కోటిశ్వరుడు అవడం గ్రేట్..

ఆన్ లైన్ చెల్లింపులు జరిపే సమయంలో రివార్డు పాయింట్లు రావడం సహజం. రివార్డు పాయింట్లతో ఏకంగా కోటీశ్వరుడు అవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అమెరికాకు చెందిన కాన్ స్టాంటిన్ ఆంకీవ్ కు క్రెడిట్ కార్డు వినియోగంతో లభించే రివార్డు పాయింట్లు అంటే ఎంతో ఇంట్రెస్ట్. క్రెడిట్ కార్డు వినియోగించడం... దాంతో లభించే రివార్డు పాయింట్లు ఆదా చేయడమే పనిగా పెట్టుకున్నాడు. 2009 నుంచి దీనిని అలవాటుగా మార్చుకున్నాడు.

2.17 కోట్లు

2.17 కోట్లు


ఆన్ లైన్ లో గిఫ్టు కార్డులను ఆంకివ్ కొనుగోలు చేసేవాడు. గిఫ్టు కార్డు కొంటే అతడికి కొన్ని డాలర్ల మేర రివార్డు పాయింట్లు వచ్చేవి. తిరిగి ఆ గిఫ్టు కార్డులను తన బ్యాంకు అకౌంట్లో జమ చేసుకునేవాడు. ఆ డబ్బుతో తిరిగి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించేవాడు. రివార్డు పాయింట్ల ద్వారా వచ్చిన డాలర్లు లాభంగా మిగిలేవి. ఇలా కాన్ స్టాంటిన్ 2.17 కోట్లు సంపాదించాడు.

కుళ్లుకొని కంప్లైంట్..

కుళ్లుకొని కంప్లైంట్..


ఏ పని చేయకుండా అంత సొమ్ము రావడంతో కొందరు ఆడిపోసుకున్నారు. అతనిపై ఐటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రివార్డు పాయింట్ల వ్యవహారం బహిర్గతం అయ్యింది. అక్కడి చట్టాల ప్రకారం అతడికి నోటీసులు జారీ చేశారు. కానీ ఆంకివ్ తెలివికి మాత్రం ఫిదా అవుతున్నారు. రివార్డు పాయింట్లతో ఇలా నగదు సంపాదించొచ్చా అని ఫిదా అవుతున్నారు.

ఇదీ లెక్క..

ఇదీ లెక్క..


500 డాలర్ల గిఫ్ట్‌కార్డు కొనుగోలు చేస్తే 5 శాతం చొప్పున 25 డాలర్లు వచ్చేవి. గిఫ్ట్‌కార్డును సొమ్ము చేసుకునేందుకు 6 డాలర్లు చెల్లించేవాడు. మిగిలిన 19 డాలర్లు అతడికి లాభంగా మిగిలిపోయేవి. ఇప్పటి వరకు అనికీవ్ ఏకంగా 3 లక్షల డార్లు (దాదాపు 2.17 కోట్లు) సంపాదించాడు. అతడి సంపాదన ఒక్కసారిగా పెరగడంతో గుర్తించిన కొందరు అమెరికా పన్నుల శాఖకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు అతడి సంపాదన నిజమేనని తేలడంతో అక్రమాస్తుల కింద అతడికి నోటీసులు పంపారు.

గిప్ట్ కార్డులు

గిప్ట్ కార్డులు


కేసు విచారణ సందర్భంగా ఓ టబ్బు నిండా గిఫ్ట్‌కార్డులతో కోర్టులో అడుగుపెట్టిన అనికీవ్ తనను తాను సమర్థించుకున్నాడు. రెండు పార్టీల వాదనలు విన్న అనంతరం.. గిప్ట్ కార్డులు ఆస్తుల వంటివేనని, వచ్చిన క్రెడిట్ కార్డు రివార్డులకు పన్నులు ఉండబోవని కోర్టు పేర్కొంది. ఈ కేసు నుంచి రివార్డులకు లెక్కించబోమని పేర్కొంది. అయితే, గిఫ్ట్‌కార్డులను నగదుగా మార్చుకోవడమంటే ఆస్తిని తిరిగి విక్రయించడమేనని పేర్కొంది. కాబట్టి వాటికి పన్ను చెల్లించాల్సిందేనని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

English summary
us citizen con stantin ankeev gets crores through credit card reward points.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X