వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ ఓడినా చరిత్రే: అత్యధిక రేటింగ్ -28ఏళ్ల తర్వాత ఆయనే -అమెరికాను వీడిపోతారా?

|
Google Oneindia TeluguNews

డొనాల్డ్ ట్రంప్... ఆ పేరే ఓ సునామి.. వర్తమాన ప్రపంచ రాజకీయాల్లో ఆయనంతటి విలక్షణ నేత మరొకరు లేరు.. తెగేదాకా లాగడం.. ప్రత్యర్థిని బలంగా ఢీకొట్టడంలో మెనగాడిగా పేరుపొందిన ఆయన.. ఎన్నికలకు ఒక రోజు ముందు కూడా 'అమెరికా ఆర్థిక వ్యవస్థను కాపాడిన ధీరుడిగా, రాబోయే రోజుల్లోనూ దేశాన్ని నడిపించగల సమర్థ నేత'గా ప్రజల చేత అత్యధిక రేటింగ్ పొందారు. కానీ తలచినదే జరిగే దైవం ఎందులకనే తరహాలో ఫలితాల్లో మాత్రం ప్రతికూలత ఎదుర్కోవాల్సి వచ్చింది. కాగా..

ట్రంప్ పతనం: ఫాక్స్ న్యూస్ వైచిత్రి -నాడు ఆజ్యం పోసినవాళ్లే.. నేడు బైడెన్‌కు జైకొడుతూ..ట్రంప్ పతనం: ఫాక్స్ న్యూస్ వైచిత్రి -నాడు ఆజ్యం పోసినవాళ్లే.. నేడు బైడెన్‌కు జైకొడుతూ..

దేశం వదిలి వెళతారా?

దేశం వదిలి వెళతారా?

డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ 46వ అమెరికా అధ్యక్షుడు కావడం దాదాపు ఖరారైపోగా.. భారీ రేటింగ్ పొంది కూడా మ్యాజిక్ ఫిగర్ ను చేరలేక రిపబ్లికన్ అభ్యర్థి, ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చతికిలపడ్డారు. అధికారికంగా ఖరారు కావాల్సిన ఓటమిలోనూ ట్రంప్ తనదైన చరిత్రను లిఖించబోతున్నారు. అంతేకాదు, ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చెప్పినట్లుగా.. ‘‘ఈ సారి నేను ఓడితే అమెరికాను వీడతానేమో'అనే మాటను ఆయన నిజం చేస్తారనే వదంతులు కూడా వ్యాపిస్తున్నాయి. దీనిపై ట్రంప్ క్యాంప్ స్పందించలేదు.

నరాలు తెగే ఉత్కంఠ..

నరాలు తెగే ఉత్కంఠ..

అత్యంత ఖరీదైనవిగానే కాదు, ఫలితాల పరంగా తీవ్రవైన ఉత్కంఠ రేపినవిగానూ 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలు నిలిచాయి. బుధవారం కోడి కూయకముందే వెలువడాల్సిన ఫలితాలు కాస్తా గంటలు.. రోజులు గడుస్తున్నా తుది అంకానికి చేరలేదు. ఈసారి సగానికిపైగా ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటేసి ఉండటం, ఆరాష్ట్రాల చట్టాల ప్రకారం మంగళవారం రాత్రి నుంచే పోస్టల్ బ్యాలెట్లనూ లెక్కించనారంభించడం, సంతకాలు, ఐడీలు సరిగ్గా చూస్తుండటంతో కౌంటింగ్ నిదానంగా సాగుతోంది. తుది ఫలితాలు వెల్లడయ్యేనాటికి 538 ఎలక్టోరల్ ఓట్లకుగానూ మ్యాజిక్ ఫిగర్ 270కాగా, బైడెన్ 264 ఓట్లు, ట్రంప్ 214ఓట్లు సాధించారు. అధికారికంగా ఖరారుకావాల్సిన ఓటమిలోనూ ట్రంప్ రికార్డు నెలకొల్పారిలా..

