వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తుపాకీ అనుకుని ఐఫోన్ పట్టుకున్న నల్లజాతి యువకుడి కాల్చివేత: పోలీసులపై ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

కాలిఫోర్నియా: అమెరికాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐఫోన్‌తో వెళుతున్న ఓ నల్లజాతి యువకుడిని తుపాకీతో వెళుతున్నాడని భావించి పోలీసులు కాల్చి చంపారు. ఇద్దరు పిల్లలకు తండ్రైన స్టీఫెన్ క్లార్క్ అనే 22ఏళ్ల యువకుడు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

ఈ ఘటన అమెరికాలోని సాక్రామెంటోలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఘటనపై ఆగ్రహానికి గురైన స్థానికులు తీవ్ర ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. కాగా, తాజా ఈ ఘటనకు సంబంధించి సాక్రామెంటో పోలీసు విభాగానికి చెందిన హెలికాప్టర్ ఇన్‌ఫ్రా రెడ్ కెమెరా ద్వారా చిత్రీకరించిన వీడియోను పోలీసులు విడుదల చేశారు.

 US cops kill African-American fearing he has a gun. He was holding an iPhone

ఓ వ్యక్తి వాహనం కిటికీలు పగులగొట్టాడని అత్యవసర విభాగం 911కి వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు అక్కడికి వెళ్లారు. క్లార్క్ తన ఇంటి వెనుక భాగంలో ఫోన్ పట్టుకుని ఉండగా పోలీసులు అతడ్ని చుట్టుముట్టారు. అయితే, అతడి వద్ద ఉన్నది తుపాకీ అనుకుని కాల్పులు జరిపారు.

నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

కాగా, క్లార్క్ పారిపోయేందుకు ప్రయత్నించినట్లు.. పోలీసులు అతడి చేతిలో ఏముందో చూపించాలని పలుమార్లు అడిగినట్లు ఆ వీడియో ఫుటేజీలో రికార్డైంది. అంతేగాక, తుపాకీ తుపాకీ అని అరిచినట్లు వీడియో ఫుటేజీలో కనిపించింది. అతడు పారిపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.

సాక్రామెంటోలోని ఇంట్లో క్లార్క్ తన బామ్మ, తాతతో కలిసి ఉంటున్నాడు. నిరాయుధుడైన వ్యక్తిని పోలీసులు అన్యాయంగా కాల్చి చంపారని క్లార్క్ బామ్మ, తాత సహా స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ భారీ ఎత్తున నిరసనలు తెలిపారు. కాగా, ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

English summary
Police in Sacramento, California, shot dead an African-American father of two in the backyard of his grandparents’ home fearing that he was carrying a weapon. He was actually holding an iPhone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X