వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ల ఎన్నికను ధృవీకరించిన యూఎస్ కాంగ్రెస్

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికపై నెలకొన్న సందిగ్ధానికి ఎట్టకేలకు తెరపడింది. 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయడానికి జో బైడెన్ కు లైన్ క్లియర్ అయింది. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ , అలాగే ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ల విజయాన్ని అమెరికా కాంగ్రెస్ ధృవీకరించింది.

జో బైడెన్ కు జనవరి 20 న ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమం

జో బైడెన్ కు జనవరి 20 న ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమం

జో బైడెన్ కు జనవరి 20 న ఆయన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మార్గం సుగమం చేసింది యూఎస్ కాంగ్రెస్ . అమెరికా చట్టసభ సభ్యులు గురువారం అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌ను అధికారికంగా ధృవీకరించారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ గెలుపును ధృవీకరించడం కోసం ఏర్పాటుచేసిన యూఎస్ కాంగ్రెస్ సమావేశం తీవ్ర హింసాత్మక ఘటనలకు కేంద్ర బిందువు అయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.

భయాందోళన మధ్య ఎన్నిక కొనసాగించిన యూఎస్ కాంగ్రెస్

భయాందోళన మధ్య ఎన్నిక కొనసాగించిన యూఎస్ కాంగ్రెస్

ట్రంప్ మద్దతుదారులు జో బైడెన్ ఎన్నికను వ్యతిరేకిస్తూ హింసకు పాల్పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా యూఎస్ లో చోటు చేసుకున్న హింసపై ఆందోళన వ్యక్తమైంది. అగ్రరాజ్య చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో అమెరికా క్యాపిటల్ భవనం పై జరిగిన దాడి దాదాపు నాలుగు గంటలపాటు కొనసాగింది . హింసాత్మక వాతావరణంలో చట్ట సభ్యులు భయాందోళనకు గురయ్యారు . అయినప్పటికీ సమావేశాన్ని కొనసాగించి అధ్యక్షుడిగా జో బైడెన్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

ప్రెసిడెంట్ గా జో బైడెన్ ను ధ్రువీకరించిన యూఎస్ కాంగ్రెస్

ప్రెసిడెంట్ గా జో బైడెన్ ను ధ్రువీకరించిన యూఎస్ కాంగ్రెస్

హింసాత్మక పరిణామాల నేపథ్యంలోనూ సమావేశాన్ని కొనసాగించిన వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ సభ్యులు ఎలక్టోరల్ ఓట్లను లెక్కించి బైడెన్ ఎన్నికను ధ్రువీకరించారు. అంతేకాదు పార్లమెంట్ భవనంపై దాడిని తీవ్రంగా ఖండించారు . నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో జో బైడెన్ కు 306 ,డోనాల్డ్ ట్రంప్ కు 232 ఓట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలను అంగీకరించడానికి, మొదటి నుంచి నిరాకరిస్తున్న ట్రంప్ చివరివరకూ అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. హింసాత్మక ఘటనలకు సైతం కారణమయ్యారు.

English summary
US lawmakers on Thursday formally certified Joe Biden as the winner of the presidential election , clearing the way for his inauguration on January 20.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X