వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

US election 2020: న్యూయార్క్ లో హైఅలర్ట్, ఎవడిగోళవాడిది, చీటీ చినిగిపోకుండా ముందు జాగ్రత్తలు !

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్/ న్యూయార్క్: అమెరికా 46వ అధ్యక్షుడు ఎవరు ? అనే విషయంపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువుడుతున్న సందర్బంగా న్యూయార్క్ నగరంలో కొన్ని లక్షల మంది గుమికూడే అవకాశం ఉండటంతో ఆ సిటీ అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ముందు జాగ్రత్తగా న్యూయార్క్ లోని భారీ షాపింగ్ మాల్స్, లగ్జరీ కార్యాలయాలకు వాటి యజామనులు స్వచ్చందంగా బందోబస్తు ఏర్పాటు చేసుకుంటున్నారు. అమెరికా ఎన్నికల ఫలితాలు ఆలస్యం అయితే నిరసనలు వ్యక్తం అయ్యే అవకాశం ఉండటం, ఎవడిగోళవాడిదే అనే సీన్ ఎదురైతుందనే భయంతో వాళ్ల చీటీలు చినిగిపోకుండా ఎవరి జాగ్రత్తలో వారు ఉంటున్ననారు. ఆ దెబ్బతో న్యూయార్క్ మేయర్ తోపాటు ఆ నగర పోలీసులు రంగంలోకి దిగారు.

US election 2020: జయహో కమలా హ్యారీస్, తమిళనాడులో కులదైవానికి పూజలు, హోమాలు, విక్టరీ!US election 2020: జయహో కమలా హ్యారీస్, తమిళనాడులో కులదైవానికి పూజలు, హోమాలు, విక్టరీ!

ఒక్కమాటతో కలకలం

ఒక్కమాటతో కలకలం

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది ? అంటూ వార్తలు ప్రసారం అవుతున్న సందర్బంగా అమెరికాలోని అనేక రాష్ట్రాల్లోని ప్రజల్లో ఉత్కంఠ నెలకొనింది. ఎన్నికల ఫలితాలు ఆలస్యం అయితే గొడవలు, అల్లర్లు జరిగే అవకాశం ఉందని వెలుగు చూడటంతో అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో పోలీసు అధికారులు అలర్ట్ అయ్యారు.

న్యూయార్క్ లో హై అలర్ట్

న్యూయార్క్ లో హై అలర్ట్

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువుడుతున్న సందర్బంగా న్యూయార్క్ సిటీలో ఉత్కంఠ వాతావరణం నెలకొనింది. న్యూయార్క్ లోని మన్ హటన్ స్ట్రీట్ తో పాటు ఆ నగరం మొత్తం ఇప్పుడు అప్రమత్తం అయ్యింది. ముందు జాగ్రత్త చర్యగా న్యూయార్క్ సిటీ పోలీసు అధికారులు రంగంలోకి దిగి 24 గంటలు ప్రతి వీధివీధి తిరుగుతూ మీరు ధైర్యంగా ఉండాలని ప్రజలకు మనవి చేస్తున్నారు.

చీటి చినిగిపోకూడదని ముందుజాగ్రత్త

చీటి చినిగిపోకూడదని ముందుజాగ్రత్త

న్యూయార్క్ సిటీలో లగ్జరీ కార్యాలయాలతో పాటు భారీ సంఖ్యలు పెద్దపెద్ద మాల్స్ ఉన్నాయి. లగ్జరీ కార్యాలయాలు, మాల్స్ యాజమాన్యం ఇప్పుడు సొంతంగా వారివారి ఖర్చులతో వారి అద్దాల మేడలు నాశనం కాకుండా వారి భవనాలకు చెక్కలతో రక్షణ కవచాలు ఏర్పాటు చేసుకుంటూ భద్రతా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలు ఆలస్యం అయితే ఆందోళనకారుల దెబ్బకు మా అద్దాల మేడలు ద్వంసం కాకుండా ఉండాలంటే, మా చీటీలు చినిగిపోకుండా ఉండాలంటే ఈ ఏర్పాట్లు తప్పవని వాటి యజమానులు అంటున్నారు.

మంచిదే కానివ్వండి: మేయర్ కూల్ స్టేట్ మెంట్

మంచిదే కానివ్వండి: మేయర్ కూల్ స్టేట్ మెంట్

అమెరికా ప్రజలు జార్జ్ ఫ్లాయిడ్ ఘటన ఇంకా మరిచిపోవడంలేదు. జార్జ్ ఫ్లాయిడ్ ఘటన అనంతరం న్యూయార్క్ సిటీలో ఏం జరిగిందో అనే విషయాన్ని స్థానిక ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఆలస్యం అవుతాయని ప్రచారం జరుగుతున్న సందర్బంగా న్యూయార్క్ సిటీ మేయర్ బిల్ డే బ్లూసియా స్థానిక పోలీసు అధికారులతో అత్యవసరంగా సమావేశమై చర్చించారు. లగ్జరీ కార్యాలయాలు, మాల్స్ యాజమాన్యం ఇప్పుడు సొంతంగా వారివారి ఖర్చులతో వారి అద్దాల మేడలు నాశనం కాకుండా వారి భవనాలకు చెక్కలతో రక్షణ కవచాలు ఏర్పాటు చేసుకుంటూ భద్రతా ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలిసిందని, ఇది మంచి పరిణామం, కానివ్వండి అంటూ సిటీ మేయర్ బిల్ డే బ్లూసియా కూల్ గా సమాధానం ఇచ్చారు.

ఎవరు చెప్పారు అంటూనే హై అలర్ట్

ఎవరు చెప్పారు అంటూనే హై అలర్ట్

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఆలస్యం అయితే గొడవలు జరుగుతాయి అనే తమకు ఇంత వరకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదని న్యూయార్క్ సిటీ మేయర్ బిల్ డే బ్లూసియా స్థానిక మీడియాకు చెప్పారు. అయితే ముందుజాగ్రత్త చర్యగా న్యూయార్క్ సిటీ మొత్తం హైఅలర్ట్ ప్రకటించామని, పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు అన్ని వివరాలు తెలుసుకుని అల్లర్లు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారని సిటీ మేయర్ బిల్ డే బ్లూసియా మీడియాకు చెప్పారు.

English summary
US election 2020: The windows of Saks Fifth Avenue and the iconic Macy’s in Herald Square, which have wowed tourists for decades, were boarded up on Monday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X