వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ ఎదురీత ? ఫలించని వ్యూహాలు- కీలక రాష్ట్రాల్లో వెనుకంజ...

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌కు ఎదురీత తప్పడం లేదు. అత్యంత ప్రతికూల పరిస్ధితుల మధ్య దేశ అధ్యక్ష ఎన్నికలు ఎదుర్కొంటున్న ట్రంప్‌ .. అధికారం నిలబెట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నా క్షేత్రస్ధాయిలో మాత్రం అనుకూలత కనిపించడం లేదు. ముఖ్యంగా కరోనా ప్రభావం, దేశ ఆర్ధిక వ్యవస్ధ తలకిందులు కావడం సగటు అమెరికన్లపై నింపుతున్న ఆగ్రహం తాలూకు సెగలు ట్రంప్‌ను తాకుతున్నాయి. దీంతో కీలకమైన బాటిల్‌ గ్రౌండ్ రాష్ట్రాల్లో ట్రంప్‌.. తన డెమోక్రాట్‌ ప్రత్యర్ధి జో బిడెన్‌ కంటే వెనుకబడినట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఇది ట్రంప్‌కూ తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. దీనంతటికీ నువ్వే కారణమంటూ జాతీయ అంటువ్యాధుల నిర్మూలనా సంస్ధ డైరెక్టర్‌తో పాటు మీడియాపైనా ఆయన నిప్పులు చెరుగుతున్నారు.

అమెరికా ఎన్నికల్లో అసలు సమరం అక్కడే- కీలక రాష్ట్రాలపై ట్రంప్‌, బిడెన్‌ గురిఅమెరికా ఎన్నికల్లో అసలు సమరం అక్కడే- కీలక రాష్ట్రాలపై ట్రంప్‌, బిడెన్‌ గురి

 కీలక రాష్ట్రాల్లో ట్రంప్‌ ఎదురీత...

కీలక రాష్ట్రాల్లో ట్రంప్‌ ఎదురీత...

అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. అధ్యక్ష ఉపాధ్యక్ష అభ్యర్ధుల భవితవ్యం నిర్ణయిస్తాయని భావిస్తున్న 12 స్వింగ్‌ రాష్ట్రాల్లో మొగ్గు కోసం రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య ఈసారి కూడా హోరాహోరీ పోరు తప్పడం లేదు. వీటిలో
కొలరాడో, లోవా, మిచిగన్‌, మిన్నెసోటా, నెవెడా, న్యూ హ్యాంప్‌షైర్, నార్త్ కరోలియా, ఓహియో, పెన్సిల్వేనియా, వర్జీనియా, విస్కాన్సిన్‌ రాష్ట్రాలున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఆధిక్యం సాధించగలిగితే అధికారం పీఠం అందుకోవచ్చనే అంచనాలు ఎప్పుడూ రెండు పార్టీల్లోనూ ఉంటాయి. అయితే ఈసారి మారిన పరిస్ధితుల్లో ట్రంప్‌కు ఆయా రాష్ట్రాల్లో ఆధిక్యం కష్టమేనన్న అంచనాలు వెలువడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం దేశంలో నెలకొన్న కరోనా పరిస్ధితులు, ఆర్ధిక వ్యవస్ధ కుదైలు కావడం, ఉద్యోగాల కల్పన వంటి అంశాలున్నాయి.

ట్రంప్‌లో పెరిగిపోతున్న ఫ్రస్ట్రేషన్‌..

ట్రంప్‌లో పెరిగిపోతున్న ఫ్రస్ట్రేషన్‌..

అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడటం, కీలక రాష్ట్రాల్లో తాను వెనుకబడ్డానన్న మీడియా అంచనాలు ట్రంప్‌లో ఆక్రోశం పెంచుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో పరిస్దితులను తనకు అనుకూలంగా మల్చుకునేందుకు ట్రంప్‌ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో తన ప్రచారంలో అభివృద్ధి కంటే విమర్శలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ముఖ్యంగా జాతీయ అంటువ్యాధుల నిర్మూలనా సంస్ధ డైరెక్టర్‌ ఆంటోనీ ఫాసియోను ట్రంప్‌ లక్ష్యంగా చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫాసియో కారణంగానే కరోనాను తన ప్రభుత్వం నియంత్రించలేకపోయిందన్న చెడ్డపేరు వచ్చిందని, దాదాపు 2.2 లక్షల మంది అమెరికన్ల చావుకు కారణమయ్యామనే అపప్రద మూటగట్టుకున్నట్లు ట్రంప్ భావిస్తున్నారు.

ఫాసీ వల్లే నాకు ఈ దుస్ధితి...

ఫాసీ వల్లే నాకు ఈ దుస్ధితి...

జాతీయ అంటువ్యాధుల నిర్మూలనా సంస్ధ డైరెక్టర్‌గా సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉన్న ఆంటోనీ ఫాసీ ప్రస్తుతం కరోనా కట్టడికి ఏమాత్రం కృషి చేయలేదని ట్రంప్‌ బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ప్రజలు ఫాసీ లాంటి మూర్ఖుల మాటలు వినీ వినీ అలసిపోయారని ట్రంప్‌ చేసిన తాజా వ్యాఖ్యలు ఆయన ఫ్రస్టేషన్‌కు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఫాసీ ఓ విపత్తు అని, ఆయన టీవీలో కనిపించిన ప్రతిసారీ ఏదో ఒక బాంబు పేల్చుతాడంటూ ట్రంప్‌ తాజాగా ఆక్రోశం వ్యక్తం చేశారు. కానీ తన ప్రత్యర్ధి బిడెన్‌ మాత్రం ఫాసీ మాటలే వింటాడంటూ ఆయనపైనా ట్రంప్ విరుచుకుపడ్డారు. ట్రంప్‌ వ్యాఖ్యలను దగ్గరి నుంచి గమనిస్తున్న వారు ఆయన ఓటమికి సిద్ధపడే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.

Recommended Video

US Election 2020 : Joe Bidenకు ఓటమి తప్పదు.. ఆ చెత్తను ఊడ్చిపారేస్తా! - Donald Trump
 ట్రంప్‌పై విమర్శల వెల్లువ...

ట్రంప్‌పై విమర్శల వెల్లువ...

ప్రపంచమంతా కరోనా కట్టడి విషయంలో శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు వింటుంటే ట్రంప్‌ మాత్రం వారిపై విరుచుకుపడటాన్ని సగటు అమెరికన్లు సైతం అంగీకరించలేకపోతున్నారని తాజా అంచనాలు చెబుతున్నాయి. జాతీయ అంటు వ్యాధుల నిర్మూలనా సంస్ధ డైరెక్టర్‌ ఆంటోనీ ఫాసీ సైతం ట్రంప్‌ తీరుపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ప్రచారంలో భాగంగా ఎక్కువ ర్యాలీల్లో పాల్గొనడం వల్ల కరోనా బారిన పడ్డారని, మాస్క్‌ కూడా లేకుండా ఆయన ఇప్పటికీ ప్రచారం చేస్తున్నారని, ఇది చాలా రిస్క్‌ అని ఆయన తెలిపారు. ఫాసీ వంటి నిపుణుల సూచనలు పట్టించుకోకుండా ఆయన్ను ట్రంప్‌ టార్గెట్‌ చేయడంపై బిడెన్‌ సైతం తన ప్రచారంలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాను ఓడిపోతే దేశం వదలి వెళ్తానంటూ ట్రంప్‌ తాజాగా చేస్తున్న వ్యాఖ్యలను సైతం బిడెన్‌ జనంలోకి తీసుకెళ్తున్నారు.

English summary
An angry President Donald Trump came out swinging Monday against Dr. Anthony Fauci, the press and polls that show him trailing Democrat Joe Biden in key battleground states in a disjointed closing message two weeks out from Election Day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X