వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచంలో తొలి సింగిల్ డోసు టీకా -జాన్సన్ అండ్ జాన్సన్ తయారీ కొవిడ్ వ్యాక్సిన్‌కు అమెరికా ఆమోదం

|
Google Oneindia TeluguNews

గ్లోబల్ గా కరోనా విలయం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆదివారం నాటికి మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 11.43కోట్లకు, మరణాల సంఖ్య 25.4లక్షలకు పెరిగింది. 1.12కోట్ల కేసులతో భారత్ రెండో స్థానంలో, దాదాపు 3కోట్ల కేసులతో అమెరికా తొలి స్థానంలో ఉన్నాయి. మహమ్మారిని నియంత్రించే పలు దేశాలు ఇప్పటికే డజనుకుపైగా వ్యాక్సిన్లను ఆమోదించాయి. అవన్నీ రెండు డోసుల టీకాలే కాగా, ప్రపంచంలో తొలి సింగిల్ డోసు టీకా వినియోగానికి అమెరికా ప్రభుత్వం అనుమతులిచ్చింది..

పెద్దగట్టు జాతర షురూ -4రోజులు విజయవాడ-హైదరాబాద్ హైవే మళ్లింపు -5రాష్ట్రాల భక్తులు -ఇవీ విశేషాలుపెద్దగట్టు జాతర షురూ -4రోజులు విజయవాడ-హైదరాబాద్ హైవే మళ్లింపు -5రాష్ట్రాల భక్తులు -ఇవీ విశేషాలు

వైద్య వస్తువులు, ఫార్మా ఉత్పత్తుల తయారీలో అగ్రగామిగా ఉన్న జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ ప్రపంచంలోనే తొలి సింగిల్ డోసు వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది. క్లినికల్ ట్రయల్స్ లో దీని సమర్థత నిర్ధారణ అయింది. ఈ సింగిల్ డోసు కరోనా వ్యాక్సిన్ ను అత్యవసర వినియోగానికి అనుమతి ఇస్తూ, అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఆదేశాలు జారీ చేసింది.

 US Clears Johnson & Johnson Single-Shot Covid Vaccine For Emergency Use

అమెరికాలో కరోనా మహమ్మారి కారణంగా 5 లక్షల మందికి పైగా మృత్యువాత పడగా, మరణాలను కట్టడి చేసే దిశగా అక్కడి ప్రభుత్వం ఇదివరకే ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లకు అనుమతులిచ్చింది. మూడో వ్యాక్సిన్ గా జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశ ప్రజలందరికీ టీకాలను పంచేందుకు ఎఫ్డీయే ఏర్పాట్లు చేస్తోంది.

 US Clears Johnson & Johnson Single-Shot Covid Vaccine For Emergency Use

జాన్సన్ అండ్ జాన్సన్ కొవిడ్ వ్యాక్సిన్.. కరోనా కొత్త స్ట్రెయిన్ల మీద కూడా సమర్ధవంతంగా పని చేస్తున్నట్టు క్లినికల్ ట్రయల్స్ లో తేలింది. ''ఇదొక సంతోషకరమైన వార్త.. కరోనాను పారదోలేందుకు మనం చేస్తున్న పోరాటం ఇంకో మెట్టు ఎక్కాం..'' అంటూ జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఓ ప్రకటన చేశారు. వైరస్ వ్యాప్తి పట్ల అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్ ప్రొటోకాల్స్ పాటించాలని బైడెన్ సూచించారు.

భారత్‌లో కరోనా: మళ్లీ విజృంభణ -కొత్తగా 16,752 కేసులు, 113 మరణాలు -యాక్టివ్‌ కలకలంభారత్‌లో కరోనా: మళ్లీ విజృంభణ -కొత్తగా 16,752 కేసులు, 113 మరణాలు -యాక్టివ్‌ కలకలం

జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసిన టీకా యూఎస్ లో 85.9 శాతం, సౌతాఫ్రికాలో 81.7 శాతం, బ్రెజిల్ లో 87.6 శాతం ప్రభావవంతమైనదని రుజైవైంది. అన్ని రీజియన్లలో కలిపి 39,321 మంది వాలంటీర్లకు టీకాను ఇచ్చి, వారిలో పెరిగిన యాంటీ బాడీలను పరిశీలించారు. మార్చి చివరికి 2 కోట్ల డోస్ లను, జూన్ నాటికి 10 కోట్ల డోస్ ల వ్యాక్సిన్ ను ప్రపంచానికి అందిస్తామని జాన్సన్ అండ్ జాన్సన్ పేర్కొంది. అమెరికాలో ఇప్పటివరకూ 6.5 కోట్ల మందికి వ్యాక్సిన్ అందింది. దాదాపుగా మరో 25 కోట్ల మందికి టీకా అందాల్సి వుంది.

English summary
The United States on Saturday authorized Johnson & Johnson's Covid vaccine for emergency use, giving the nation a third shot to battle the outbreak that has killed more than 500,000 Americans. The single-shot vaccine is highly effective in preventing severe Covid-19, including against newer variants, the Food and Drug Administration (FDA) said before giving it a green light.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X