వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆప్గనిస్తాన్‌లో అమెరికా అతిపెద్ద బాంబు దాడి, ఐసిస్ టార్గెట్‌గా పాక్ సరిహద్దుల్లో..

సిరియాలో ఇటీవలే క్షిపణిలతో దాడులు చేసిన అమెరికా తాజాగా.. ఆప్ఘనిస్తాన్‌లో భారీ దాడి చేసింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అధికంగా ఉండే ఓ ప్రాంతంలో అతిపెద్ద నాన్ న్యూక్లియర్ బాంబు దాడి చేసింది.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: సిరియాలో ఇటీవలే క్షిపణిలతో దాడులు చేసిన అమెరికా తాజాగా.. ఆప్ఘనిస్తాన్‌లో భారీ దాడి చేసింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అధికంగా ఉండే ఓ ప్రాంతంలో అతిపెద్ద నాన్ న్యూక్లియర్ బాంబు దాడి చేసింది. మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌‌గా పిలిచే అతి శక్తిమంతమైన ఈ బాంబు 21,600 పౌండ్ల బరువుంటుంది. జీపీఎస్‌ ఆధారంగా పని చేస్తుంది.

అఫ్గానిస్థాన్‌లో ఐసిస్‌‌ని ఓడించడానికి చేస్తున్న దాడుల్లో భాగంగానే ఈ బాంబును వేసినట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ చెప్పింది. పౌరులకు నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు.

ఐసిస్‌‌కు వాటిల్లుతున్న నష్టాలు పెరుగుతున్న కొద్దీ వారు ఆత్మరక్షణకు బంకర్లను, సొరంగాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని అఫ్గానిస్థాన్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న అమెరికా బలగాల కమాండర్‌ నికోల్సన్‌ చెప్పారు. వారిని కట్టడి చేయడానికి ఈ బాంబే సరైన ఆయుధమన్నారు.

ఇస్లామిక్ ప్రాబల్యం ఉన్నచోట...

ఇస్లామిక్ ప్రాబల్యం ఉన్నచోట...

ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదుల ప్రాబల్యం అధికంగా ఉండే తూర్పు అఫ్గానిస్థాన్‌లో భారీ బాంబును విడిచినట్లు అమెరికా భద్రతా విభాగం ప్రకటించింది. 9,525 కిలోల బరువు కలిగిన ఆ భారీ బాంబును యంసీ-130 ఎయిర్ క్రాఫ్ట్‌ నుంచి వదిలినట్లు అమెరికా రక్షణ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు.

భారీ బాంబు తొలిసారి..

భారీ బాంబు తొలిసారి..

ఇంత భారీ బాంబుతో దాడి చేయడం ఇదే తొలిసారి అని చెప్పారు. అయితే అది అణు రహిత బాంబు అని స్పష్టం చేశారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం ఏడు గంటలకు ఈ దాడి జరిపినట్లు రక్షణ శాఖ తెలిపింది.

పాక్ సరిహద్దు ప్రాంతం

పాక్ సరిహద్దు ప్రాంతం

అఫ్గాన్‌లోని నంగర్‌హర్‌ జిల్లాలో ఐసిస్‌ ఉగ్రవాదుల భూగర్భ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డారు. ఇది పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండే ప్రాంతం. ఈ మిషన్ (దాడి) కోసం నెలలుగా ప్లాన్ చేసినట్లు చెప్పారు.

నెలలుగా వ్యూహ రచన.. ఒబామా హయాం నుండేనా?

నెలలుగా వ్యూహ రచన.. ఒబామా హయాం నుండేనా?

అయితే, నెలలుగా ప్లాన్ చేసిన ఈ మిషన్ బరాక్ ఒబామా హయాం నుంచి వ్యూహ రచన జరిగిందా లేదా వెల్లడించలేదు. ఐసిస్ పైన యుద్ధం కొనసాగిస్తామని చెప్పారు.

English summary
US has dropped the largest non-nuclear bomb in the country’s arsenal on an area of eastern Afghanistan known to be populated by Isis militants.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X