వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

us election 2020: అధ్యక్ష డిబేట్లోనూ భారత్‌పై డొనాల్డ్ ట్రంప్ అక్కసు, ‘మురికి’ అంటూ!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కారు. దీనికి అమెరికా అధ్యక్ష ఎన్నికల చివరి డిబేట్‌ను కూడా ఉపయోగించుకోవడం గమనార్హం. గురువారం రాత్రి మూడోదైన చివర అమెరికా అధ్యక్ష ఎన్నికల డిబేట్ జరిగింది. దీనిలో డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ పాల్గొన్నారు.

us election 2020: చివరి డిబేట్లో కీలక అంశాలపై డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ us election 2020: చివరి డిబేట్లో కీలక అంశాలపై డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్

మురికి అంటూ భారత్‌పై డొనాల్డ్ ట్రంప్ అక్కసు

మురికి అంటూ భారత్‌పై డొనాల్డ్ ట్రంప్ అక్కసు

ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ‘చైనాను చూడండి, ఇది ఎంత మురికిగా ఉంది. రష్యా వైపు చూడండి. భారతదేశం వైపు చూడండి. కాలుష్యం బారినపడి గాలి మురికిగా ఉంది. మేము ట్రిలియన్ డాలర్లను తీసుకోవలసి రావడంతో నేను పారిస్ ఒప్పందం నుండి బయటపడ్డాను. మా పట్ల చాలా అన్యాయంగా ప్రవర్తించారు' అని చెప్పారు.

అమెరికన్ల ఉద్యోగాలు పోకుండానే..

అమెరికన్ల ఉద్యోగాలు పోకుండానే..

‘పారిస్ ఒప్పందం కారణంగా నేను లక్షలాది ఉద్యోగాలను, వేలాది కంపెనీలను త్యాగం చేయను. ఇది చాలా అన్యాయం' అని టెలివిజన్ చర్చలో ఆయన అన్నారు, కాగా, ఈ డిబేట్ సందర్భంగా భద్రతా ప్రమాదాల కారణంగా ఇద్దరు అభ్యర్థులు కరచాలనం చేయకుండా ఉన్నారు. పారిస్ వాతావరణ ఒప్పందం నుండి వైదొలగడం గురించి గత ఏడాది అమెరికా అధికారికంగా యుఎన్‌కు తెలియజేసింది, దీనిలో అధ్యక్షుడు ట్రంప్ ముందున్న బరాక్ ఒబామా కీలక పాత్ర పోషించడం గమనార్హం.

ఇంతకుముందు కూడా భారత్‌పై ట్రంప్..

ఇంతకుముందు కూడా భారత్‌పై ట్రంప్..

అమెరికా-భారత భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించే చర్చల కోసం విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీ, రక్షణ కార్యదర్శి మార్క్ ఎస్పెర్ న్యూ ఢిల్లీ పర్యటనకు వస్తున్న కొద్ది రోజుల ముందు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మొదటి అధ్యక్ష చర్చలో కూడా ట్రంప్.. భారతదేశంపై విమర్శనాత్మకంగా మాట్లాడారు, కరోనా మరణాలు, కేసుల విషయంలో భారత్ లాంటి దేశాలు సరైన సమాచారాన్ని చూపడం లేదని ఆరోపించారు.

Recommended Video

US Election 2020 : Donald Trump vs Joe Biden, ప్రెసిడెంట్ పోల్స్‌లో ముందువరసలో ఉన్నది ఆయనే!
మురికిలో రెండో స్థానంలో అమెరికా, తొలిస్థానంలో చైనా

మురికిలో రెండో స్థానంలో అమెరికా, తొలిస్థానంలో చైనా


2018 డిసెంబర్‌లో ప్రచురించిన గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ ప్రొజెక్షన్ ప్రకారం.. ప్రపంచ కార్బన్ డయాక్సైడ్ విడుదల చేసే దేశాలలో నాలుగో స్థానంలో భారత్ ఉంది, 2017 లో ప్రపంచ ఉద్గారాలలో 7 శాతం వాటా ఉంది, అయితే, ప్రపంచంలో 58శాతం ఉద్గారాలను విడుదల చేసేవి నాలుగు దేశాలే. అందులో 27 శాతంతో చైనా తొలిస్థానంలో ఉండగా, 15 శాతంతో అమెరికా రెండో స్థానంలో ఉంది. 10 శాతంతో యూరోపియన్ యూనియన్ ఉండగా, 7 శాతంతో భారత్ నాలుగో స్థానంలో ఉంది.

English summary
us election 2020: "Look At china, India, The Air Is Filthy", says donald Trump At final Debate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X