వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా ఎన్నికల బ్యాలెట్‌ పేపర్‌పై తెలుగు భాష- అరుదైన గుర్తింపు- మరో ఆరు భాషలతో కలిపి...

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంటోంది. ఈ ఎన్నికల్లో ఓటేసేందుకు లక్షల సంఖ్యలో ఉన్న ప్రవాస భారతీయులు సిద్ధమవుతున్నారు. వీరిలో కొందరు ఇప్పటికే ఆన్‌లైన్‌ ద్వారా ముందస్తు ఓటు వేశారు. మరికొందరు వచ్చే నెల 3వ తేదీన జరిగే పోలింగ్‌లో పాల్గొనబోతున్నారు. వీరి సౌకర్యం కోసం అమెరికా ప్రభుత్వం, ఎన్నికల యంత్రాగం పలు చర్యలు తీసుకుంటోంది.

అమెరికా ఎన్నికల తుది అంకం- ఓటింగ్‌ బేస్‌పై బిడెన్ గురి-కరోనా చర్యల సమర్ధనలో ట్రంప్...అమెరికా ఎన్నికల తుది అంకం- ఓటింగ్‌ బేస్‌పై బిడెన్ గురి-కరోనా చర్యల సమర్ధనలో ట్రంప్...

అమెరికాలోని పలు రాష్ట్రాల్లో తెలుగు వారి జనాభా అధికంగా ఉంది. భారతీయుల మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న అధ్యక్ష అభ్యర్ధులు ట్రంప్‌, బిడెన్‌ తెలుగు వారి మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో తానా, నాటాతో పాటు మరికొన్ని సంఘాలు ఏర్పాటు చేసుకుని తెలుగు వారు గణనీయమైన ప్రభావం చూపిస్తున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో వారిని తమవైపు తిప్పుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే సమయంలో పోలింగ్‌లో వీరిని తప్పకుండా ఓటేసేలా చూసేందుకు అమెరికా ఎన్నికల యంత్రాగం కూడా ప్రయత్నిస్తోంది.

us election ballot papers also printed in telugu for the convenience of voters

అమెరికా ఎన్నికల పోలింగ్‌లో వాడే బ్యాలెట్‌ పేపర్లను తెలుగువారు అర్ధం చేసుకునేందుకు వీలుగా మిగతా భాషలతో పాటు తెలుగును కూడా ముద్రించారు. మరో ఆరు భాషలతో కలిపి తెలుగులోనూ పలు సూచనలు చేశారు. పోలింగ్ సమయంలో భారీ సంఖ్యలో ఉన్న తెలుగు వారి సౌలభ్యం కోసం ఈ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

us election ballot papers also printed in telugu for the convenience of voters

Recommended Video

US Election 2020 : ట్రంప్ vs జో బైడెన్.. అధ్యక్ష ఎన్నికల చివరి డిబేట్ లో నేతల మధ్య మాటల తూటాలు!

బ్యాలెట్‌పై ఎన్నడూ లేని విధంగా తెలుగు భాషకు కూడా చోటు దక్కడంపై అక్కడి ప్రవాస తెలుగువారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలుగును అమెరికా ప్రభుత్వం అధికారికంగా గుర్తించినట్లు వార్తలు వచ్చినా అవి నిజం కాదని తేలింది. వాస్తవానికి అమెరికాలో ఇంగ్లీష్‌ సహా ఏ భాషనూ అధికారికంగా ప్రభుత్వం ఎన్నికల్లో గుర్తించలేదు.

English summary
us administration print telugu language on upcoming election ballot papers for their voters convenience.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X