వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాపై కొత్త పిడుగు: ఆ దిశగా అమెరికా: కమ్యూనిస్టు పార్టీ గూఢచర్యం: యూఎస్ కాంగ్రెస్ లేఖ

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రపంచాన్ని మృత్యుముఖంలోకి నెట్టేసిన భయానక కరోనా వైరస్‌కు జన్మనిచ్చినట్టుగా అనుమానిస్తోన్న కమ్యూనిస్టు దేశం చైనాపై కొత్త పిడుగు పడబోతోంది. చైనా అంటే ఇప్పటికే ఒంటికాలి మీద లేస్తోన్న అగ్రరాజ్యం అమెరికా.. మరో కీలక నిర్ణయాన్ని తీసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. టిక్‌టాక్ సహా చైనా సంస్థలు రూపొందించిన అన్ని రకాల యాప్స్‌ను బ్యాన్ చేసే దిశగా అమెరికా చర్యలను తీసుకోబోతోంది. త్వరలోనే దీనికి సంబంధించిన ఆదేశాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయొచ్చని అంటున్నారు.

చంద్రబాబుకు టీడీపీ ఎమ్మెల్యే ఘాటు లేఖ: విశాఖలో పార్టీ మనుగడ కష్టం: కన్నెత్తి చూడట్లేదంటూచంద్రబాబుకు టీడీపీ ఎమ్మెల్యే ఘాటు లేఖ: విశాఖలో పార్టీ మనుగడ కష్టం: కన్నెత్తి చూడట్లేదంటూ

ఇప్పటికే భారత్.. చైనా యాప్స్‌ను నిషేధించింది. టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, షేర్ ఇట్ వంటి 59 యాప్స్‌ను బ్యాన్ చేసింది భారత్. భారత్ తరహాలోనే అమెరికాలో కూడా చైనా యాప్స్‌ వినియోగాన్ని నిషేధించాలని యూఎస్ కాంగ్రెస్ సభ్యులు.. డొనాల్డ్ ట్రంప్‌కు లేఖ రాశారు. 25 మంది యూఎస్ కాంగ్రెస్ సభ్యులు ఈ లేఖపై సంతకాలు చేశారు. సాధ్యమైనంత త్వరగా చైనా యాప్స్‌ను నిషేధించాలంటూ విజ్ఙప్తి చేశారు. అమెరికా జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకోవాలని వారు ట్రంప్‌కు సూచించారు.

US Congress writes to Trump urge to take strong action to stop CCPs espionage campaign

చైనా యాప్స్‌ను ఎంతమాత్రం విశ్వసించవద్దని యూఎస్ సభ్యులు ట్రంప్‌కు సూచించారు. చైనా యాప్స్ మాత్రమే కాదు.. వెబ్‌సైట్లను కూడా నిషేధం జాబితాలో చేర్చాలని పేర్కొన్నారు. యాప్స్ ద్వారా కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం అమెరికా భద్రతకు సంబంధించిన కీలకమైన, విలువైన సమాచారాన్ని చోరీ చేస్తోందని, డేటాను దొంగిలిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయని అననారు. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని చైనా యాప్స్, వెబ్‌సైట్లను నిషేధించాలని కోరారు.

US Congress writes to Trump urge to take strong action to stop CCPs espionage campaign

ఇదిలావుండగా.. టిక్‌టాక్ సహా చైనా యాప్స్‌ను నిషేధించడానికి ఉద్దేశించిన ఓ బిల్లును త్వరలోనే ఓటింగ్ కోసం సెనెట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఫెడరల్ ఉద్యోగులందరూ చైనా యాప్స్‌ వినియోగాన్ని నిషేధించేలా ఈ బిల్లును రూపొందించారు. రిపబ్లికన్ సెనెటర్ జాష్ హావ్‌లే వచ్చే వారం ఈ బిల్లును సెనెట్‌లో ప్రవేశపెడతారని అంటున్నారు. వీలైనంత త్వరగా చైనా యాప్స్‌ వినియోగాన్ని నిషేధించాల్సిన అవసరం ఉందని జాష్ అభిప్రాయపడ్డారు. చైనా యాప్స్‌ను నిషేధించ వచ్చని భారత్ నిరూపించిందని, దీన్ని అనుసరించాల్సి ఉందని చెప్పారు.

US Congress writes to Trump urge to take strong action to stop CCPs espionage campaign
English summary
Members of the US Congress have written a strongly worded letter to US President Donald Trump praising India’s decision to ban 59 Chinese apps, including TikTok and saying US shouldn’t trust them either. In the letter, the US Congress members have said, “In June, India took an extraordinary step of banning Chinese affiliated-apps, including TikTok, due to national security concerns. CCP's systemic campaign to collect and illicitly transmit user data to Chinese govt is not unique to Indian consumers.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X