బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇస్రో పార్ట్‌నర్ ఆంట్రిక్స్‌‌కు అమెరికా కోర్టు షాక్..దేవాస్‌‌కు భారీ పరిహారం చెల్లించాలంటూ...!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఇస్రో వాణిజ్య భాగస్వామి ఆంట్రిక్స్ కార్పొరేషన్‌కు అమెరికా కోర్టు షాకిచ్చింది. బెంగళూరులోని దేవాస్ మల్టీమీడియా అనే ఓ స్టార్టప్ కంపెనీతో 2005లో శాటిలైట్ ఒప్పందం రద్దు చేసుకున్నందున ఆ కంపెనీకి 1.2 బిలియన్ అమెరికా డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. జనవరి 2005లో ఆంట్రిక్స్ రెండు ఉపగ్రహాలను రూపొందించి, లాంచ్‌ప్యాడ్‌ నుంచి పరీక్షించేలా దేవాస్ మల్టీమీడియాతో ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాదు 70 మెగా హెర్ట్జ్ బ్యాండ్ స్పెక్ట్రం కూడా దేవాస్‌కు అందుబాటులోకి తీసుకురావాలని ఒప్పందం కుదుర్చుకుంది.

2011 ఫిబ్రవరిలో ఈ ఒప్పందంను ఆంట్రిక్స్ రద్దు చేసుకుంది. దీంతో న్యాయపరమైన పోరాటానికి దేవాస్ సంస్థ దిగింది. సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించగా ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించింది. అక్టోబర్ 27న జరిగిన విచారణలో భాగంగా ఆంట్రిక్స్ ఒప్పందం ఉల్లంఘించినందుకు గాను దేవాస్ మల్టీమీడియా కార్పొరేషన్‌కు 562.5 మిలియన్ అమెరికా డాలర్లు పరిహారంగా చెల్లించాలని తీర్పునిచ్చారు సియాటెల్‌లోని జిల్లా జడ్జి జస్టిస్ థామస్ ఎస్ జిల్లీ. దీనికి వడ్డీతో కలిపి మొత్తం 1.2 బిలియన్ అమెరికా డాలర్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

US Court orders ISRO commercial partner Antrix to pay USD 1.2 billion to Devas for deal violation

2018లో ఒప్పందం రద్దు వ్యవహారంపై వాషింగ్టన్‌లోని వెస్ట్రన్ డిస్ట్రిక్ట్ కోర్టులో దేవాస్ మల్టీమీడియా సంస్థ పిటిషన్ దాఖలు చేసింది.ఈ సందర్భంగా పలు అంతర్జాతీయ ట్రైబ్యునల్స్ కూడా ఈ ఒప్పందం ఉల్లంఘించడం ముమ్మాటికీ తప్పే అని ఆదేశాలు ఇచ్చాయని కోర్టు దృష్టికి దేవాస్ సంస్థ తీసుకొచ్చింది. 2018 నవంబర్‌లో న్యాయపరిధి సమస్యలను పేర్కొంటూ దేవాస్ వేసిన పిటిషన్‌ను కొట్టివేయాల్సిందిగా ఆంట్రిక్స్ కోర్టును ఆశ్రయించింది. ఆంట్రిక్స్ వేసిన పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు.. రెండు పార్టీలను ఏప్రిల్ 15 2020లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ కోర్టు ఒక ఏడాది పాటు స్టే ఇచ్చింది.

ఇక ఈ ఏడాది జూలైలో జరిగిన వాదనల సందర్భంగా న్యాయపరిధి సమస్య కానే కాదని దేవాస్ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఎందుకంటే ఆంట్రిక్స్ సంస్థ తన కార్యకలాపాలను అమెరికాలో కూడా నిర్వహిస్తోందని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఒప్పందం చేసుకున్న ఐదేళ్లు ఆంట్రిక్స్ బాగానే కలిసి పనిచేసిందని అదే సమయంలో దేవాస్ భారత్‌లో నిర్వహించిన పలు ప్రయోగాలను పర్యవేక్షించేందుకు ఆంట్రిక్స్ ఛైర్మెన్‌‌తో పాటు ఇతర ప్రతినిధులు భారత్‌కు వచ్చారని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.

English summary
A US court has asked Antrix Corporation, the commercial arm of ISRO, to pay compensation of USD 1.2 billion to a Bengaluru-based startup, Devas Multimedia, for cancelling a satellite deal in 2005.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X