వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్-బిడెన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో లీడ్ ఎవరూ..? పోల్స్ ఏం చెబుతున్నాయ్..?

|
Google Oneindia TeluguNews

మరికొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ హోరా హోరీగా ప్రచారం చేస్తున్నారు. టీవీ డిబెట్ కూడా హాట్ హాట్‌గా కొనసాగుతోంది. అయితే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష బరిలో ఎవరూ ముందు వరసలో ఉన్నారు..? ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయో.. ఓ లుక్కేద్దాం.. పదండి.

Recommended Video

US Election 2020 : Donald Trump vs Joe Biden, ప్రెసిడెంట్ పోల్స్‌లో ముందువరసలో ఉన్నది ఆయనే!
బిడెన్ లీడ్.. కానీ

బిడెన్ లీడ్.. కానీ

జో బిడెన్ 1970 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. బరాక్ ఒబామా నేతృత్వంలో ఉపాధ్యక్షుడిగా వెలుగులోకి వచ్చారు. అయితే నాలుగేళ్లలో ట్రంప్ ప్రభుత్వం ఏమీ చేయలేదు అని.. కరోనా వైరస్ నియంత్రణ, వ్యాక్సిన్, ఆర్థిక మాంద్యం తదితర అంశాలపై ఫోకస్ చేశారు. అయితే ప్రెసిడెంట్ పోల్స్‌లో బిడెన్ ముందువరసలో ఉన్నారు. బిడెన్ 52 శాతం ఓట్లతో ఉండగా.. ట్రంప్ 42 శాతం ఓట్లతో ఉన్నారు. అయితే ఇదీ ఎన్నికల సమయం వరకు మారొచ్చని.. గతంలో హిల్లరీ క్లింటన్‌కు జరిగిందీ ఇదేనని కూడా నిపుణులు సూచిస్తున్నారు.

ఎక్కువ ఓట్లు వచ్చినా..

ఎక్కువ ఓట్లు వచ్చినా..

2016లో హిల్లరీ క్లింటన్‌కు ట్రంప్ కన్నా 3 మిలియన్ ఓట్లు ఎక్కువగా వచ్చాయి. కానీ అమెరికాలో గల ఎలక్టోరల్ కాలేజ్ సిస్టమ్‌ వల్ల ట్రంప్ విజయం సాధించారు. ఈ సారి కూడా అలా జరిగితే మరోసారి ట్రంప్ విజయం సాధించే అవకాశం ఉంది. కానీ విశ్లేషకులు మాత్రం ట్రంప్, బిడేన్‌లలో ఎవరూ విజయం సాధిస్తారనే అంశంపై కరెక్టుగా అంచనా వేయలేకపోతున్నారు.

ఇక్కడ లీడ్

ఇక్కడ లీడ్

మిచిగాన్, పెన్సిల్వానియా, విస్‌కోన్సిన్ రాష్ట్రాల్లో బిడెన్ లీడ్‌లో ఉన్నారు. ఇక్కడ ట్రంప్ 1 శాతం ఓట్ల తేడాతో ఉన్నారు. 2016లో మాత్రం లోవా, ఓహియో, టెక్సాస్‌లో 8 నుంచి 10 శాతం ఓట్లతో ముందువరసలో ఉన్నారు. అయితే ఈ సారి మాత్రం ట్రంప్, బిడేన్ మధ్య హోరా హోరీ పోరు కొనసాగుతోంది. అయితే ఎవరిదీ పై చేయి అంటే నవంబర్ 3 వరకు ఆగాల్సిందే.

English summary
Voters in America will decide on 3 November whether Donald Trump remains in the White House for another four years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X