వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విస్కాన్సిన్‌లో రీ కౌంటింగ్: ప్రభావం చూపడంతో ట్రంప్ నిర్ణయం.. మరింత ఉత్కంఠ...

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు నరాలు తెగే ఉత్కంఠ రేపుతోంది. క్షణ క్షణం ట్రెండ్ మారుతోంది. ఇప్పటివరకు అయితే బిడెన్ లీడ్‌లో ఉన్నారు. అయితే విస్కాన్సిన్‌లో ఓట్లను రీ కౌంటింగ్ చేయించాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన ప్రచార మేనేజర్ బిల్ స్టీపెన్ తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిలిచిపోయే లోపు రీ కౌంటింగ్ కోరాలని నిర్ణయించుకున్నారని తెలిపారు.

 US election 2020: Donald Trump to seek recount of votes in Wisconsin

విస్కాన్సిన్‌లో రేసులో ఉన్న అభ్యర్థి రీ కౌంటింగ్ కోరవచ్చు. ఇక్కడ ఒక శాతం ఓటింగ్ ఉండటంతో కోరేందుకు అవకాశం ఉంది. ఈ మేరకు అధ్యక్షుడు కోరాలని భావిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ట్రంప్, బిడెన్ మధ్య సమానస్థాయిలో వస్తున్నాయి. దీంతో ఉత్కంఠ నెలకొంది. బిడెన్ 10కి పైగా మెజార్టీ స్థానాలు గెలవగా.. 270 చోట్ల లీడ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది.

బిడెన్ అధిక ఓట్లను సాధించారు. గతంలో ఏ అభ్యర్థి కూడా ఇన్ని స్థానాలను గెలుచుకోలేదు. జో బిడెన్ 2008లో బరాక్ ఒబామా సాధించిన సీట్లను కూడా దాటిపోయాడు. నవంబర్ 4వ తేదీ ఉదయం 8 గంటల వరకు బిడెన్ స్పష్టమైన ఆధిక్యం కనిపించింది.

English summary
President Donald Trumps campaign manager Bill Stepien says the president plans to immediately request a recount in the battleground state of Wisconsin, where the race remains close.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X