• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తను కాదంటే కచ్చితంగా కలిసొస్తది - ఒబామా ఎంట్రీపై ట్రంప్ హ్యాపీ - బైడెన్‌పై చిందులు

|

''పాపం నిరాశవాది జోబైడెన్ తరఫున మాజీ ప్రెసిడెంట్ బారాక్ హుస్సేస్ ఒబామా ఎన్నికల ప్రచారం చేస్తున్నాడట. ఆహా.. ఇది మనకెంతో శుభవార్త. ఎలాగంటారా.. 2016 ఎన్నికల్లో నేను పోటీకే నిలబడబోనని ఒబామా అన్నాడు.. కానీ నేను నిలబడ్డాను. నాకు నామినేషన్ దక్కదని ఆయనే చెప్పాడు.. కానీ నాకే దక్కింది. నేను ప్రెసిడెంట్ గా గెలవలేనని ఇదే ఒబామా చెప్పాడు.. కానీ నేను గెలిచాను. తద్వారా ఆయన కాదన్న ప్రతిదీ మనకు కలిసొస్తుందన్నమాట'' అని ప్రెసిడెంట్ ట్రంప్ తన మద్దతుదారులతో సంతోషం పంచుకున్నారు.

కరోనా వ్యాక్సిన్‌పై అనూహ్య ప్రకటన -ఓట్లేస్తే ఉచితంగా ఇస్తామన్న బీజేపీ -చావు భయాన్ని అమ్ముతున్నారంటూకరోనా వ్యాక్సిన్‌పై అనూహ్య ప్రకటన -ఓట్లేస్తే ఉచితంగా ఇస్తామన్న బీజేపీ -చావు భయాన్ని అమ్ముతున్నారంటూ

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా పది రోజులే గడువుండటంతో రిపబ్లికన్, డెమోక్రాట్ల ప్రచారం తారాస్థాయికి చేరింది. డమోక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ తరఫున మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా రంగంలోకి దిగారు. ట్రంప్ పరిపాలన లోపభూయీష్టంగా ఉందని, అతను ప్రజల్ని కాపాడలేడని, అధ్యక్ష పదవిని రియాలిటీ షోలా ఫీలయ్యే వ్యక్తి ట్రంప్ అని ఒబామా తిట్టిపోశారు.

us election 2020: Trump says it is good news Obama is campaigning for Biden

తన నాలుగేళ్ల పాలనలో శ్వేతజాతి అహంకారాన్ని ట్రంప్ ఏనాడూ దాచుకోకపోవడం, కొంతకాలంగా నల్ల జాతీయులపై దాడులు పెరిగి, ట్రంప్ సర్కారుకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగడం లాంటి పరిణామాల నేపథ్యంలో ఒబామా ఎంట్రీ గేమ్ ఛేంజర్ అవుతుందని విశ్లేషకులు చెబుతుండగా, ట్రంప్ మాత్రం ఒబామా ఏది చెబితే దానికి రివర్స్ లో జరుగుతుందని, రెండోసారి కూడా తానే గెలుస్తానని అంటున్నారు.

విశాఖలో భారీగా ఉద్యోగాలు పెరిగాయి - జక్కన్న చెక్కాడు - వాళ్లను జగన్ ఈడ్చికొట్టాలి: ఎంపీ రఘురామవిశాఖలో భారీగా ఉద్యోగాలు పెరిగాయి - జక్కన్న చెక్కాడు - వాళ్లను జగన్ ఈడ్చికొట్టాలి: ఎంపీ రఘురామ

అమెరికాలో, అమెరికన్లకు తాను ఆశావాదాన్ని, అవకాశాలను, కొత్త ఆశలను అందిచగలని గురువారం నాటి ఎన్నికల ర్యాలీలో ట్రంప్ చెప్పుకొచ్చారు. అదే డెమోక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ మాత్రం నిరాశావాదం, పేదరికం, వైఫల్యం మాత్రమే అందించగలడి విమర్శించారు. ఈ ఎన్నికలు ట్రంప్ సూపర్ రికవరీ లేదా బైడెన్ మాద్యమం మధ్య పపోటీలాంటిదని ఆయన అభివర్ణించారు. నంబంర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి.

English summary
US President Donald Trump has downplayed the election campaign of his predecessor Barack Obama in support of his Democratic challenger Joe Biden, asserting that people sent him to the White House due to the Obama administration’s failures. “It’s good. There was nobody that campaigned harder for crooked Hillary Clinton than Obama, right?” Trump asked his supporters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X