వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అట్టుడుకుతోన్న అమెరికన్ సిటీ: కౌంటింగ్ వేళ..చెలరేగిన హింస: బీరు బాటిళ్లతో దాడులు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి హింసాత్మక పరిస్థితులు ఏర్పడ్డాయి. అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతోన్న సమయంలో రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల మద్దతుదారులు నిర్వహించిన ప్రదర్శనలు, ర్యాలీలు హింసాత్మక రూపుదాల్చాయి. పరస్పర దాడులకు దారి తీశాయి. ఈ ఘటనలు పలువురు గాయపడ్డారు. ఆందోళనకారులు ప్రైవేటు ఆస్తులపై విధ్వంసానికి దిగారు. పరిస్థితులు అదుపు తప్పడంతో జాతీయ భద్రతా బలగాలను మోహరింపజేశారు.

అమెరికాపై కొత్త పిడుగు: మున్ముందు గడ్డు కాలం: 3 లక్షలమంది బలి?: వాషింగ్టన్ వర్శిటీ వార్నింగ్అమెరికాపై కొత్త పిడుగు: మున్ముందు గడ్డు కాలం: 3 లక్షలమంది బలి?: వాషింగ్టన్ వర్శిటీ వార్నింగ్

కౌంటింగ్ సందర్భంగా అక్రమాలు చోటు చేసుకున్నాయని, అవకతవకలకు పాల్పడ్డారంటో ఆరోపణలు వెల్లువెత్తిన వేళ.. అమెరికా కాలమానం ప్రకారం.. ఒరెగాన్‌లోని డౌన్‌టౌన్ పోర్ట్‌ల్యాండ్ సహా పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి.
రీ కౌంటింగ్ నిర్వహించాలంటూ రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల మద్దతుదారులు చేపట్టిన ర్యాలీలు తొలుత శాంతియుతంగా ప్రదర్శనలు కొనసాగినప్పటికీ.. క్రమంగా ఉద్రిక్తంగా మారాయి. మోరిసన్ బ్రిడ్జి వద్ద ఈ రెండు పార్టీల మద్దతుదారుల ర్యాలీలు పరస్పరం ఎదురుపడ్డాయి.

US Election Result 2020: Riot declared, National Guard activated in downtown Portland

మొదట వారి మధ్య వాగ్యుద్ధం చెలరేగింది. క్రమంగా అది తోపులాటకు దారి తీసింది. దీనితో ఆందోళనకారులు కట్టుతప్పారు. పరస్పరం దాడులకు దిగారు. బీరు సీసాలను విసురుకున్నారు. మొలొటోవ్ కాక్‌టెయిల్ బాటిళ్లు ఆందోళనకారుల చేతుల్లో కనిపించాయి. ఈ ఘటనలలో కొందరు ఆందోళనకారులు గాయపడ్డారు. అల్లర్లకు పాల్పడిన వారిలో 10 మంది పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కత్తులు, ఇతర మారణాయుధాలను స్వాధీనం చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉంచిన వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు.

ఉద్దేశపూరకంగానే దాడులకు పాల్పడటానికి ముందస్తు ప్రణాళికలను రూపొందించుకున్నారని, ఇందులో భాగంగా మారణాయుధాలను వెంట తెచ్చుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. హింస చెలరేగిన కొద్దిసేపటికే గవర్నర్ కేట్ బ్రౌన్.. జాతీయ భద్రతా బలగాలను పోర్ట్‌ల్యాండ్‌కు తరలించారు. మేయర్ టెడ్ వీలర్ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. పోర్ట్‌ల్యాండ్ సిటీ షెరిఫ్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ చీఫ్ నగరంలో మకాం వేశారు.

English summary
The rioting and protesting in Portland and Denver come amid nationwide unrest as votes in the 2020 election continue to trickle in. At least nine arrests have been made Wednesday evening after authorities declared that a protest in downtown Portland had turned into a riot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X