వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

us election 2020: చివరి డిబేట్లో కీలక అంశాలపై డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మొదటి డిబేట్ ఇప్పటికే ముగియగా.. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కరోనా సోకడంతో రెండో డిబేట్ రద్దయ్యింది. ఆ తర్వాత నేడు డొనాల్డ్ ట్రంప్, ఆయన ప్రత్యర్థి, డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ చివరిదైన మూడో డిబేట్లో పాల్గొన్నారు.

నాష్విల్లె‌ల్లో జరుగుతున్న డిబేట్లో పలు కీలక ప్రశ్నలకు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ సమాధానమిస్తున్నారు. ఈ డిబెట్లో కొత్తగా మ్యూట్ బటన్ కూడా పెట్టారు. వివాదాస్పద వ్యాఖ్యలు, మరొకరు మాట్లాడుతుండగా కలగజేసుకోవడాన్ని నివారించేందుకు ఈ బటన్ ఉపయోగించనున్నారు. చివరి డిబేట్ కావడంతో అమెరికాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఈ డిబేట్ ను వీక్షిస్తున్నారు.

కరోనా వ్యాక్సిన్, విద్య అనే అంశాలే మూడో డిబేట్లో కీలకంగా మారాయి.

చివరి చర్చకు మొదటి అంశం: కరోనావైరస్ మహమ్మారి, దానితో పోరాడటానికి అభ్యర్థులకున్న మార్గాలు.

కాగా, ఇప్పటివరకు అమెరికాలో 2,22,000 మంది కరోనా బారినపడి మరణించారు. 8.4 లక్షల మంది కరోనా వైరస్ బారినపడ్డారు. ఇప్పటికీ ప్రతి రోజు సుమారు 50వేల కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

జో బైడెన్ కుమారుడికి రష్యా, చైనాలో వ్యాపారాలు, అందుకే

జో బైడెన్ కుమారుడికి రష్యా, చైనాలో వ్యాపారాలు, అందుకే

ఇటీవల ప్రచురించిన ఈ-మెయిళ్ళపై ట్రంప్ బిడెన్‌పై దాడి చేశారు. వారు చేస్తున్నది రష్యా తప్పుడు సమాచారం ప్రచారంలో భాగమేనా అని, దానిపై ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోంది. జో బైెడెన్ కుమారుడికి రష్యా, చైనాలో అనేక వ్యాపారులున్నాయి. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చైనా, రష్యాలు తలదూర్చే అవకాశం ఉందన్నారు. ఈ దేశాల నుంచి బిడెన్ ఫ్యామిలీ కొన్ని కోట్ల లబ్ధి పొందుతోందని ఆరోపించారు.

కరోనాతో ప్రజల ప్రాణాలు పోతున్నా.. ట్రంప్ మేల్కొలేదు

కరోనాతో ప్రజల ప్రాణాలు పోతున్నా.. ట్రంప్ మేల్కొలేదు

కరోనా మహమ్మారి కారణంగా లక్షలాదిమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినా.. డొనాల్డ్ ట్రంప్ బాధ్యత తీసుకోలేదు.
కరోనాతో సహజీవనం చేయడం నేర్చుకుంటున్నామని ట్రంప్ అంటున్నారు.. ప్రజలేమో కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నారు.
మొదట్నుంచి కరోనా పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ట్రంప్.. ఇప్పుడు ప్రజలకు ప్రమాదకారి అంటూ చెబుతున్నారు.
అయితే, కరోనా నుంచి ప్రజలను రక్షించడానికి ట్రంప్ ఎలాంటి చర్యలు చేపట్టలేదు.

మరికొన్ని వారాల్లోనే కరోనా వ్యాక్యిన్.. నిజమెంత?

మరికొన్ని వారాల్లోనే కరోనా వ్యాక్యిన్.. నిజమెంత?

అమెరికాలో కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాం.
త్వరలోనే కరోనా వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తుంది. దీంతో అమెరికాలో ఇక కరోనా మరణాలు జగరవు.
కరోనాపై నా పోరాటంలో ఎలాంటి మార్పూ ఉండబోదు.
చైనాకు అమెరికా పౌరులను వెళ్లకుండా చూశాం. అలాగే ఇతర దేశాల వారిని అమెరికాకు రాకుండా అడ్డుకున్నాం.
కరోనా వ్యాక్సిన్‌పై ప్రత్యేక దృష్టి సారించాం. మరికొన్ని వారాల్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది.
కాగా, కరోనా వ్యాక్సిన్ అమెరికాలో ఇంకా ట్రయల్స్ దశలోనే ఉండటం గమనార్హం. ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

కరోనా వైరస్ క్రమంగా తగ్గిపోతోంది. నలుమూలాల గమనించి ఈ మాట చెబుతున్నారు ట్రంప్.

కాగా, కరోనావైరస్ ప్రభావం అమెరికాలో పెద్దగా తగ్గలేదు. ఇప్పటికే వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

Recommended Video

US Election 2020 : Joe Bidenకు ఓటమి తప్పదు.. ఆ చెత్తను ఊడ్చిపారేస్తా! - Donald Trump
డిబేట్ ప్రారంభించిన జో బైడెన్.. ట్రంప్‌పై విమర్శల దాడి

డిబేట్ ప్రారంభించిన జో బైడెన్.. ట్రంప్‌పై విమర్శల దాడి

నాష్విల్లెలో గురువారం రాత్రి(మనదేశంలో శుక్రవారం ఉదయం) జరిగిన చివరి చర్చను డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ప్రారంభించారు.
కరోనాను సమర్థంగా ఎదుర్కోవడంలో డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా విఫలమయ్యారు. నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోవడానికి ఈ ఒక్క కారణం చాలు.
అమెరికాలో కరోనా వ్యాప్తి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
అంతేగాక, అమెరికాలో కరోనాతో 2 లక్షలకుపైగా ప్రజలు మరణిస్తే అందుకు బాధ్యత తనది కాదన్నట్లు ట్రంప్ వ్యవహరించారు.
మాస్కులు ధరించాలని ట్రంప్.. ప్రజలకు ఎప్పుడూ సూచించలేదు, కరోనా ర్యాపిడ్ పరీక్షలను పెంచలేదు.
కరోనా నిబంధనలను పాటిస్తూ విద్యాలయాలను తిరిగి ప్రారంభించేందుకు కూడా ట్రంప్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ట్రంప్ చేసిన పొరపాట్లకు అమెరికా ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారు.

English summary
The final 2020 presidential debate between President Trump and Democratic presidential nominee Joe Biden just kicked off in Nashville.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X