వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా రాజకీయాల్లో నూతన అధ్యాయం: తొలి అడుగు: హిజ్రా ఘనవిజయం: ఎవరామె?

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో సరికొత్త ఒరవడికి తొలి అడుగు పడింది. నూతన అధ్యాయానికి దీన్ని ప్రారంభ సూచికగా భావించుకోవచ్చు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ఓ ట్రాన్స్‌జెండర్.. ఘన విజయాన్ని సాధించారు. డెల్వర్ స్టేట్ సెనెటర్‌గా ఎన్నికయ్యారు. ఆమె పేరు సారా మెక్‌బ్రైడ్. ఓ ట్రాన్స్‌జెండర్.. సెనెట్‌కు ఎంపిక కావడం ఆ దేశ చరిత్రలో ఇదే తొలిసారి. రాజకీయాల్లో ఓ ట్రాన్స్‌జెండర్ సెనెటర్ స్థాయికి చేరుకోవడం ఇదే ప్రథమం. ట్రాన్స్‌జెండర్లకు ఈక్వాలిటీ చట్టాన్ని తీసుకొస్తానని హామీ ఇచ్చిన డెమొక్రాట్ల తరఫున ఆమె ఈ ఎన్నికల్లో పోటీ చేశారు.

రొనాల్డ్ రీగన్ హయాం నుంచీ: అక్కడ ఘోర పరాజయం: డెమొక్రాట్ల కంచుకోటలో పప్పులుడకనట్టేరొనాల్డ్ రీగన్ హయాం నుంచీ: అక్కడ ఘోర పరాజయం: డెమొక్రాట్ల కంచుకోటలో పప్పులుడకనట్టే

లెస్బియన్లు, గే హక్కుల సాధన కోసం..

లెస్బియన్లు, గే, బైసెక్సువల్స్, ట్రాన్స్‌జెండర్ల హక్కుల సాధన కోసం కొంతకాలంగా ఆమె ఉద్యమిస్తున్నారు. ఎల్జీబీటీక్యూ సమస్యలను పరిష్కరించడానికి శ్రమిస్తున్నారు. సమాన పౌరసత్వం (ఈక్వాలిటీ యాక్ట్) చట్టం కోసం సారా మెక్‌బ్రైడ్ అనేక ఉద్యమాలను నిర్వహించారు. తోటి పౌరుల్లాగే.. తమకూ సమాన హక్కులు కల్పించాలనే అంశం మీద ఎల్జీబీటీక్యూ అసోసియేషన్లతో కలిసి పని చేస్తున్నారు. ఇదివరకు హ్యూమన్ రైట్స్ క్యాంపెయిన్‌ అమెరికా విభాగానికి జాతీయ ప్రెస్ సెక్రెటరీగా సారా వ్యవహరించారు.

30 సంవత్సరాల సారా మెక్‌బ్రైడ్

30 సంవత్సరాల సారా మెక్‌బ్రైడ్


30 సంవత్సరాల సారా మెక్‌బ్రైడ్.. డెమొక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేశారు. తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి స్టీవ్ వాషింగ్టన్‌ను ఓడించారు. భారీ మెజారిటీని సాధించారు. ఈ సందర్భంగా ఆమె తన ట్విట్టర్ ద్వారా ఓటర్లకు కృతజ్ఙతలు తెలిపారు. `మేము (ట్రాన్స్‌జెండర్లు) సాధించాం, సాధారణ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించాం..` అంటూ ట్వీట్ చేశారు. ఎల్జీబీటీక్యూల తరఫున తాను పోరాడుతానని చెప్పారు. తన తొలి లక్ష్యం.. ట్రాన్స్‌జెండర్లకు సమాన హక్కులను కల్పించడానికి ఉద్దేశించిన ఈక్వాలిటీ బిల్‌ను సాధించడమేనని అన్నారు.

డెమొక్రాట్ల సానుభూతిపరురాలిగా..

డెమొక్రాట్ల సానుభూతిపరురాలిగా..

సారా మెక్‌బ్రైడ్‌కు డెమొక్రటిక్ పార్టీ సానుభూతిపరురాలిగా గుర్తింపు ఉంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో ఆమె ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2016 ఎన్నికల సందర్భంగా డెమొక్రటిక్ పార్టీ సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. ఆ ఎన్నికల్లో డెమొక్రాట్లు ఓడిపోయారు. రిపబ్లికన్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం మారిన తరువాత.. పూర్తిస్థాయిలో తన కార్యకలాపాలను ఎల్జీబీటీక్యూల కోసం కేటాయించారు. రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

జో బిడెన్ హామీల పట్ల..

జో బిడెన్ హామీల పట్ల..

తాను అధికారంలోకి వచ్చిన తొలి వందరోజుల్లో ఎల్జీబీటీక్యూలకు సమాన హక్కులను కల్పించడానికి ఉద్దేశించిన ఈక్వాలిటీ చట్టాన్ని అమలు చేస్తానంటూ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ చేసిన ప్రకటనల ఆకర్షితులయ్యారు. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. అదే పార్టీ నుంచి డెల్వర్ నుంచి సెనెట్‌కు పోటీ చేశారు. ఘన విజయాన్ని సాధించారు. తన లక్ష్య సాధన ఏమిటో తనకు తెలుసునని, దాని పట్ల తాను ఏం చేయాలనే విషయంపై స్పష్టత ఉందని సారా మెక్‌బ్రైడ్ వ్యాఖ్యానించారు. సెనెటర్‌గా ఆ లక్ష్యాన్ని సాధిస్తానని చెప్పుకొచ్చారు. ఈక్వాలిటీ చట్టం కోసం పోరాడుతానని అన్నారు.

English summary
Sarah McBride has won her Delaware state Senate race, poising her to become the first and only openly transgender state senator in the U.S. and the country's highest-ranking transgender official.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X