వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: 'వాన్నా క్రై ర్యాన్సమ్‌వేర్ ' దాడి వెనుక కిమ్: అమెరికా

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రపంచాన్ని కుదిపేసిన 'వాన్నా క్రై ర్యాన్సమ్‌వేర్ 'వెనుక ఉత్తరకొరియా హస్తం ఉందని అమెరికా ఆరోపించింది. ఇందుకు బలమైన సాక్ష్యాలున్నాయని అమెరికా మీడియా ప్రకటించింది. ఈ విషయమై వైట్‌హౌజ్ ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.

అమెరికాతో చర్చలకు ఉ.కొరియా సై: అగ్రరాజ్యం మెలిక, చొరవ చూపిన రష్యా అమెరికాతో చర్చలకు ఉ.కొరియా సై: అగ్రరాజ్యం మెలిక, చొరవ చూపిన రష్యా

'వాన్నా క్రై ర్యాన్సమ్‌వేర్' ప్రపంచాన్ని గడగడలాడించింది. ఈ సైబర్ దాడి వెనుక ఉత్తరకొరియా హస్తం ఉందని గతంలోనే అమెరికా ఆరోపణలు చేసింది. అయితే తాజాగా దీనికి సాక్ష్యాలున్నాయని కూడ అమెరికా తేల్చి చెప్పేసింది.

కిమ్‌కు షాక్: ఆ భయంతో సైనికుల పరార్, అంతు చిక్కని వ్యాధులు కిమ్‌కు షాక్: ఆ భయంతో సైనికుల పరార్, అంతు చిక్కని వ్యాధులు

ఉత్తరకొరియా ఇటీవల కాలంలో అణుపరీక్షలు, క్షిపణి దాడుల నిర్వహణ విషయంలో ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ఉత్తరకొరియాపై ఐక్యరాజ్యసమితి పలు ఆంక్షలను కూడ విధించింది.

కిమ్‌కు షాక్: ఉ.కొరియాకు పోటీగా ద. కొరియా క్షిపణి ప్రయోగం, యుద్దం తప్పదా?కిమ్‌కు షాక్: ఉ.కొరియాకు పోటీగా ద. కొరియా క్షిపణి ప్రయోగం, యుద్దం తప్పదా?

'వాన్నా క్రై ర్యాన్సమ్‌వేర్' వెనుక ఉత్తరకొరియా

'వాన్నా క్రై ర్యాన్సమ్‌వేర్' వెనుక ఉత్తరకొరియా

ఉత్తర కొరియాకు చెందిన లాజారస్‌ సంస్థ ద్వారానే ఈ సైబర్‌ దాడి జరిగిందని గుర్తించినట్టుగా అమెరికా తాజాగా ప్రకటించింది. గతంలో ఈ దాడికి ఉత్తరకొరియా పరోక్షంగా సంబంధం ఉందంటూ అమెరికా ఆరోపణలు చేసిందిజ అయితే తాజాగా మాత్రం అందుకు బలమైన సాక్ష్యాలే ఉన్నాయని ప్రకటించింది. లాజారస్ సంస్థ పేరును అమెరికా ప్రకటించింది.

అమెరికా మీడియా కథనం

అమెరికా మీడియా కథనం

ట్రంప్‌ భద్రతా సలహాదారు టామ్‌ బాసొర్టే వ్యాఖ్యలను ఊటంకిస్తూ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ సోమవారం ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ విషయంలో మరిన్ని వివరాలు అధికారికంగా వెలువడితేనే బావుంటుంది అని ఆయన ఆ వ్యాసంలో పేర్కొన్నారు.

కవ్వింపు చర్యలకు ఉత్తరకొరియా

కవ్వింపు చర్యలకు ఉత్తరకొరియా

దశాబ్దంగా ఉత్తర కొరియా వైఖరి ఏ మాత్రం బాగోలేదు. కవ్వింపు చర్యలతో తోటి దేశాలను ఉల్లంఘిస్తోంది. అంతేకాదు అణు పరీక్షలతో అంతర్జాతీయ సమాజానికి హెచ్చరికలు జారీ చేస్తోంది. అందులో భాగంగానే వాన్నాక్రై దాడికి పూనుకుంది. ఉత్తర కొరియా హస్తం ఉన్నట్లు బలమైన ఆధారాలు అమెరికా సంపాదించిందని ఆయన తన వ్యాసంలో అభిప్రాయపడ్డారు.

వైట్‌హౌజ్ స్పందించే అవకాశం

వైట్‌హౌజ్ స్పందించే అవకాశం

2014లో సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సంబంధించిన కీలక డేటాను, కార్పొరేట్‌ సమాచారాన్ని నాశనం చేసినట్లు లాజారస్‌ సంస్థపై ఆరోపణలు ఉన్నాయి. మంగళవారం వైట్‌హౌస్‌ నుంచి ఈ ఆరోపణలపై మరింత స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

హ్యకింగ్ టూట్‌ తస్కరించి ఇలా..

హ్యకింగ్ టూట్‌ తస్కరించి ఇలా..

అమెరికా జాతీయ భద్రతా సంస్థ అభివృద్ధి చేసిన ఓ హ్యాకింగ్‌ టూల్‌ను తస్కరించిన సైబర్‌ దొంగలు దాని సహాయంతో ఈ 'వాన్నాక్రై' ర్యాన్సమ్‌ వేర్‌ వైరస్‌ను రూపొందించారు. మొట్టమొదటగా ఈ ర్యాన్‌సమ్‌వేర్‌ సైబర్‌ దాడి స్వీడన్‌లో వెలుగులోకి వచ్చింది. తర్వాత బ్రిటన్‌, ఫ్రాన్స్‌లకు పాకింది. 'వాన్నాక్రై' అనే ర్యాన్సమ్‌వేర్‌ వైరస్‌ దాడితో ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రభుత్వ, ప్రయివేటు కంప్యూటర్లు స్థంబించిపోయాయి.

English summary
The US has declared North Korea the perpetrator of the widespread and financially devastating WannaCry ransomware cyberattack that rapidly spread across the globe in May, hitting hospitals, companies, and other critical institutions in countries around the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X