వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలింగ్ ముంగిట్లో ట్రంప్‌కు షాక్: కరోనా పుట్టుకలో: క్రిమినల్: విదేశీ నటులతో: ఇష్టానుసారంగా

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ ట్రంప్‌నకు పోలింగ్ ముగింట్లో హైఓల్టేజ్ షాక్ తగిలింది. ఆయనకు సంబంధించిన ఎన్నికల ప్రచార అధికారిక వెబ్‌సైట్‌ను హ్యాకర్లు హ్యాక్ చేశారు. దాన్ని బ్లాక్ చేశారు. ఆ వెబ్‌సైట్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అందులో డొనాల్డ్ ట్రంప్‌పై ఇష్టానుసారంగా దుష్ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, ర్యాలీలు, ఫొటోలు, వీడియోలు, డిబేట్లకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచిన వెబ్‌సైట్ అది.

తొలుత గుర్తించిన ట్విట్టరెట్టీ..

తొలుత గుర్తించిన ట్విట్టరెట్టీ..

అమెరికా ప్రభుత్వం తీసుకున్న కొన్ని విధానపరమైన నిర్ణయాలనూ అందులో అందుబాటులో ఉంటాయి. దాన్ని హ్యాక్ చేసి.. ట్రంప్‌ను క్రిమినల్ పేర్కొంటూ వ్యాఖ్యలు పొందుపరచడం రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులను నివ్వెరపరుస్తోంది. గాబ్రియెల్ లొరెన్జో గ్రెష్లర్ అనే ఓ ట్విట్టరెట్.. దాన్ని తొలుత గుర్తించారు. వెబ్‌సైట్ స్క్రీన్‌షాట్‌ను తీసి తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. వాతావరణ మార్పులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి తాను ఈ వెబ్‌సైట్‌ను సందర్శించానని, అందులో ఉన్న సమాచారం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.

సైట్ సీజ్..

సైట్ సీజ్..

ది సైట్ వాజ్ సీజ్డ్ అనే అక్షరాలు తనకు కనిపించాయని, దానికింద పొందుపరిచిన వివరాలను డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఉన్నాయని గాబ్రియెల్ పేర్కొన్నారు. దీనితో ఆ వెబ్‌సైట్ హ్యాక్‌కు గురైందనే నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ క్యాంపెయిన్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసినట్లు హ్యాకర్లు ప్రకటించారు. కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తి చెందడంలో డొనాల్డ్ ట్రంప్‌కు ప్రమేయం ఉందని హ్యాకర్లు ఇందులో రాశారు. దానికి తగిన సాక్ష్యాధారాలు తమవద్ద ఉన్నాయని చెప్పారు.

 క్రిమినల్ ఇన్‌వాల్వ్‌మెంట్..

క్రిమినల్ ఇన్‌వాల్వ్‌మెంట్..

కీలకమైన, సున్నిత అంశాలు ఈ వెబ్‌సైట్ ద్వారా ట్రంప్ కుటుంబ సభ్యులకు చేరుతున్నాయని, అధ్యక్ష పదవికి ట్రంప్ ఏ మాత్రం తగని వ్యక్తి అని విమర్శించారు. ఆయనకు అనేక నేరాలతో ప్రమేయం ఉందని ఆరోపించారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో ట్రంప్.. విదేశీ నటులతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులు దాన్ని ఆఫ్‌లైన్‌లో ఉంచారు. సుమారు 30 నిమిషాల పాటు ఈ వెబ్‌సైట్‌ను ఆఫ్‌లైన్‌లో ఉంచారు. అనంతరం దాన్ని పునరుద్ధరించారు.

Recommended Video

US Election 2020 : ట్రంప్ vs బిడెన్.. ఆ స్టేట్ లో ఎవరు గెలుస్తారో వారిదే అధ్యక్ష పదవి! || Oneindia
హ్యాక్ విషయాన్ని నిర్ధారించిన అధికారులు..

హ్యాక్ విషయాన్ని నిర్ధారించిన అధికారులు..

ఈ వెబ్‌సైట్ హ్యాక్‌కు గురైందనే విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార విభాగం అధికార ప్రతినిధి టిమ్ ముర్టా నిర్ధారించారు. వెబ్‌సైట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారని, అందులో తప్పుడు సమాచారాన్ని పబ్లిష్ చేశారని అన్నారు. ఎక్కరు? ఎక్కడి నుంచి హ్యాక్ చేశారనే విషయాన్ని ట్రాక్ చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడి నుంచి హ్యాకర్లు వెబ్‌సైట్‌పై దాడి చేశారనే విషయాన్ని తెలుసుకుంటున్నామని అన్నారు. ఇందులో పొందుపరిచిన కీలకమైన డేటా ఏదీ హ్యాక్‌కు గురి కాలేదని చెప్పారు. క్రిప్టోకరెన్సీ స్కామర్స్ ఈ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

English summary
US President Donald Trump’s campaign website on Tuesday was hacked by cryptocurrency scammers. The website was defaced by the hackers and the defacement lasted for almost 30 minutes. The website was first spotted by Twitter user Gabriel Lorenzo Greschler.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X