• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రొనాల్డ్ రీగన్ హయాం నుంచీ: అక్కడ ఘోర పరాజయం: డెమొక్రాట్ల కంచుకోటలో పప్పులుడకనట్టే

|

న్యూయార్క్: న్యూయార్క్.. అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ. ఆర్థిక వ్యవస్థకు ఇరుసుగా పనిచేసే రాష్ట్రం. న్యూయార్క్ నుంచి వచ్చే వాటా మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే.. చాలా ఎక్కువ. అందుకే- న్యూయార్క్‌ను అమెరికా ఆర్థిక రాజధానిగా పిలుస్తుంటారు. అలాంటి చోట ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘోరంగా పరాజయం పాలయ్యారు. భారీ తేడాతో ఓటమిని చవి చూశారు. ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నప్పటికీ.. ఇక్కడ విజయం ఎవరిదో తేలిపోయింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. ఆయన ప్రత్యర్థి జో బిడెన్ మధ్య పోల్ అయిన ఓట్ల శాతం మధ్య లక్షల తేడా ఉంటోంది.

 దెబ్బకొట్టిన కరోనా

దెబ్బకొట్టిన కరోనా


న్యూయార్క్ వంటి రాష్ట్రంలో అధికార పార్టీ ఓడిపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనికి ప్రధాన కారణం- కరోనా వైరస్ అనేది బహిరంగ రహస్యంగా చెప్పుకోవచ్చు. కరోనా వైరస్... అమెరికా ఆర్థిక రాజధానిని ఏ స్థాయిలో ఛిన్నాభిన్నం చేసిందో అర్థం చేసుకోవచ్చు. అత్యధిక మరణాలు నమోదైంది న్యూయార్క్‌లోనే. ఇప్పటికీ కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత న్యూయార్క్‌లో కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే దాని తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. దాన్ని కట్టడి చేయడంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విఫలమైందని, అందుకే ఆయనను ఓడిపోయారనేది స్పష్టమౌతోంది.

33 వేల మంది బలి..

33 వేల మంది బలి..

ఒక్క న్యూయార్క్ సిటీలోనే కరోనా వైరస్ బారిన పడి 33,710 మంది మరణించారు. రష్యా, ఫ్రాన్స్, స్పెయిన్, అర్జెంటీనా, కొలంబియా, పెరూ, ఇటలీ, ఇరాన్ వంటి దేశాల్లో నమోదైన కరోనా మరణాల సంఖ్యతో ఇది సమానంగా భావించుకోవచ్చు. 5,50,496 కరోనా పాజిటివ్ కేసులు అక్కడ నమోదు అయ్యాయి. వాటిల్లో 94 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీని ప్రభావం అధ్యక్ష ఎన్నికలపై పడిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. న్యూయార్క్ వంటి అత్యాధునిక నగరంలో..వైద్య సదుపాయాలను ఆశించిన స్థాయిలో కల్పించలేకపోవడం వల్లే అత్యధిక మరణాలు నమోదు అయ్యాయని, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ వైఫల్యం స్పష్టమౌతోందని అంటున్నారు.

73 శాతానికి పైగా ఓట్లు..

73 శాతానికి పైగా ఓట్లు..


న్యూయార్క్‌ ఓటర్లు ఏకపక్షంగా ఓటు వేశారనిపిస్తోంది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌కు ఇక్కడ 73 శాతానికి పైగా ఓట్లు పోల్ అయ్యాయి. ఇంకా చాలా నగరాల్లో ఓట్లను లెక్కిస్తున్నారు. వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే.. ఈ ఓట్ల శాతంలో ఉన్న తేడా మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడున్న సమాచారం ప్రకారం.. డెమొక్రాట్లకు 73.2 శాతం మేర ఓట్లు పోల్ అయ్యాయి. రిపబ్లికన్లకు 26 శాతానికి మాత్రమే ఓట్లు పడ్డాయి. 11,59,962 మంది జో బిడెన్ అభ్యర్థిత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. అదే సమయంలో- ట్రంప్‌కు పడ్డ ఓట్లు 4,34,848 మాత్రమే. అలాగే ఆయనకు ఇప్పటిదాకా 29 ఎలక్టోరల్ ఓట్లు పోల్ అయ్యాయి.

 చాలా ప్రాంతాల్లో మెజారిటీలో బిడెన్..

చాలా ప్రాంతాల్లో మెజారిటీలో బిడెన్..

న్యూయార్క్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో జో బిడెన్ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. జెఫర్‌సన్ కంట్రీ, రెన్‌సెల్లార్ కంట్రీ, వెస్ట్ ఛెస్టర్ కంట్రీ, క్వీన్స్ కంట్రీ, డచ్చెస్ కంట్రీ.. వంటి అనేక ప్రాంతాల్లో బిడెన్‌కు మెజారిటీ లభించింది. ఇర్రీ కంట్రీ, నయాగరా కంట్రీ,సెయింట్ లారెన్స్ కంట్రీ, రిచ్‌మండ్ కంట్రీల్లో డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యతను కనపర్చారు. ఈ ఇద్దరు నేతల మధ్య ఓట్ల శాతం, పోల్ అయిన ఓట్ల సంఖ్య భారీగా ఉండటం వల్ల ఈ స్టేట్‌లో డెమొక్రాట్లు పాగా వేయడం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి- 1984 నుంచీ న్యూయార్క్ ప్రజలు ఏ ఎన్నికలోనూ రిపబ్లికన్లను గెలిపించలేదు.

డెమొక్రాట్లకు పెట్టనికోట..

డెమొక్రాట్లకు పెట్టనికోట..

ఒకరకంగా న్యూయార్క్‌పై ముందు నుంచీ డెమొక్రాట్లదే ఆధిపత్యం కొనసాగడం కూడా భారీ ఆధిక్యతకు కారణమైంది. 2016 ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ ఈ రాష్ట్రాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. డెమోక్రాట్ల తరఫున పోటీ చేసిన హిల్లరీకి 45,56,124 ఓట్లు పోల్ అయ్యాయి. 29 ఎలక్టోరల్ ఓట్లను సాధించారు. 59 శాతం మేర ఆధిక్యతను కనపర్చారు. 2016లో డొనాల్డ్ ట్రంప్‌కు పడిన ఓట్లు.. 36.5 శాతం మాత్రమే. 28,19,534 ఓట్లను ఆయన సాధించారు. అదే ప్రభావం ఇఫ్పుడూ కనిపిస్తోంది. రిపబ్లికన్లకు ఏ మాత్రం అందనంత భారీ సంఖ్యలో ఓట్లను సాధించారు డెమొక్రాట్లు.

English summary
New York has not voted for a Republican since Ronald Reagan in 1984. With 29 electoral votes, it is tied with Florida as the third-largest Electoral College prize. Barack Obama won New York in 2012 by 28.1 percentage points.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X