వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్లోరిడాలో ట్రంప్‌కు ఎదురుదెబ్బ... ముందంజలో జో బైడెన్... లేటెస్ట్ సర్వే...

|
Google Oneindia TeluguNews

అమెరికా ఎన్నికల్లో కీలకంగా భావిస్తున్న రాష్ట్రాల్లో ఒకటైన ఫ్లోరిడాలో జో బైడెన్‌ ట్రంప్‌ కంటే కాస్త ముందంజలో ఉన్నట్లు ఎన్‌బీసీ న్యూస్/మార్సిస్ట్ సర్వే వెల్లడించింది. డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌కు ఫ్లోరిడాలో 51శాతం మంది ఓటర్ల మద్దతు ఉందని,ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు,రిపబ్లిక్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు 47శాతం ఓటర్ల మద్దతు ఉన్నట్లు తెలిపింది. మరో రెండు శాతం మంది మూడో అభ్యర్థికి ఓటు వేయాలనే ఆలోచనలో.. లేదా ఇంకా ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉన్నట్లు వెల్లడించింది.

ఈ సర్వే ప్రకారం... 65ఏళ్లు పైబడ్డ సీనియర్ సిటిజన్లతో పాటు,ఇండిపెండెంట్లు బైడెన్‌‌కు మద్దతుగా ఉన్నట్లు వెల్లడైంది. ఈ రెండు గ్రూప్స్ గత 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు ఓటేయడం గమనార్హం. అయితే అప్పటి అధ్యక్ష ఎన్నికల్లో ఫ్లోరిడాలో కేవలం ఒక్క శాతం ఆధిక్యతతో అప్పటి డెమోక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై ట్రంప్ విజయం సాధించారు. కానీ ఈసారి మాత్రం ట్రంప్ బైడెన్ కంటే వెనుకబడుతున్నారు.అంతకుముందు సెప్టెంబర్‌లో నిర్వహించిన సర్వేలో బైడెన్-ట్రంప్‌లకు ఫ్లోరిడాలో చెరో 48శాతం మంది ఓటర్ల మద్దతు ఉన్నట్లు వెల్లడైన సంగతి తెలిసిందే.

us election 2020 joe Biden notches narrow lead on donald trump in Florida

అటు జార్జియా,టెక్సాస్ వంటి రిపబ్లికన్ పార్టీ కంచుకోటల్లోనూ బైడెన్‌కు మద్దతుగా పెరుగుతున్నట్లుగా సర్వేలు చెప్తున్నాయి. అయితే గత అధ్యక్ష ఎన్నికల్లో సర్వేలు తారుమారైన సంగతి కూడా గుర్తుంచుకోవాలన్న వాదన వినిపిస్తోంది. అప్పటి ఎన్నికల్లో దాదాపుగా అన్ని సర్వేలు డెమోక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ గెలవబోతున్నట్లు అంచనా వేయగా... ఫలితాలు మాత్రం ట్రంప్‌కు అనుకూలంగా వచ్చాయి. దీంతో ఈసారి ఎన్నికల సర్వేలు నిజమవుతాయా కాదా అన్న చర్చ జరుగుతోంది.

Recommended Video

US Elections 2020 : Telugu Appears on Ballot Boxes | Voter Ballot Papers In Telugu | Oneindia Telugu

కాగా,నవంబర్ 3న అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఓటర్లు ముందస్తు ఓటింగ్‌ను ఉపయోగించుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో పోలింగ్ రోజున భారీ క్యూ లైన్లలో నిలబడి ఓటు వేయడం కంటే... ఇప్పుడే ఓటు వేయడం బెటర్ అని అక్కడి ఓటర్లు భావిస్తున్నారు. కొంతమంది ఈమెయిల్ ద్వారా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

English summary
Biden leads President Donald Trump by single digits in Florida, according to a new poll, earning the support of more than half of likely voters surveyed in the nation’s largest swing state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X