వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ స్టేట్‌లో గెలిస్తే..గెలిచినట్టే: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అదో సెంటిమెంట్: ట్రంప్ ఫోకస్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల గడువు సమీపిస్తోంది. పట్టుమని పదిరోజుల సమయం కూడా లేదు. వచ్చేనెల 3వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఎక్కువ సమయం లేకపోవడంతో ఎన్నికల ప్రచార సెమినార్లు, ర్యాలీల వేడి పతాక స్థాయికి చేరుకుంది. వరుసగా రెండోసారి అధ్యక్షుడిగా అమెరికా పగ్గాలను అందుకోవాలనే లక్ష్యంతో డొనాల్డ్ ట్రంప్.. ఈ సారి గెలిచి తీరాలనే పట్టుదలతో జొ బిడెన్ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వరుస బెట్టి ర్యాలీలను నిర్వహిస్తున్నారు. ఎలక్షన్ సెమినార్లను ఏర్పాటు చేస్తున్నారు.

Recommended Video

US Election 2020 : ట్రంప్ vs బిడెన్.. ఆ స్టేట్ లో ఎవరు గెలుస్తారో వారిదే అధ్యక్ష పదవి! || Oneindia
ఫ్లోరిడాపై ఫోకస్ ఎందుకు?

ఫ్లోరిడాపై ఫోకస్ ఎందుకు?

రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్.. డెమోక్రాట్ల తరఫున జో బిడెన్ ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆ ఇద్దరి దృష్టీ ప్రస్తుతం ఫ్లోరిడా స్టేట్‌పై నిలిచింది. ఫ్లోరిడాలో మెజారిటీ స్థానాలను గెలిచిన పార్టీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే సెంటిమెంట్ అమెరికాలో ఆ రెండు పార్టీల నేతల్లో వ్యక్తమౌతోంది. అక్కడ విజయం సాధించడమంటూ జరిగితే.. అమెరికా అధ్యక్ష పీఠానికి దగ్గరైనట్టుగానే భావిస్తాయి ఆ రెండు పార్టీలు కూడా. దీనికి కారణాలు లేకపోలేదు.

ఫ్లోరిడాలో నెగ్గకపోతే..

ఫ్లోరిడాలో నెగ్గకపోతే..

ఫ్లోరిడాలో రిపబ్లికన్ పార్టీలు ఓడిపోవడమంటూ జరిగితే.. ఇక అమెరికా అధ్యక్ష పదవి మీద ఆశలు వదిలేసుకోవాల్సి ఉంటుందనేది పోల్‌స్టర్స్ అభిప్రాయం. ప్రత్యేకించి- డొనాల్డ్ ట్రంప్‌‌నకు ఈ స్టేట్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, కీలకంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. అత్యధికంగా ఎలక్టోరల్ ఓట్లు గల కాలిఫోర్నియా, రెండోస్థానంలో నిలిచిన టెక్సాస్ కంటే కూడా ఫ్లోరిడాపైనే ఫోకస్ పెట్టాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఫ్లోరిడా సహా అరిజోనా, మిచిగాన్, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిస్ వంటి రాష్ట్రాలపై రెండు పార్టీలు తమ శక్తియుక్తులను కేంద్రీకరించారు.

2016లో ఫ్లోరిడాలో..

2016లో ఫ్లోరిడాలో..

2016 నాటి ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచినప్పటికీ.. ఫ్లోరిడాలో మెజారిటీని ఆశించిన స్థాయిలో తెచ్చుకోలేకపోయారు. 2.1 శాతం పాపులారిటీని ఆయన కోల్పోయారు. సుమారు 30 లక్షల ఓట్లను రిపబ్లికన్లు ఫ్లోరిడా స్టేట్‌లో కోల్పోవాల్సి వచ్చింది. అయినప్పటికీ.. ఆ స్టేట్‌లో 304 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను సాధించగలిగారు డొనాల్డ్ ట్రంప్. అప్పట్లో కోల్పోయిన 2.1 శాతం ఓట్లను తిరిగి సాధించుకోవాలనే లక్ష్యంతో ట్రంప్ కనిపిస్తున్నారని పోల్‌స్టర్స్ చెబుతున్నారు. హిల్లరీ క్లింటన్ ఓడిపోవడానికి ఈ స్టేట్ కీలక పాత్ర పోషించిందనే అభిప్రాయాలు ఉన్నాయి.

క్యూబన్ల ఓట్లు అధికంగా

క్యూబన్ల ఓట్లు అధికంగా

ఫ్లోరిడా స్టేట్‌లో క్యూబన్-అమెరికన్ల ఓటుబ్యాంకు అధికం. వారిని ప్రసన్నం చేసుకోవడం అధికారంలో ఉన్న ఏ పార్టీకైనా ఇబ్బందికరమే అనేది విశ్లేషకుల అంచనా. అమెరికాలో బెల్వెథర్ స్టేట్‌గా గుర్తింపు ఉన్న ఫ్లోరిడాకు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగల సత్తా ఉందని అంటున్నారు. 2016లో ఫ్లోరిడాలో తాను కోల్పోయిన 2.1 శాతం ఓట్లను తిరిగి సాధించుకోవడంపై ట్రంప్ దృష్టి పెట్టారని చెబుతున్నారు. అప్పటి ఎన్నికల్లో డెమోక్రాట్ల తరఫున పోటీ చేసిన హిల్లరీ క్లింటన్ కంటే ఈ సారి జో బిడెన్ రూపంలో డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి పోటీ ఎదురైందని, సహజంగా డెమోక్రాట్లకు వ్యతిరేకంగా ఉండే క్యూబన్ అమెరికన్ల ఓట్లను ట్రంప్ ఆకట్టుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. క్యూబన్ల ఓటుబ్యాంకును ఆకట్టుకోవడం అనేది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓ సెంటిమెంట్‌గా మారిందనీ చెబుతున్నారు.

English summary
Florida is a swing state, and has not displayed a strong fidelity for any one political party in several election cycles. In fact, it has been called America’s "bellwether state" for accurately predicting the national mood. Florida is crucial for President Donald Trump
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X