28 ఏళ్ల తర్వాత ఆయనే..

28 ఏళ్ల తర్వాత ఆయనే..

గడిచిన మూడు దశాబ్దాల అమెరికా రాజకీయ చరిత్రలో.. అంటే 1992 తర్వాత.. రెండోసారి గెలువని తొలి అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్‌ చరిత్రకెక్కనున్నారు. 1992 లో రిపబ్లికన్ ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యూ బుష్ రెండోసారి గెలవలేక.. డెమోక్రాట్ బిల్ క్లింటన్ చేతిలో పరాజయంపాలయ్యారు. జార్జ్ బుష్ తర్వాత బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్ (జూనియర్), బరాక్ ఒబామాలు రీఎలక్ట్ అయి సత్తా చాటుకున్నారు. మళ్లీ 28 ఏళ్ల తర్వాత రెండో ఎన్నికలోనే ఇంటి ముఖం పట్టబోతున్న అధ్యక్షుడిగా ట్రంప్ రికార్డులకెక్కబోతున్నారు. అంతేకాదు..

100 ఏళ్లలో ఐదే వ్యక్తి ట్రంప్..

100 ఏళ్లలో ఐదే వ్యక్తి ట్రంప్..

అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో.. గత 100 ఏళ్లలో నలుగురు అధ్యక్షులు మాత్రమే రెండోసారి ఎన్నికలలో పరాజం పొందారు. 1932లో రిపబ్లికన్ హెర్బర్ట్ హూవర్‌ను డెమోక్రాటిక్ ఫ్రాంక్లిన్ డీ రూజ్‌వెల్ట్ ఓడించారు. ఈ ఎన్నికలు గ్రేట్ డిప్రెషన్(మహా మాంద్యం) నేపథ్యంలో జరగడంతో రూజ్ వెల్ట్ ఘనవిజయం సాధించారు. ఇక 1976 లో రిపబ్లికన్ ప్రెసిడెంట్ జెరాల్డ్ ఫోర్డ్.. డెమోక్రాట్ జిమ్మీ కార్టర్ చేతిలో ఓడిపోయాడు. వాటర్‌గేట్ కుంభకోణం తరువాత 1974 లో అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ రాజీనామా చేసినప్పుడు, వైస్ ప్రెసిడెంట్ ఫోర్డ్‌ను అధ్యక్షుడిగా నియమించారు. ఆ విధంగా ఫోర్డ్‌.. ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకోని ఏకైక అధ్యక్షుడయ్యాడు. 1980లో డెమోక్రాట్ అభ్యర్థి జిమ్మీ కార్టర్ రీఎలక్షన్ కోసం నిలబడగా రిపబ్లికన్ రోనాల్డ్ రీగన్ చేతిలో ఓడిపోయారు. ఇక 1992లో రీఎలక్షన్ కోసం నిలబడ్డ రిపబ్లికన్ జార్జ్ బుష్.. డెమోక్రాట్ బిల్ క్లింటన్ చేతిలో చిత్తుగా ఓడిపోయారు. 2020లో ట్రంప్ ఓడితే 100 ఏళ్లలో రెండోసారి ఎన్నికల్లో ఓడిన ఐదో ప్రెసిడెంట్ అవుతారు.

నిమ్మగడ్డ రహస్యభేటీ లీకైందిలా -హరీశ్ సాల్వే ఉచిత వాదన -కొత్త దేవుడిలా జగన్: ఎంపీ రఘురామనిమ్మగడ్డ రహస్యభేటీ లీకైందిలా -హరీశ్ సాల్వే ఉచిత వాదన -కొత్త దేవుడిలా జగన్: ఎంపీ రఘురామ

English summary
If incumbent US President Donald Trump fails to win the re-election, he will not be the first incumbent president in history to have fallen from grace but will be the first in last three decades. If President Trump fails to win reelection, he would become the first incumbent president in modern history to lose despite high ratings from voters on the U.S. economy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X