వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌ ఓ జాత్యహంకారి- ఒబామాపై వ్యాఖ్యలే నిదర్శనం- నిప్పులు చెరిగిన కమలా హ్యారిస్‌..

|
Google Oneindia TeluguNews

అమెరికా ఎన్నికల పోలింగ్‌ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ మాటల తూటాలు పేలుతున్నాయి. చివరి నిమిషంలో డెమోక్రాట్లకు మద్దతుగా రంగంలోకి దిగిన మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాను లక్ష్యంగా చేసుకుని రిపబ్లికన్లు ఇప్పుడు విమర్శలకు దిగుతున్నారు. దీనికి డెమోక్రాట్‌ అభ్యర్ధులు కూడా అంతే దీటుగా బదులిస్తున్నారు. దీంతో అమెరికా ఎన్నికల రణరంగం ఆసక్తికరంగా మారిపోయింది.

అమెరికా ఆమోదించిన తొలి యాంటీవైరల్ డ్రగ్ 'రెమిడెసివిర్’: సత్ఫలితాలే కారణం!అమెరికా ఆమోదించిన తొలి యాంటీవైరల్ డ్రగ్ 'రెమిడెసివిర్’: సత్ఫలితాలే కారణం!

అమెరికా ఎన్నికల ప్రచారంలో డెమోక్రాట్‌ అభ్యర్ధులు జో బిడెన్‌, కమలా హ్యారిస్‌కు మద్దతుగా మాజీ అద్యక్షుడు బరాక్‌ ఒబామా రంగంలోకి దిగారు. ట్రంప్‌ లక్ష్యంగా ఆయన విమర్శలు ఎక్కుపెడుతున్నారు. విధానపరంగానే ఆయన విమర్శలు సాగుతున్నాయి. అయితే వీటిని జీర్ణించుకోలేని ట్రంప్‌ ఆయనకు తనపై విమర్శలు చేసే చట్టబద్ధత ఎక్కడుందని కౌంటర్లు మొదలుపెట్టారు. వీటిపై స్పందించిన డెమోక్రాట్‌ ఉపాధ్యక్ష అభ్యర్ధి కమలా హ్యారిస్‌ ట్రంప్‌ను ఓ జాత్యహంకారిగా అభివర్ణించారు. ఒబామా చట్టబద్ధతను ప్రశ్నిస్తున్న ఆయన వ్యాఖ్యలు ఇందుకో నమూనాగా ఆమె పేర్కొన్నారు.

US Election 2020 : Kamala Harris calls President Trump a ‘racist’

Recommended Video

US Election 2020 : Truump పై Kamala Harris ఉగ్రరూపం.. Mike Pence పై ఆధిపత్యం! || Oneindia Telugu

జనం నన్ను ట్రంప్ జాత్యహంకారా అని అడుగుతున్నారు. ఇప్పుడు చెబుతున్నాను ఆయన కచ్చితంగా జాత్యహంకారే అని కమల చెప్పినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడించింది. ఇదేదో యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు. ఉద్దేశపూర్వకమే అని కమల చెప్పారు. గతంలో ట్రంప్‌ ప్రచారంలో మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో ఇరువైపులా మంచి వ్యకులే ఉన్నారని చెప్పారు. కానీ ఒబామా ఎంట్రీతో ఆయనపై విమర్శలకు దిగుతున్నారని కమల పేర్కొన్నారు. అమెరికా చరిత్ర, వర్తమాన పరిస్ధితులు, జాతులపై గౌరవం ఉన్న వారినే ఈసారి ఎన్నుకోవాలని ఓటర్లను కమలా హ్యారిస్ అభ్యర్ధించారు.

English summary
Democratic Vice Presidential nominee Kamala Harris called Donald Trump a “racist” and said his racism is a “pattern”, as she cited the President questioning the legitimacy of his predecessor Barack Obama.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X