వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జో బైడెన్ గెలిస్తే అమెరికా మరో వెనిజులా: ఆయన ఓ చెత్త అభ్యర్థి అంటూ డొనాల్డ్ ట్రంప్ విమర్శలు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ మాటల యుద్ధం జరుగుతోంది. వ్యక్తిగత విమర్శలు కూడా చేసుకుంటూ రెచ్చిపోతున్నారు. అమెరికా చరిత్రలో ఈ స్థాయిలో దిగజారుడు విమర్శలు గతంలో ఎప్పుడూ కూడా చోటు చేసుకోకపోవడం గమనార్హం.

ట్రంప్ డబ్బులు మాయం -హ్యాకర్ల పంజా - రిపబ్లికన్ పార్టీ బ్యాంక్ అకౌంట్ నుంచి గుట్టుగా..ట్రంప్ డబ్బులు మాయం -హ్యాకర్ల పంజా - రిపబ్లికన్ పార్టీ బ్యాంక్ అకౌంట్ నుంచి గుట్టుగా..

జో బైడెన్ అధికారంలోకి వస్తే అమెరికా మరో వెనిజులా..

జో బైడెన్ అధికారంలోకి వస్తే అమెరికా మరో వెనిజులా..

ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్న డొనాల్డ్ ట్రంప్ తన నోటికి పనిచెబుతున్నారు. తాజాగా, మరోసారి ప్రత్యర్థి జో బైడెన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. బైడెన్ లాంటి అభ్యర్థిని అమెరికా ఎన్నికల చరిత్రలోనే చూడలేదని ట్రంప్ విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు అమెరికా కలలకు.. సోషలిస్టుల పీడకలలకు మధ్య జరుగుతున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. తన భార్య మెలినియాతో కలిసి కంపాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ట్రంప్ ఈ మేరకు విమర్శలు గుప్పించారు. ఒక వేళ జో బిడెన్ అధికారంలోకి వస్తే అమెరికా మరో వెనిజులా మాదిరిగా మారిపోతుందని అన్నారు. తాను అధికారంలో ఉన్నత వరకూ అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ సోషలిస్టు దేశంగా మారదు అని తేల్చి చెప్పారు.

జో బైడెన్ అత్యంత చెత్త అభ్యర్థి.. వారికే ప్రజల ఓటు

జో బైడెన్ అత్యంత చెత్త అభ్యర్థి.. వారికే ప్రజల ఓటు

అత్యంత చెత్త అభ్యర్థి(జో బైడెన్)పై పోటీ చేయాల్సి రావడం బాధగా ఉందని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. బైడెన్ సోషలిస్టు భావజాలంతో ఉన్నారని, ఆయన అధికారంలోకి వస్తే అమెరికా అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. కొన్ని రాస్ట్రాల్లో బైడెన్ ముందంజలో ఉన్నారనే వార్తలపై ట్రంప్ స్పందిస్తూ.. ఎవరెన్ని చెప్పినా కష్టపడి పనిచేసేవారికే ప్రజలు ఓటు వేస్తారని ట్రంప్ అన్నారు.

రిపబ్లికన్ పార్టీ గెలుపు ఖాయం: ట్రంప్

రిపబ్లికన్ పార్టీ గెలుపు ఖాయం: ట్రంప్

మన పిల్లలు అమెరికా కలలను వారసత్వంగా పొందాలో? లేదా సోషలిజం మాయలో పడి భవిష్యత్తును నాశనం చేసుకోవాలో ఈ ఎన్నికల్లో ప్రజలు తేల్చుకోవాలని ట్రంప్ అన్నారు. మనం మార్కిస్టులను, సోషలిస్టులను, అల్లరి మూకలను, వామపక్ష తీవ్రవాదులను ఓడించబోతున్నామని ట్రంప్ అమెరికా ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. అమెరికా ప్రజల కోసం పోరాడుతున్నామని ట్రంప్ స్పష్టం చేశారు.

ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ట్రంప్.. రిపబ్లికన్ పార్టీ గెలుపు ఖాయమని వ్యాఖ్యానించారు. కాగా, నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

English summary
The November 3 presidential election is a choice between “the American dream and a socialist nightmare”, President Donald Trump told his supporters as hit out at his Democratic challenger Joe Biden, calling him the “worst” candidate in the history of US presidential politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X