వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాడెన్‌ ఆచూకీని పాకిస్తాన్‌తో పంచుకోని అమెరికా- నమ్మకం లేకే అన్న మాజీ సీఏఏ బాస్‌

|
Google Oneindia TeluguNews

గతంలో పాకిస్తాన్‌ విషయంలో మెతక వైఖరి అవలంబంచిన అమెరికా ఆ తర్వాత దాన్ని మార్చుకుంది. ముఖ్యంగా తీవ్రవాదానికి ప్రోత్సాహం ఇస్తుందన్న భారత్ విమర్శలను గతంలో లైట్‌ తీసుకున్న అమెరికా అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్‌ను అవసరాల మేరకు మాత్రమే వాడుకోవడం అలవాటు చేసుకుంది.

గతంలో పాకిస్తాన్‌ తీవ్రవాదులకు సంబంధించిన సమాచారాన్ని ఇస్లామాబాద్‌తో పంచుకున్న అమెరికా ఆ సమాచారం కాస్తా తీవ్రవాదులకు లీక్‌ కావడంతో అప్రమత్తమైంది. అల్‌ఖైదా మాజీ బాస్‌ బిన్‌ లాడెన్ ను హతమార్చిన ఆపరేషన్‌ విషయంలో ఆ విషయం మరోసారి రుజువైంది. పాకిస్తాన్‌లో దాక్కున్న బిన్‌ లాడెన్‌ను గుట్టు చప్పుడు కాకుండా హతమార్చిన అమెరికా.. ఈ విషయంలో ఏ విధంగా వ్యవహరించిందనే విషయాన్ని అమెరికా గూఢచార సంస్ధ సీఐఏ మాజీ బాస్‌ లియోన్‌ పనెట్టా తాజాగా వెల్లడించారు.

us didnt share ladens location with pakistan due to lack of trust, says ex cia boss

2011 మే నెలలో పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లోని ఓ బంకర్‌లో దాక్కున్న బిన్‌ లాడెన్‌ ఆచూకీని కనిపెట్టిన అమెరికా నేవీ సీల్‌ టీమ్‌.. ఆ సమాచారాన్ని మాత్రం పాకిస్తాన్‌తో పంచుకోలేదని సీఐఏ మాజీ బాస్‌ పనెట్టా వెల్లడించారు. పాకిస్తాన్‌కు మాట మాత్రమైనా చెప్పకుండానే లాడెన్‌ను గుట్టుగా హతమార్చినట్లు ఆయన తెలిపారు. ఇందుకు గతంలో పాకిస్తాన్‌ వ్యవహారశైలే కారణమన్నారు. తీవ్రవాదులకు సంబంధించి గతంలో తాము ఇచ్చిన ఆధారాలను తిరిగి వారికే పంపిన అనుభవం పాకిస్తాన్‌ నుంచి తమకు ఎదురైందన్నారు. అందుకే లాడెన్‌ విషయంలో తాము జాగ్రత్త పడ్డామన్నారు. అప్పుడు పాకిస్తాన్‌తో ఆ సమాచారం పంచుకుంటే లాడెన్‌ తమకు ఎప్పటికీ దొరికే వాడు కాదని పనెట్టా సంచలన విషయాలు బయటపెట్టారు.

Recommended Video

Donald Trump And His Wife Melania Tested Covid-19 Positve || Oneindia Telugu

పాకిస్తాన్‌పై నమ్మకం లేకే అమెరికా ప్రభుత్వం లాడెన్‌ ఆచూకీని కానీ, ఆపరేషన్‌ గురించి కానీ ఎలాంటి వివరాలు ఆ దేశంతో పంచుకోలేదని పనెట్టా తెలిపారు. పాకిస్తాన్‌తో ఈ సమాచారం పంచుకుని ఉంటే లాడెన్‌ సులువుగా పారిపోయే వాడని ఆయన అన్నారు. పాకిస్తాన్‌ విషయంలో భారత్‌ ఎప్పటి నుంచో వాదిస్తున్న ఆరోపణలకు పనెట్టా వ్యాఖ్యలు బలం చేకూర్చేలా ఉన్నాయి. ఉగ్రవాదులకు పాకిస్తాన్‌ మద్దతిస్తుందనే విషయంలో అమెరికాకు అప్పుడే ఓ క్లారిటీ ఉందనీ తెలుస్తోంది.

English summary
The US did not inform Pakistan about Osama bin Laden's location due to lack of trust and past experiences of terrorists being tipped off after information was shared with Islamabad, former CIA chief Leon Panetta has said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X