వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఊపు మీదున్న బైడెన్... రికార్డు స్థాయిలో విరాళాలు...

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌కు విరాళాలు పోటెత్తుతున్నాయి. రికార్డు స్థాయిలో గత సెప్టెంబర్‌లో బైడెన్‌కు 383 మిలియన్ డాలర్ల విరాళం సమకూరింది. బుధవారం నాటికి ఆయన బ్యాంకు ఖాతాలో 432మిలియన్ డాలర్లు ఉన్నట్లు డెమోక్రాటిక్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. డెమోక్రాటిక్ నేషనల్ కమిటీలు,క్యాంపెయిన్స్ జాయింట్ ఫండ్ రైసింగ్ కమిటీలు సంయుక్తంగా ఈ విరాళాల సేకరణచేపట్టాయి. మరోవైపు సెప్టెంబర్ నెల డొనాల్డ్ ట్రంప్ విరాళాలను ఆ పార్టీ ఇంకా వెల్లడించలేదు.

అమెరికాలో రికార్డు స్థాయిలో ముందస్తు ఓటింగ్... టెన్షన్‌లో ట్రంప్.. ముందంజలో జో బైడెన్...అమెరికాలో రికార్డు స్థాయిలో ముందస్తు ఓటింగ్... టెన్షన్‌లో ట్రంప్.. ముందంజలో జో బైడెన్...

ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశాకే...

ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశాకే...


నిజానికి విరాళాల విషయంలో మొదట్లో ట్రంప్‌ కంటే చాలా వెనుకబడ్డ బైడెన్ ఇప్పుడు అనూహ్యంగా పుంజుకోవడం గమనార్హం. గత అగస్టులో ప్రస్తుత అధ్యక్షుడు,రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు 365మిలియన్ డాలర్ల విరాళాలు సమకూరగా... బైడెన్‌కు 154మిలియన్ డాలర్లు మాత్రమే సమకూరాయి. కానీ సెప్టెంబర్ నెలలో ఆన్‌లైన్ ద్వారా బైడెన్‌కు భారీ విరాళాలు వచ్చాయి. దాదాపు 203మిలియన్ డాలర్ల పైచిలుకు విరాళాలు ఆన్‌లైన్ ద్వారానే సమకూరాయి. అగస్టు నెలలో కమల హ్యారిస్‌ను డెమోక్రాటిక్ పార్టీ తరుపున ఉపాధ్యక్షురాలిగా ప్రకటించాకే బైడెన్‌కు విరాళాలు పెరిగినట్లు చెబుతున్నారు.

ఆ రెండు రోజుల్లో భారీ విరాళాలు...

ఆ రెండు రోజుల్లో భారీ విరాళాలు...


సెప్టెంబర్ చివరిలో ట్రంప్‌తో మొదటి అధ్యక్ష డిబేట్ సందర్భంగా బైడెన్‌కు భారీ విరాళాలు వచ్చాయి. సెప్టెంబర్ 29న ఆ డిబేట్ జరగ్గా... ఆరోజు రాత్రి 9గం. నుంచి అర్ధరాత్రి వరకు దాదాపు 10 మిలియన్ డాలర్లు చేకూరాయి. ఇందులో రాత్రి 9గం. నుంచి రాత్రి 10గం. మధ్యలోనే ఏకంగా 3.8మిలియన్ డాలర్ల విరాళాలు వచ్చాయి. ఒక్క గంటలో ఇంత భారీ విరాళాలు రావడం ఇదే మొదటిసారి అని పరిశీలకులు చెబుతున్నారు. ఆ తర్వాతి రోజు సెప్టెంబర్ 30న కూడా బైడెన్‌కు 21మిలియన్ డాలర్ల విరాళాలు సమకూరాయి. బైడెన్‌ వద్ద ఇప్పుడు చేతి నిండా ఉండటంతో పొలిటికల్ క్యాంపెయిన్స్‌కు,ప్రకటనలకు మరింత ఖర్చు చేసే అవకాశం ఉంది.

Recommended Video

Donald Trump's Telangana Fan Bussa Krishna Lost Life ట్రంప్‌ మీద పిచ్చి ప్రేమతో అభిమాని మృతి
అంతా ప్రైవేట్ మనీయే....

అంతా ప్రైవేట్ మనీయే....

ఈసారి అధ్యక్ష ఎన్నికల ఖర్చు దాదాపు 11 మిలియన్ డాలర్లు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. 2008 అధ్యక్ష ఎన్నికల కంటే ఇది రెట్టింపు కాగా... 2016 అధ్యక్ష ఎన్నికల కంటే 50శాతం అధికం. అయితే ఇంత భారీ మొత్తంలో ఎన్నికల కోసం ఖర్చు చేయడంపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫండ్ రైజింగ్ కార్యక్రమం 1974లో మొదలైంది. కానీ అప్పట్లో చాలా పరిమితులు,తక్కువ మొత్తం మాత్రమే ఖర్చు చేయాలన్న నిబంధనలు ఉండేవి. దాదాపు రెండు దశాబ్దాల పాటు అమెరికా అధ్యక్ష ఎన్నికల క్యాంపెయిన్స్‌లో ఇది కీలక పాత్ర పోషించింది. కానీ ఆ తర్వాత సీన్ మారిపోయింది. ప్రజల నుంచి సేకరించే విరాళాల కంటే సంపన్నులు,బడా కంపెనీలు ఇచ్చే విరాళాలే ఎక్కువైపోయాయి. ఒక రకంగా ఇప్పుడు ఎన్నికల్లో ధన ప్రవాహమంతా ప్రైవేట్ మనీయే. ఇలా ఎన్నికలను ప్రైవేట్ సంస్థలు భారీ విరాళాలతో ప్రభావం చేయడం ఫెడరల్ వ్యవస్థకు మంచిది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

English summary
Joe Biden announced Wednesday evening that his campaign and affiliated committees raised $383 million in September, breaking a record he had just set the prior month as his campaign continues to ride a surge of online donations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X