వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌పై అమెరికాది కపట ప్రేమే: యూన్ ‘వీటో’నే నిదర్శనం

భారత్ తమకు నిజమైన మిత్ర దేశమని, ఆసియాలోనే తమకు అత్యంత నమ్మకమైన భాగస్వామని నాటి నుంచి నేటి వరకు అదే మాట చెబుతోంది అమెరికా. గతంలో ఒబామా, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్,

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: భారత్ తమకు నిజమైన మిత్ర దేశమని, ఆసియాలోనే తమకు అత్యంత నమ్మకమైన భాగస్వామని నాటి నుంచి నేటి వరకు అదే మాట చెబుతోంది అమెరికా. గతంలో ఒబామా, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్, తాజాగా, ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఇదంతా భారత్‌పై అమెరికా చూపుతున్న కపట ప్రేమేనని తాజా ప్రకటనతో మరోసారి తేలిపోయింది.

మోడీ, ట్రంప్ పిలుపుల్లో భేదాల్లేవ్! బంధం దృఢమే: ఇవాంకా ట్రంప్మోడీ, ట్రంప్ పిలుపుల్లో భేదాల్లేవ్! బంధం దృఢమే: ఇవాంకా ట్రంప్

ఎలాగంటే..

ఎలాగంటే..

ఐక్యరాజ్య సమితి (యూఎన్) భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి పూర్తిగా మద్దతిస్తామని ఇప్పటికే అమెరికా హామీ ఇచ్చింది. అయితే, వీటో పవర్‌ మాత్రం ఉండదని మెలిక పెడుతోంది. తాజాగా మరోసారి అమెరికా ఇవే వ్యాఖ్యలు చేయడం భారత్‌పై ఏ మాత్రం పేముందో తెలుస్తోంది.

భండారీకి శుభాకాంక్షలు చెబుతూ..

భండారీకి శుభాకాంక్షలు చెబుతూ..

అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) సభ్యుడిగా మరోసారి ఎన్నికైన జస్టిస్‌ దల్వీర్‌ భండారీకి అమెరికా శుభాకాంక్షలు తెలియజేసింది. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో 193 ఓట్లకు గాను 183, భద్రతా మండలిలో 15 ఓట్లు ఆయనకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో 200 ఏళ్ల పాటు భారత్‌ను పాలించిన బ్రిటన్‌కు తొలిసారి ఐసీజేలో సభ్యత్వం లేకుండా పోయింది. భండారీకి శుభాకాంక్షలు చెప్పిన సందర్భంలోనే ఐక్యరాజ్యసమితి శాశ్వత సభ్యత్వంపై స్పందించింది.

వీటో పవర్ ఇచ్చేది లేదంటూ..

వీటో పవర్ ఇచ్చేది లేదంటూ..

అమెరికా ప్రభుత్వ అధికార ప్రతినిధి భద్రతా మండలిలో వీటో పవర్‌ విస్తరణ గురించి వ్యాఖ్యానించారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాల సంఖ్యను 15కు పెంచేందుకు సుముఖంగా ఉన్నట్టు అమెరికా తెలిపింది. అయితే, సంస్కరణలకు ఇష్టమున్నా ప్రస్తుత వీటో పవర్‌ నమూనాలో మార్పు చేసేందుకు వీల్లేదని తేల్చిచెప్పింది.

వ్యతిరేకమంటోంది.. ఇంకెందుకు?

వ్యతిరేకమంటోంది.. ఇంకెందుకు?

‘సంస్కరణలు చేసిన మండలి 21వ శతాబ్దం పరిస్థితులను ప్రతిబింబిస్తుందని విశ్వసిస్తున్నాం. ప్రస్తుత సవాళ్లను సమర్థతతో ప్ర‌భావ‌వంతంగా పరిష్కరించేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. వీటో పవర్‌ విస్తరణను మాత్రం మేం వ్యతిరేకిస్తున్నాం' అని అమెరికా స్పష్టం చేయడం గమనార్హం. ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ ఎప్పట్నుంచో వేచి చూస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రధాని మోడీ ఇందుకోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ఐతే భారత్‌కు వీటో అధికారం లేకుండా శాశ్వత సభ్యత్వం ఇచ్చినా పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు.

English summary
The US has congratulated Justice Dalveer Bhandari for his re-election to the ICJ, but asserted that it is against any change in the current veto structure of the UN Security Council, even as it favours a modest expansion of the 15-membered body.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X