• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చైనాపై నిప్పులు చెరిగే ట్రంప్‌ అడ్డంగా దొరికారు... ఇక జో బిడెన్‌కు లైన్ క్లియర్..?

|

న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో ట్రంప్‌కు సంబంధించిన వ్యక్తిగత విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా ట్రంప్ ట్యాక్స్ రికార్డ్స్ చూస్తే ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

  US Election 2020 : Tax Records Show Trump Maintains Chinese Bank Account | Oneindia Telugu
  చైనా బ్యాంకు ఖాతా కలిగి ఉన్న ట్రంప్

  చైనా బ్యాంకు ఖాతా కలిగి ఉన్న ట్రంప్

  చైనా దేశమన్నా.. చైనా పేరు విన్నా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓ రేంజ్‌లో మండిపడతారు. అలాంటి ట్రంప్ ఏకంగా చైనాలో ఓ బ్యాంక్ అకౌంట్‌ను మెయిన్‌టెయిన్ చేస్తున్నాడంటే నమ్ముతారా.. ? కానీ ఇది నిజం. ట్రంప్ ట్యాక్స్ రికార్డులు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. వ్యాపారవేత్తగా ట్రంప్ చైనాలో కొన్నేళ్ల పాటు పలు ప్రాజెక్టులు చేపట్టాడు. ఈ క్రమంలోనే ఆయన చైనా బ్యాంకు ఖాతాను కలిగిఉన్నాడని ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్ కథనంలో పేర్కొంది. డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జోబిడెన్‌ చైనా వైఖరిపై చాలా మృదువుగా ఉన్నారంటూ చిత్రీకరించే ప్రయత్నం చేసిన ట్రంప్‌కు ఇది ఎదురుదెబ్బగా నిలుస్తుందని న్యూయార్క్ టైమ్స్ కథనంలో పేర్కొంది.

  కార్పొరేట్ సంస్థ పేరుతో బ్యాంకు ఖాతా

  కార్పొరేట్ సంస్థ పేరుతో బ్యాంకు ఖాతా

  ఇక ట్రంప్‌కు సంబంధించిన పన్ను రికార్డులను విశ్లేషించిన న్యూయార్క్ టెమ్స్... చైనాలో ట్రంప్‌ ఒక బ్యాంకు ఖాతాను కలిగి ఉన్నాడని పేర్కొంది. అయితే ప్రజాజీవితంలోకి అడుగుపెట్టాక తాను బయటపెట్టిన తన ఆర్థికపరమైన వివరాల్లో దీన్ని చేర్చలేదని న్యూయార్క్ టెమ్స్ రిపోర్ట్ చేసింది.ఎందుకంటే ఈ ఖాతా కార్పొరేట్ సంస్థ పేరుపై నడుపుతున్నట్లు వివరించింది. చైనాలోనే కాకుండా ట్రంప్‌కు బ్రిటన్ మరియు ఐర్లాండ్‌ దేశాల్లో కూడా బ్యాంకు ఖాతాలు ఉన్నాయని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.

  ట్రంప్ లాయర్ ఏం చెబుతున్నారు..?

  ట్రంప్ లాయర్ ఏం చెబుతున్నారు..?

  చైనాలో ట్రంప్ ఇంటర్నేషనల్ హోటెల్స్ మేనేజ్‌మెంట్ పేరుతో బ్యాంకు ఖాతాను నిర్వహించే వారని 2013 నుంచి 2015 సమయంలో 188,561 డాలర్లు మేరా చైనాలో పన్ను చెల్లించినట్లు పత్రిక స్పష్టం చేసింది. అయితే ట్రంప్ విదేశీ బ్యాంకు ఖాతాల నుంచి ఎంత డబ్బులు బదిలీ అయ్యాయో అన్న విషయం మాత్రం ఈ ట్యాక్స్ రికార్డుల్లో లేదని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఇదిలా ఉంటే విదేశాల నుంచి తమకు వస్తున్న ఆదాయం వివరాలను కచ్చితంగా పొందుపర్చాలని ఇంటర్నల్ రెవిన్యూ సర్వీసెస్ నిబంధన ఉంది. ఇదిలా ఉంటే ట్రంప్ ఇంటర్నేషనల్ హోటెల్స్ మేనేజ్‌మెంట్ మాత్రం కొన్ని వేల డాలర్లు మాత్రమే చైనా నుంచి వస్తున్నట్లు పొందుపర్చింది. ఇదిలా ఉంటే ట్రంప్‌కు చైనాలో బిజినెస్‌ ఉంది కాబట్టి అక్కడ స్థానికంగా పన్నులు చెల్లించాల్సి ఉన్నందునే అక్కడ బ్యాంకు ఖాతా తెరిచినట్లు ట్రంప్ లాయర్ అలన్ గార్టన్ చెప్పారు. అయితే ఆ బ్యాంకు పేరు మాత్రం బయటకు చెప్పలేదు.

  జోబిడెన్‌కు చెక్ పెట్టాలని భావించిన ట్రంప్

  జోబిడెన్‌కు చెక్ పెట్టాలని భావించిన ట్రంప్

  ఇక చైనాలో ఈ బ్యాంకు ఖాతా నుంచి ఎలాంటి లావాదేవీలు కానీ, ఇతరత్ర వాణిజ్యపరమైన కార్యకలాపాలు కానీ నిర్వహించలేదని చెప్పిన లాయర్ అలన్ గార్టన్... 2015 నుంచి ఖాతా క్రియాశీలకంగా లేదని తెలిపారు. ఖాతా తెరిచి ఉన్నప్పటికీ దాన్ని మరో రకమైన పనులకు వినియోగించడం లేదని స్పష్టం చేశారు. ఇక జోబిడెన్ చైనాతో చాలా సున్నితంగా వ్యవహరిస్తున్నారంటూ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఇక ఫలించవని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ ట్యాక్స్ రికార్డులను పరిశీలిస్తే చైనాలో ఐదు కంపెనీల్లో 192,000 డాలర్లను పెట్టుబడిగా పెట్టినట్లు తెలుస్తోంది. 2010 నుంచి 97,400 డాలర్లు ఖర్చు అయినట్లు ఈ కంపెనీలు పేర్కొన్నాయి.

  English summary
  President Donald Trump's tax records show he has pursued expansive business projects in China for years and even maintains a Chinese bank account
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X