వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

US election 2020: వైట్ హౌస్ ఉద్యోగుల చీఫ్ కు కరోనా పాజిటివ్, ట్రంప్ తో పార్టీలు, ప్రచారం, గోవిందా !

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్/ న్యూయార్క్: అమెరికాలో అధికారుల నిర్లక్షం కారణంగా కరోనా వైరస్ (COVID-19) ఏ రేంజ్ లో తాండవం చేస్తుందో మరోసారి వెలుగు చూసింది. శ్వేతభవనం (వైట్ హౌస్) ఉద్యోగుల చీఫ్ కు కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో అధికారులు, ఉద్యోగులు ప్రాణభయంతో హడలిపోతున్నారు. అమెరికా అధ్యక్షుడు ఎవరు ? అనే విషయం కొన్ని గంటల్లో తేలిపోతున్న సందర్బంగా వైట్ హౌస్ చీఫ్ మార్క్ మిడోస్ కు కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో కలకలం రేపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కలిసి మార్క్ మిడోస్ ఎన్నికల ప్రచారం చెయ్యడమే కాకుండా పార్టీలో మాస్క్ వేసుకోకుండా పాల్గొన్నారని వెలుగు చూసింది.

US election 2020: న్యూయార్క్ లో హైఅలర్ట్, ఎవడిగోళవాడిది, చీటీ చినిగిపోకుండా ముందు జాగ్రత్తలు !US election 2020: న్యూయార్క్ లో హైఅలర్ట్, ఎవడిగోళవాడిది, చీటీ చినిగిపోకుండా ముందు జాగ్రత్తలు !

 చీఫ్ చీటి చినిగిపోయింది

చీఫ్ చీటి చినిగిపోయింది

అమెరికాలో ఇటీవల ఓ బహిరంగ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి వైట్ హౌస్ ఉద్యోగుల చీఫ్ మార్క్ మిడోస్ హాజరైనారు. అమెరికాలో కరోనా వైరస్ తాండవం చేస్తుంటే ప్రజలకు బుధ్దిమాటలు చెప్పాల్సిన వైట్ హౌస్ ఉద్యోగుల చీఫ్ మార్క్ మిడోస్ పాటుపడ్డారు. ముఖానికి మాస్క్ వేసుకోకుండా బహిరంగ సమావేశంలో పాల్గొనడంతో ఆయనకు చీటి చినిగిపోయింది.

 ట్రంప్ తో వేదిక మీద ప్రచారం !

ట్రంప్ తో వేదిక మీద ప్రచారం !

గత మంగళవారం అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్బంగా ఆ దేశ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ సందర్బంలో రిపబ్లికన్ పార్టీ తరపున ప్రచారం చెయ్యడానికి డొనాల్డ్ ట్రంప్ తోపాటు వైట్ హౌస్ ఉద్యోగుల చీఫ్ మార్క్ మిడోస్ కూడా వెళ్లారని అమెరికాలోని మీడియా వెల్లడించింది.

 ఢాం ఢూమ్ డిన్నర్ లో మార్క్

ఢాం ఢూమ్ డిన్నర్ లో మార్క్

ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద ఎత్తున ఓ పార్టీ ఇచ్చారు. ఢాం ఢూమ్ అంటూ జరిగిన ఆ పార్టీలో డొనాల్డ్ ట్రంప్ తోపాటు ఆయన సన్నిహితులు, అధికార పార్టీ నాయకులు, పారిశ్రామిక వేత్తలు, అధికారులు, వైట్ హౌస్ ఉద్యోగుల చీఫ్ మార్క్ మిడోస్ తదితరులు పాల్గొన్నారు. ఆ సందర్బంలో పార్టీలో మార్క్ మిడోస్ మాస్క్ వేసుకోకుండా హడావిడి చేశారని ఆరోపణలు ఉన్నాయి.

 అసలే ట్రంప్ కు లైఫ్

అసలే ట్రంప్ కు లైఫ్

ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స చేయించుకుని వ్యాధి నయం చేసుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా, కుమారుడు కరోనాక చికిత్స చేయించుకుని నయం చేసుకున్నారు. అయితే వైట్ హౌస్ ఉద్యోగుల చీఫ్ మార్క్ మిడోస్ కు కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో ఆయనతో కలిసి పార్టీలో, ఎన్నికల ప్రచారం చేసిన ట్రంప్ ఇప్పుడు ఆందోళన చెందుతున్నారని అమెరికా మీడియా అంటోంది. మొత్తం మీద మార్క్ మిడోస్ దెబ్బతో వైట్ హౌస్ సిబ్బంది హడలిపోతున్నారని సమాచారం.

English summary
US election 2020: Coronavirus Infection To White House Chief Of Staff Mark Meadows.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X